Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విజయవంతంగా సార్వత్రిక సమ్మె

$
0
0

కర్నూలు, ఫిబ్రవరి 20: పెరిగిన నిత్యావసర వస్తువులు, కార్మిక భద్రతపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మిక సంఘాలు ఇచ్చిన 48 గంటల సార్వత్రిక సమ్మె జిల్లా వ్యాప్తంగా బుధవారం తొలిరోజు విజయవంతంగా ముగిసింది. సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ప్రతినిధులు రహదారులపైకి వచ్చి ప్రజల మద్దతును కోరారు. కార్మికులు ఉన్న సంస్థలన్నింటిని మూసివేశారు. బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులను స్వచ్చందంగా మూసివేశారు. సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో రోడ్లపై ఆటోలు తిరగలేదు. అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనకపోవడంతో బస్సులు యథావిధిగా తిరిగాయి. ఆటో కార్మికులు బంద్‌లో పాల్గొనడంతో బస్టాండులు, రైల్వే స్టేషన్ల నుంచి ఇళ్ల వెళ్లాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేగాక ఆటోలపై ఆధారపడిన గ్రామీణులు పట్టణాలకు రావడానికి వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు అయిన కర్నూలు, నంద్యాల, ఆదోని మార్కెట్ యార్డులలో కార్మికుల సమ్మె కారణంగా వ్యాపార లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. అంతేగాక లారీ కార్మికులు సైతం సమ్మెలో ఉండటంతో రవాణా వ్యవస్థ కూడా స్థంబించింది. దాంతో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులతో వచ్చిన రైతులు యార్డుల్లోనే ఉండాల్సి వచ్చింది. బ్యాంకు కార్మిక సంఘాలు సమ్మెలో ఉండటంతో ఆర్థిక లావాదేవీలు స్థంబించాయి. బ్యాంకులు పని చేయకపోవడం, కార్మికులు, ఉద్యోగులు బ్యాంకులకు రాకపోవడంతో పలుచోట్ల ఎటిఎంలలో కూడా ఏర్పాటు చేసిన నగదు నిల్వలు అయిపోవడందో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. సినిమా హాళ్లు, పెట్రోల్ బంకు కార్మికులు మధ్యాహ్నం వరకు సమ్మెలో పాల్గొని తరువాత విధులకు హాజరు కావడంతో సాయంత్రం నుంచి పెట్రోల్ అమ్మకాలు, సినిమా ప్రదర్శనను పునఃప్రారంభించారు. మొత్తం మీద జిల్లాలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతంగా ప్రశాంతంగా ముగిసింది.
ఎన్నికల కాలం!
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 20: జిల్లాలో రానున్న ఆరు నెలల కాలం ఎన్నికల కోలాహలం నెలకొననుంది. ఈ నెల ప్రారంభం నుంచి నిన్నటి వరకు సహకార సంఘాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రాజకీయాలు వేడెక్కగా ఆ వేడి చల్లారక ముందే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయా సంఘాల ఓటర్ల జాబితా తయారీని చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరు నాటికి ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మార్చి నెలలో సాగునీటి సంఘాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. సాగునీటి సంఘాల ఓటర్ల జాబితాలో చేరేందుకు అర్హులైన రైతుల వివరాలను రెవెన్యూ అధికారుల సహకారంతో ముందే సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు సాగునీటి శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మార్చి మాసాంతానికి సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తిచేసిఆ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధపడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు జిల్లా అధికారులకున్న సమాచారం బట్టి సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ ఒక్కటే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు సంబంధించి నూతన నివేదికలు రావాల్సి ఉందని వెల్లడించిన విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మేజర్ పంచాయతీలను పురపాలక సంఘాలుగా కొన్ని గ్రామ పంచాయతీలను మేజర్ గ్రామ పంచాయతీలుగా గుర్తించడంతో పాటు మరి కొన్ని మజరా గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించి జీవోలను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీల వివరాలతో పాటు కొత్త రిజర్వేషన్ల వివరాలను సమర్పించాల్సి ఉందని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసి ఎన్నికల సంఘానికి పంపిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తారని వెల్లడిస్తున్నారు. అంతకు ముందు జిల్లాల వారీగా గ్రామ, మండల, జిల్లా పరిషత్‌ల వివరాలను హైదరాబాదుకు పంపడానికి జిల్లా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అంతేగాకుండా కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాల జాబితాను, అక్కడి ఓటర్ల జాబితాను, కులాల వారీగా జనాభా వివరాలను కూడా పంపడానికి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 45 రోజుల సమయం పట్టవచ్చని అంటున్నారు. దీన్నిబట్టి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు ఏప్రిల్, మే మాసాల్లో ఎన్నికలకు ఆస్కారం ఉందని వెల్లడవుతోంది. ఆ తరువాత పురపాలక సంఘాల ఎన్నికలను జులై, ఆగస్టు మాసాల్లో నిర్వహించడానికి ఆటంకాలు తొలిగిపోతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం 957 గ్రామ పంచాయతీలు, 53 మండల పరిషత్‌లు, 53 జడ్పీటీసీలు, 10 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక సాగునీటి సంఘాల విషయంలో సాగునీటి వనరులు పెరిగిన దృష్ట్యా కొత్తగా సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవారం, పది రోజుల్లో ఈపని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వారు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి నెలతో పాటు ప్రారంభమైన ఎన్నికల సందడి ఆగస్టు చివరి వరకు కొనసాగే అవకాశం ఉండటంతో రాజకీయాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
చెరుకు రైతుల ఆగ్రహం.....
చక్కెర ఫ్యాక్టరీ ఫర్నీచర్ దగ్ధం
నంద్యాలరూరల్, ఫిబ్రవరి : నంద్యాల పట్టణ సమీపంలోని అయ్యలూరిమెట్ట వద్ద ఉన్న నంద్యాల చక్కెర ఫ్యాక్టరీలో బుధవారం ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలకు నిరసనగా చెరుకు రైతులు ఆగ్రహంతో ఫ్యాక్టరీలోని ఫర్నీచర్ దగ్ధం చేశారు. చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదేశాలతోనే తాము పొలంలోని చెరుకు పంట కోతకోసి ఫ్యాక్టరీకి తరలించామని, గత వారం రోజులుగా ఫ్యాక్టరీలోనే 1500 టన్నుల చెరుకు నిల్వ ఉన్నా యాజమాన్యం ఏలాంటి చర్యలు చేపట్టకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెరుకు రైతులు కిషన్‌రెడ్డి, బసవేశ్వరరెడ్డి, బంగారురెడ్డి, వెంకటసుబ్బయ్య, నందిపల్లె సాగేశ్వరరెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీకి చెరుకు తీసుకురావాలని యాజమాన్యం చెప్పడంతో తాము పొలంలోని చెరుకు కత్తిరించి ఫ్యాక్టరీకి తరలించామని, అయితే ఫ్యాక్టరీలో చెరుకు తీసుకోకుండా బయటే ఎండకు ఉంచడంతో చెరుకు ఎండిపోతోందని, దీంతో తూకంలో మార్పుతో పాటు తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 50వేల టన్నుల చెరుకు కోతకు సిద్ధంగా పొలంలోనే ఉందని, దీన్ని మేము ఏమి చేసుకోవాలని రైతులు నిలదీశారు. రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో రాయలసీమ జిల్లాల షుగర్‌కేన్ కమిషనర్ రాజేంద్రప్రసాద్ ఫ్యాక్టరీకి చేరుకోగానే రైతులు ఆయన్ను అడ్డుకున్నారు. రైతుల కష్టాలు పట్టించుకోవాలని నిలదీశారు. సమస్య తనకు తెలియదని చెప్పడంతో ఆగ్రహంతో రైతులు నంద్యాల చక్కెర ఫ్యాక్టరీలోని ఫర్నీచర్‌కు నిప్పుపెట్టి, అధికారుల గదులకు తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు.
నేడు చెరుకు రైతులతో కలెక్టర్ సమావేశం: నంద్యాల పట్టణంలోని ఆర్‌ఎఆర్‌ఎస్ సెంటనరీ హాల్‌లో గురువారం ఉదయం 10 గంటలకు చెరుకు రైతులు, నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూధన్‌గుప్తాతో పాటు సంబందింత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

చెరుకును ప్యాక్టరీ యాజమాన్యం తీసుకోవాలి
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 20: నంద్యాలలోని రాయలసీమ షుగర్ ప్యాక్టరీ యాజమాన్యం రైతుల చెరుకు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదేశించారు. బుధవారం నంద్యాల షుగర్ ప్యాక్టరీ వద్ద రైతులతో జేసి కన్నబాబు మాట్లాడుతూ చెరుకు రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. చాల రోజుల నుండి చెరకు బయట ఉండడంతో ఎండిపోవడంతో తూకాలు సరిగారావని జేసికి రైతులు విన్నవించారు. ఈ విషయంపై యాజమాన్యంతో మాట్లాడి రైతుల చెరకు పంటను కొనుగోలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్యాక్టరీ యాజమాన్యాన్ని అదేశించారు. ఈయన వెంట నంద్యాల అర్డీఓ శంకర్, తహశీల్దార్ మాలకొండయ్య, ఆర్‌ఐ రామనాథ్‌రెడ్డి, విఆర్‌ఓ ఉశేనయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.
నాటుతుపాకులు స్వాధీనం
మహానంది, ఫిబ్రవరి 20: మహానంది మండలంలో అక్రమంగా కలిగి ఉన్న 9 నాటు తుపాకులను స్వాధీనం చేసుకొని తొమ్మిదిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం కృష్ణనంది రోడ్డులో అడవి జంతుల వేటకై సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి తుపాకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో బస్సాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఓబులేసు, గాజులపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ, లింగన్న, మదార్‌సా, కలిముద్దిన్, అబ్బిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, తిమ్మాపురానికి చెందిన వుశేన్, మహాదేవపురానికి చెందిన తెలుగు పాపన్నలను నుండి తుపాకులు స్వాధీనం చేసుకొని నిందితులను డిఎస్పీ అమరనాథ్‌నాయుడు విచారించి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.
పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కర్నూలు, ఫిబ్రవరి 20: వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను తమ సొంత పిల్లలాల భావించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి సంక్షేమ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కాన్పరెన్స్‌హాలులో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సంక్షేమ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకంటే ఎక్కువ శాతం పదవ తరగతిలో సాధించేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుతంవున్న ట్యూటర్స్‌తోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గతం నుండివున్న ట్యూటర్స్‌కు మాత్రమే గౌరవ భృతిని ఇస్తామని కొత్తగా ఏర్పాటు చేస్తామని వారికి గౌరవభృతి ఇవ్వడం జరగదని అన్నారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో విద్యార్థులకు ఎక్కువ కాలం చదువుపైనే శ్రద్దవుండేలా అన్నిఏర్పాట్లు చేయాలని ఆట-పాటలకు కొంత సమయమే కేటాయించాలని, పూర్తిగా టివిని తీసివేయాలన్నారు. సంక్షేమవసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుసరిగా ఉండదనే భావనను తీసివేయాలన్నారు. విద్యార్థులకు తరచూ పరీక్షలు ఏర్పాటు చేసి వారి సామర్థ్యాన్ని తెలుసుకుని, వెనుకబడిన వారికి ప్రత్యేక శ్రద్ద తీసుకుని వారిని ముందుకు పంపించాచలన్నారు. ఉపాధ్యాయులు ఈ సమయంలో పాఠశాలలకు 8 గంటలకే హాజరు కావాలని, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రాంతంలోనే ఉండాలన్నారు. ఈ మారు పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించాలని జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులకు చదవించడంతోపాటు ఎక్కువమార్లు వారి చేత చదివించి రాయించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఇఓ బుచ్చన్న, సాంఘీక సంక్షేమశాఖ డిడి సారయ్య, గిరిజన సంక్షేమ అధికారి గిరిధర్, బిసి సంక్షేమ అధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డిఇఓలు శైలజా, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కృష్ణాజలాలు హంద్రీనదికి మళ్లిస్తాం
క్రిష్ణగిరి, ఫిబ్రవరి 20: రానున్న వేసవిలో ప్రజల తాగునీటి సమస్యలు తలెత్తకుండా కృష్ణగిరి రిజర్వాయర్‌లో వున్న కృష్ణ జలాలను హంద్రీ నదికి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్‌పి సిఇవో సూర్యప్రకాష్ అన్నారు. బుధవారం జెడ్‌పి సిఇవో, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఇ పాండురంగయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ కృష్ణారెడ్డి అధికారులు కృష్ణగిరి రిజర్వాయర్‌ను పరిశీలించారు. వేసవిలో హంద్రీనది తీర ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా రిజర్వాయర్‌లో వున్న 40 వేల క్యూసెక్కుల నీటిని హంద్రీనదికి మళ్లించి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయాన్ని సిఇవో తనిఖీ చేశారు. మండలంలోని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టాలని సిఇవో ఎపివోను సూచించారు. ఖాళీగా వున్న పివో స్థానాన్ని త్వరలో భర్తి చేస్తామని ఆయన తెలిపారు. డిఇ రమణరెడ్డి, ఎఇ శాంతన్న పాల్గొన్నారు.

కాశిరెడ్డి నాయన విగ్రహ ప్రతిష్ఠ
అవుకు, ఫిబ్రవరి 20: అవుకు మండలం మంగంపేట సమీపంలోని సీతారామపురంలో బుధవారం జరిగిన కాశిరెడ్డి నాయన విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించబడ్డాయి. కాశిరెడ్డి నాయనకు రూ. 3 కోట్లతో అత్యాధునికంగా దేవాలయాన్ని నిర్మించారు. గత నాలుగ రోజుల నుండి ప్రతిష్ఠ వేడుకలు జరిగాయి. 5వ రోజు కాశిరెడ్డి నాయన విగ్రహ ప్రతిష్ఠతో వేడుకలు ముగిశాయి. వేలాది మంది భక్తులు విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు తిలకించేందుకు రాత్రే ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమ ప్రాంగణములో కోదండ రామాలయం, శివాలయం, కాశిరెడ్డి నాయన ఆలయం, ఆశ్వర్థనారాయణ స్వామి కట్టలను నిర్మించి పూజ కార్యక్రమాలను చేశారు. కోదండ రామాలయం, శివాలయాల వద్ద ద్వజ స్తంబ ప్రతిష్ఠ, కలశ స్థాపనలు నిర్వహించిన అనంతరం ఆశ్వర్థనారాయణ స్వామికట్ట వద్ద నాగప్రతిష్ఠను చేసి నూతనంగా నిర్మించిన కాశిరెడ్డి నాయన ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరుచారులు పద్మావతి అమ్మవారి ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యుల నేతృత్వంలోని 30 మంది వేద పండితుల మంత్రోచారణల మధ్య ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, దక్షణాది రాష్టల్ర సిఆర్‌పిఎఫ్ ఇన్‌చార్జ్ ఐజి రవీంద్రనాథ్‌రెడ్డి, కల్లూరు తహశీల్దార్ తిప్పెనాయక్, కాంగ్రెస్ నాయకుడు ఐవి పక్కీరరెడ్డి పాల్గొన్నారు. శివమాల దీక్షలోవున్న శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె విజయవంతం
నంద్యాల, ఫిబ్రవరి 20: నంద్యాల పట్టణంలో బుధవారం నిర్వహించిన కార్మిక సంఘాల సమ్మె విజయవంతమైనట్లు ఎఐటియుసి నాయకులు ప్ర సాద్, సిఐటియు నాయకులు డి. బాలు, వీరస్వామి, గౌస్, మద్దులు, శ్రీనివాసమూర్తి, శంకరయ్యలు బుధవారం తెలిపారు. దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపుమేరకు నంద్యాల పట్టణంలోని కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ బ్యాంకులు మూసివేయించామన్నారు. సిపిఎం నాయకులు మస్తాన్‌వలి, సిపి ఐ ఎంఎల్ నాయకులు కమాల్‌ఉశన్, నిర్మలలు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం స్పందించి కార్మికులకు వేతనాలు పెంచాలని, పెరిగి పోతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రైవేటీకరణను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు అన్నమ్మ, లక్ష్మయ్య, భా స్కరాచారి, వీరసేన, సోమన్న, శ్యాంప్రసాద్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, రమేష్, వలిబాష, వంశీ, మహామ్మద్, సద్దాంఉశేన్, రామరాజు, లక్ష్మణ్, బంగారం తదితరులు పాల్గొన్నారు.
రుద్రవరంలో...
రుద్రవరం : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో బాగంగా బుధవారం మం డల కేంద్రమైన రుద్రవరంలో గ్రామ పంచాయతీ, ఆటో, అంగన్‌వాడీ కార్యకర్తలు, హమాలి తదితర కార్మికులుచేసిన సమ్మె విజయవంతమైంది. తహశీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సి ఐటియు నాయకులు వెంకట్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాణ్యంలో...
పాణ్యం : కార్మిక ఉద్యోగ వ్యతిరేక విదానాలు అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం పాణ్యం మండల సిఐటియు కార్యదర్శి భాస్కర్ అధ్యక్షతన సమ్మె, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయతీ వర్కర్లు తదితర కార్మిక సంఘాలు మార్కెట్‌యార్డు నుండి రె వెన్యూ కార్యాలయం వరకు గొప్ప ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూ డిన వినతి పత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రా ముడు, రైతు సంఘం, కెవిపిఎస్ నాయకులు కాశీం, చెన్న య్య, దానం, అశీర్వా దం, హమాలి కార్యకర్తలు పాల్గొన్నారు.
చాగలమర్రి...
చాగలమర్రి: అఖిల భారత సమ్మెలో భాగంగా చాగలమర్రిలో బుధవారం సి ఐటియు అధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జ

పెరిగిన నిత్యావసర వస్తువులు, కార్మిక భద్రతపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మిక సంఘాలు ఇచ్చిన 48 గంటల
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>