Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మండలి ఎన్నికకు సర్వం సిద్ధం

$
0
0

గుంటూరు, ఫిబ్రవరి 20: కృష్ణా, గుంటూరు జిల్లాల పట్ట్భద్రుల శాసనమండలి ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. గురువారం గుంటూరు- కృష్ణా జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఏడు రెవెన్యూ డివిజన్లలో పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఎసి కళాశాలలో మండలి ఎన్నికలకు సంబంధించి సామగ్రిని ఆయా పోలింగ్ బూత్‌ల ఏజంట్లకు అందజేశారు. మెటీరియల్ పంపిణీ చేస్తున్న తీరును ఎన్నికల పరిశీలకులు బి రాజశేఖర్, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సురేష్‌కుమార్, ఇన్‌చార్జి జెసి కె శారదాదేవి తదితరులు పరిశీలించారు. ఇదిలా ఉండగా ఎన్నికల పోలింగ్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి 2,19,080 మంది పట్ట్భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కృష్ణా జిల్లాలో 1,08,632 మంది, గుంటూరు జిల్లాలో 1,10,448 మంది ఓటర్లు పోలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి 332 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 159, గుంటూరు జిల్లాలో 173 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 64, మచిలీపట్నం, నూజివీడుల్లో 26, గుడివాడలో 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, గుంటూరు నగరంలో 52, నరసరావుపేటలో 12, తెనాలిలో 14, చిలకలూరిపేట, మంగళగిరిలలో 6, బాపట్లలో 5 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉండగా వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి చిగురుపాటి వరప్రసాద్, బిజెపి నుండి జూపూడి రంగరాజులు పోటీలో ఉన్నారు.

జిల్లాలో తొలిరోజు
సార్వత్రిక సమ్మె సక్సెస్
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో పీకలలోతులో కూరుకుపోయాయని, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని పలు కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దేశవ్యాప్త రెండురోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో, నగరంలో సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఎఐటియుసి, ఎపి ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, ఐఎఫ్‌టియు, ఎఐసిటియు, పికెఎస్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఎఐఎఫ్‌టియులతో పాటు వివిధ కార్మిక సంఘాలు ఆందోళనలు, మానవహారం, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. బ్యాంకు ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర నాయకుడు జివి కృష్ణారావు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి సారిగా జాతీయ కార్మిక సంఘాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ హక్కుల కోసం రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రపంచ
ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయని, వీటిని వ్యతిరేకించేందుకు కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజరోజుకూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనం 10 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ఈ ప్రభుత్వాలకు నూకలు చెల్లుతాయని పేర్కొన్నారు. ఎపి ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి మాట్లాడుతూ ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు పెరిగాయని, వారి సంక్షేమం కోసం పార్కింగ్ స్థలాలు, లైసెన్స్‌లు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని, లైసెన్స్‌ల కోసం 8వ తరగతి నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగెత్తి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, పెంచిన విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎఐటియుసి నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, చల్లా చిన ఆంజనేయులు, జి సురేష్, రావుల అంజిబాబు, సిఐటియు నాయకులు డి లెనిన్, కె శ్రీనివాస్, వేమారెడ్డి, షకీల, ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు, లాలు నాయక్, ఎం మురళీసాంబయ్య, ఎఐఎఫ్‌టియు నాయకులు బలరాం, ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, సత్తయ్య, అప్పారావు, పికెఎస్, ఐఎఫ్‌టియు నాయకులు ఎస్ లక్ష్మారెడ్డి, డి సుధాకర్, ఫణి, భాస్కరరావు, సాయివరప్రసాద్, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు షకీల ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బాబును కలిసిన బాలకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 20: ఎన్నికల కోడ్‌తో పాదయాత్రకు విరామం ప్రకటించి గుంటూరు జిల్లా వేమూరు శివార్లలో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఆయన వియ్యంకుడు, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ బుధవారం ఉదయం కలుసుకున్నారు. సుమారు 4 గంటలపాటు వీరి భేటీ సాగింది. పాదయాత్రలో బాబును అనుసరించే ప్రత్యేక వాహనంలో వీరిద్దరూ బేటీ అయ్యారు. చంద్ర బాబు నాయుడి ఆరోగ్య పరిస్థితితోపాటు ఇటీవల కాలంలో పార్టీ నుంచి జారిపోతున్న ఎమ్మెల్యేలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డిగా
డాక్టర్ షాలినీదేవి
గుంటూరు, ఫిబ్రవరి 20: వైద్యారోగ్యశాఖ జోన్-3 రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ధూళిపూడి షాలినీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ షాలినీదేవిని జోన్-3 ఆర్‌డిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆప్కో డైరెక్టరుగా మురుగుడు నామినేషన్
మంగళగిరి, ఫిబ్రవరి 20: ఆప్కో జిల్లా డైరెక్టర్ పదవికి మంగళగిరికి చెందిన మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు బుధవారం హైదరాబాద్‌లోని ఆప్కో కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరుజిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మురుగుడు నామినేషన్ వేయగా టిడిపి తరఫున చెరుకుపల్లికి చెందిన దివి రాంబాబు నామినేషన్ దాఖలుచేశారు. జిల్లాలో డైరెక్టర్ పదవికి రెండు నామినేషన్లు మాత్రమే దాఖలైనట్లు ఆప్కో అధికారులు తెలిపారు. నామినేషన్లు ఉపసంహరణకు గురువారం గడువుగా ఉంది. దీంతో మురుగుడు ఏకగ్రీవంగా డైరెక్టర్ పదవికి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. రాంబాబు చేత నామినేషన్ ఉపసంహరింప జేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆప్కో చైర్మన్ పదవికి రేసులో ఉన్న మురుగుడు తొలుత జిల్లాలో డైరెక్టర్ పదవికి ఎన్నిక కావాల్సి ఉంది. ఎన్నికలు 23వ తేదీన జిల్లాకేంద్రంలో జరుగుతాయి. 60 సొసైటీల అధ్యక్షులు డైరెక్టర్‌ను ఎన్నుకునేందుకు ఓటువేయాల్సి ఉంటుంది. 23 జిల్లాల్లో ఎన్నికైన డైరెక్టర్లు 25వ తేదీన హైదరాబాదులో ఆప్కో చైర్మన్‌ను ఎన్నుకుంటారు. నామినేషన్ కార్యక్రమంలో మురుగుడు వెంట మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కోమాజీచైర్మన్ వెనిగళ్ల శంకరరావు, ఎఎంసి మాజీచైర్మన్ సుంకర రఘుపతిరావు, చేనేత సొసైటీల అధ్యక్షుడు జంజనం కృష్ణమూర్తి, మునగాల సాంబశివరావు, దేవతి భగవన్నారాయణ, వాకా ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
లక్ష మద్యం పట్టివేత
మేడికొండూరు, ఫిబ్రవరి 20: అక్రమంగా మద్యం అమ్ముతున్న సమాచారం అందడంతో లక్ష రూపాయల విలువ గల మద్యాన్ని పట్టుకున్న సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మండలంలోని పేరేచర్ల సెంటర్‌లో అన్ని మద్యం దుకాణాలకు సీల్ వేయడం జరిగింది. పేరేచర్ల సెంటర్‌లో షేక్ మహమ్మద్ రఫి అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిఐ సుధాకరరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐ అనురాధ దాడి చేసి 748 క్వాటర్ బాటిళ్లు, 347 సింగిల్ క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు వుంటుందని తెలిపారు. ఎస్‌ఐ అనురాధ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణతీర్థులకు తరంగ నృత్యార్చన
గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 20: శ్రీకృష్ణ భగవానుడిపై అమృత తుల్యమైన తరంగాలను రచించి తన భక్తితత్పరతను చాటుకున్న సద్గురు నారాయణతీర్థ యతీంద్రులకు పలువురు కళాకారులు నృత్యార్చన చేశారు. ప్రేక్షక జనావళికి కనువిందు చేసిన ఈ నృత్య కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై శ్రీ సద్గురు నారాయణతీర్థ సమితి ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న తీర్థుల వారి 268వ ఆరాధనోత్సవాల ముగింపు ఉత్సవంలో భాగంగా రుక్మిణీ కల్యాణం పేరిట తరంగ నృత్య సంకీర్తనను సమర్పించారు. నాట్యాచార్య, శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి వ్యవస్థాపకులు కెవి సుబ్రహ్మణ్యం నట్టువాంగ నిర్దేశకత్వంలో 10 మంది కళాకారులు అద్భుతంగా తీర్థుల వారి తరంగ సాహిత్యానికి అనుగుణంగా నృత్యాలను ప్రదర్శించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తరంగ గాన నృత్యపోటీల విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రాబ్యాంకు గుంటూరు డిజిఎం వెంకటేశ్వర్లు బహుమతులను అందజేశారు. తీర్థుల సాహిత్యాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సద్గురు నారాయణతీర్థ సమితి కార్యవర్గ సభ్యులు, రిటైర్డ్ డిఎస్‌పి కె సత్యనారాయణ, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వృద్ధ మహిళపై దాడి...
బంగారు ఆభరణాల చోరీ
నరసరావుపేట, ఫిబ్రవరి 20: పట్టణంలోని పల్నాడురోడ్డు మండవవారి వీధిలో పట్టపగలే ఓ వృద్ధమహిళపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి సుమారు 12 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకపోయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కేసానుపల్లి శ్రీలక్ష్మీ అనే వృద్ధ మహిళగృహంలో నివాసం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి గ్యాస్ పుస్తకం, అధార్‌కార్డుల వివరాలను తెలుసుకునేందుకు వచ్చినట్లు వృద్ధ మహిళ శ్రీలక్ష్మీ తెలిపింది. గృహంలోకి వారు ప్రవేశించిన వెంటనే ఆమెపై దాడిచేసి నోటిలో గుడ్డలుపెట్టి, ఒంటిపై ఉన్న నాలుగు బంగారుగాజులు, ఒక గొలుసు, చెవిదిద్దులను అపహరించుకుపోయారు. అనంతరం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సిఐ సుబ్బారావుసంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పొలాలను పరిశీలించిన బిజెపి నాయకులు
మేడికొండూరు, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు అన్ని కష్టాలే ఎదురయ్యాయని, బిజెపి కిసాన్‌మోర్చ నాయకుడు శౌరిడేవిడ్ అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కిసాన్‌మోర్చ బృందం బుధవారం మండలంలోని సిరిపురం గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డేవిడ్ మాట్లాడుతూ కల్లాల్లోని మిర్చి తడిసి రంగుమారి, బూజుపట్టిందని 50 శాతం తాలుగాయగా మారే ప్రమాదముందన్నారు. పైరులో కూడా పండినకాయలు రంగుమారి, తాలుగాయలుగా మారే అవకాశముందన్నారు. 7 నుంచి 8 తడులు సాగునీరు అందితే ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ ఏడాది సాగర్‌లో నీరు లేక ఆరు తడులకే పరిమితమై 10 నుండి 15 క్వింటాళ్ల వరకే దిగుబడులు వచ్చాయన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలి మధుసూధనరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పందించి నష్టపరిహారం అంచలాను తయారు చేయించి పరిహారం వెంటనే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కడియాల ప్రసాద్, కిసాన్‌మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపని రత్తయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నెలకుదిటి వేణుగోపాల కృష్ణమూర్తి, మండల అధ్యక్షుడు జాలయ్య, ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు చింతాశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

రీచ్‌లో యంత్రాల వాడకంపై విజిలెన్స్ ఆరా
దుగ్గిరాల, ఫిబ్రవరి 20: మండల పరిదిలోని గొడవర్రు ఇసక రీచ్‌లో విజిలెన్స్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు. గనుల, రెవెన్యూ, డామా అధికారులు సర్వేలో పాల్గొన్నారు. టెండర్లద్వారా రీచ్‌లు దక్కించుకున్నవారు యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని పర్యావరణం, భూగర్భజలాలకు నష్టం కలిగించే విధంగా ఎక్కువ లోతు వరకు ఇసుక తొవ్వుతున్నారనే అంశాలపై పరిశీలన జరుపుతున్నట్లు విజిలెన్స్ ఎస్పీ ఆర్ అమ్మిరెడ్డి తెలిపారు. యంత్రాలతో క్వారియింగ్ జరుపుతున్నారనేందుకు క్వారీలో కనిపిస్తున్నా గుర్తులపై పంచానామా నిర్వహించామన్నారు. ఇటీవల తుళ్ళూరు, వీర్లపాలెం రీచ్‌ల్లో సరిహద్దు సర్వే నిర్వహించామని తెలిపారు. ఎక్కువ లోతు అనుమతికి మించి త్రవ్వకాల వల్ల ప్రభుత్వం కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న రీచ్‌లపై వివిధ అంశాలతో కూడిన నివేధికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. పెనుమూడి, జువ్వలపాలెం రీచ్‌ల్లో తనికీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వేలో విజిలెన్స్ డిఎస్పీ అనిల్‌బాబు, ఎఇలు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, సిబ్బంది సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, మైనింగ్ సర్వే అధికారిణి నాగలక్ష్మి, డామా ఎపిడి సురేంద్రబాబు, సీతారామయ్య, స్థానిక రెవెన్యూ అధికారులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు డివిజన్‌లో 46 పోలింగ్ కేంద్రాలు
తెనాలి, ఫిబ్రవరి 20: డివిజన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మొత్తం 46 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సిద్దమైనట్లు ఆర్డీఓ ఎస్.శ్రీనివాసమూర్తి వివరించారు. బుధవారం స్థానిక జెఎమ్‌జె కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పోలింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. డివిజన్‌లోని 18 మండలాల పరిదిలో మొత్తం 46పోలింగ్ కేంద్రాల ద్వారా 34,052మంది పట్ట్భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. ఇందుకుగా ఆయా పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించేందుకు 119మంది అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనున్నట్లు వివరించారు. పోలింగ్ ప్రక్రియకు అవసరమైన సామాగ్రీ పంపిణీ అనంతరం కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేందుకు ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో డిఎస్పీ వై.తులసీరాంప్రసాద్, డిఎల్‌పిఒ సుబ్రహ్మణ్యం, 18 మండలాల తహశీల్దార్లు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

పట్ట్భద్ర ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దు
గుంటూరు (కార్పొరేషన్), ఫిబ్రవరి 20: పట్ట్భద్ర ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు విలువను గుర్తెరిగి సరైన వ్యక్తిని గెలిపించాలని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి సూచించారు. బుధవారం అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి ధనవంతుల హోదాను తెలిపే చిహ్నంగా మారకూడదని, నీతి నిజాయితీ ఉన్నవారికి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. కొంతమంది కోట్లుఖర్చు చేసి గెలవాలని చూస్తున్నారని, అలాంటి వారు గెలిస్తే ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడతారో తెలుసుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకుడు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలంటే మేధావులతో నిండిన ఎగువసభగా పేరుండేదని, కానీ ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి దిగజారి

* నేడు ఉదయం 8 నుండి 4 గంటల వరకు పోలింగ్ * పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>