Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉద్రిక్తత

$
0
0

కడప, ఫిబ్రవరి 20 : జిల్లా రాజకీయాల్లో సహకార ఎన్నికలు చిచ్చు రేపాయి. బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న సంఘటనలు ఇటు అధికారులను అటు రాజకీయ వర్గాలను కూడా కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లలో కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీతోపాటు తరువాత రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ఉప ఎన్నికలు భారీ ఎత్తున జరిగినా ప్రశాంతంగానే ముగిశాయి. కానీ రాజకీయాలతో ప్రమేయం లేకుండా జరగాల్సిన సహకార ఎన్నికలు మాత్రం చిచ్చు రేపుతున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు బుధవారం నిర్వహిస్తారని తెలియడంతో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు ఉదయం 5.00 గంటలకే డిసిసిబి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌సిపికి చెందిన డైరెక్టర్లు బ్యాంకు ప్రధాన గేటు వద్ద మోహరించారు. అనంతరం 8.00 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు వచ్చారు. దీంతో ఇరుపార్టీలకు చెందిన డైరెక్టర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. మరికొంత సేపటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా (పార్టీ కన్వీనర్ సురేష్‌బాబు డిసిసిబి వద్దకు చేరుకున్నారు. ఎన్నికల అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో ఎన్నికలు వాయిదా పడినట్లు ప్రకటించడంతో ఇరువర్గాలకు చెందిన గందరగోళం నెలకొంది. వైకాపకు చెందిన డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ డిసిసిబి కార్యాలయం ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అక్కడకు చేరుకుని 11.00 గంటల లోపల ఎన్నికలు జరపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఒంటిమీద డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరో రెండు రోజులు ఎన్నికలు వాయిదా వేసి డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రద్దు చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్, సోనియాగాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు తాము బయటికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేసే అవకాశాలున్నాయంటూ కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డికి ఫోన్ చేయడంతో ఆయన నేరుగా డీసీసీ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాగానే వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వాహనం మీద చెప్పులు విసిరారు. దీనితో వీరశివారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. దమ్ముంటే ప్రజాబలంతో వైఎస్సార్ పార్టీ నేతలు ఎన్నిక కావాలని సవాల్ విసిరారు. దీంతో డీసీసీ బ్యాంకు వద్ద ఉత్కంఠత నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. చివరకు కలెక్టర్ సాయంత్రం 4.00 గంటలకు గురువారం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో వైఎస్సార్ సీపీ నేతలు బైఠాయింపును ఉపసంహరించుకున్నారు.

కదం తొక్కిన కార్మికులు
* జిల్లాలో మొదటి రోజు సమ్మె విజయవంతం
* సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
* కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు
కడప (అర్బన్), ఫిబ్రవరి 20 : కార్మిక, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బుధవారం జిల్లాలో కార్మిక లోకం కదం తొక్కింది. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సమ్మె విజయవంతం అయింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్న యూపిఎ-2 ప్రభుత్వం పూర్తి విఫలమైందని కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు.దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మె చేయడం చరిత్రలో ఇది మొదటి సారి అన్నారు. కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో ఉన్న యూపిఎ-2 ప్రభుత్వ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రాజీవ్ యువకిరణాల పేరుతో యువకులను సర్కార్ మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. అలాగే ఖాళీలు భర్తీ చేయడకుండా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. కష్టపడి పని చేసే సిబ్బంది జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు వర్కర్స్ కు రూ.10 వేల కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఆర్‌సి సక్రమం అమలు చేయాల్సి ఉందన్నారు. ధరలను నియంత్రించి సామాన్య, పేద, మధ్యతరగతి, కార్మిక, ఉద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో అవినీతి, అక్రమాలు పెట్రేగి పోయాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచి ఉద్యోగుల నడ్డి విరుస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉప సంహరణకు వెంటనే స్వస్తి పలికాలన్నారు. తొలుత కార్పొరేషన్ కార్యాలయం నుంచి లక్ష్మీరంగ, జియోన్ కళాశాల, ఉదయ్ చిన్నపిల్లల ఆస్పత్రి, ఎన్టీ ఆర్ సర్కిల్, ఏడురోడ్ల మీదుగావేలాది మంది జెండాలతో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి ఎన్ రవిశంకర్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, ఎల్‌ఐసి డిడిజనల్ కార్యదర్శి శుభశేఖర్, జెవివి ఎ రఘునరాథ్‌రెడ్డి, ప్రభాకర్, రాజు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామయ్య, నగర కార్యదర్శి మల్లికార్జున, వేణుగోపాల్, సిఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి బి మనోహార్, అద్యక్షుడు ఎస్ సిద్దిరామయ్య, నగర కార్యదర్శి శంకర్, ధనలక్ష్మి, పావని, మెడికల్ స్టాప్ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు అమర్, శీను, పవన్, హరి, భరత్, వెంకటేష్, నాయుడు, జాకీర్, గంగాదేవి, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్ నాయకులు జేమ్స్, సుబ్బరావు, సావంత్, గోపి, రమేష్, తులసిరామ్, రఘు, అరవింద్, చెన్నయ్యతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
* కలెక్టర్ కోన శశిధర్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 20 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యవర్గ ఎన్నికలు గురువారం ఉదయం 8.00 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం జరగాల్సిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యవర్గ ఎన్నికలు కోరం లేక బుధవారానికి వాయిదా పడ్డాయన్నారు. బుధవారం జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్ కిడ్నాప్‌కు గురై ఆందుబాటులో లేకపోవడంతో సమావేశం నిర్వహించలేకపోయామన్నారు. ప్రత్యామ్నాయంగా ఎన్నికల అధికారి నియామకం కోసం నలుగురు అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ హైదరాబాద్‌లోని సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు సిఫార్సు చేశామన్నారు. ఈ సందర్భంగా న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించామన్నారు. మెప్మా పిడి వెంకటసుబ్బయ్యను ఎన్నికల అధికారిగా నియమిస్తూ గురువారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు పూర్తి భద్రత కల్పించాలని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు అందాయన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం అదృశ్యమైన జిల్లా సహకార అధికారి బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరిగి వచ్చారన్నారు. కిడ్నాప్ సంఘటనపై సహకార అధికారితోపాటు, ఆయన డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారన్నారు. గురువారం ఉదయం యథావిధిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యవర్గ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ మేరకు సభ్యులకు నోటీసులు పంపామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, 9.00 గంటల తరువాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతుందన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కిడ్నాప్‌కు గురైన జిల్లా కో ఆపరేటీవ్ అధికారి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఎన్నికల అధికారిని కిడ్నాప్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారికి ఎన్నికలు పూర్తయ్యేవరకు వ్యక్తిగత భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు తనను కలిసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరినట్లు కలెక్టర్ చెప్పారు.

హైవేరోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేస్తాం
* జాయింట్ కలెక్టర్ నిర్మల
చెన్నూరు, ఫిబ్రవరి 20 : కడప-కర్నూలు జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా భూములు, స్థలాలు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని, అవసరమైతే తిరిగి రీ సర్వే చేస్తామని బాధితులకు జాయింట్ కలెక్టర్ నిర్మల హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం చెన్నూరు మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు, ఇతర సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చెన్నూరు, చిన్నమాచుపల్లె, రాచినాయపల్లె, లాకర్స్‌కొట్టాల ప్రాంతాల్లో జెసిమె పర్యటించారు. చెన్నూరు ట్రంకురోడ్డు నుండి కడపకు వచ్చే క్రాస్ రోడ్డు జిఎన్‌ఆర్‌ఎం జూనియర్ కళాశాల వద్ద ఒక దారిని మూసివేసి ఒక దారి గుండానే చెన్నూరుకు వాహనాలు వెళ్లేందుకు రోడ్డు వేస్తుండడంతో చెన్నూరుకు చెందిన పలువురు మైనార్టీలు, ప్రజలు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడికి వెళ్లి జెసి స్వయంగా పరిశీలించారు. అనంతరం చిన్నమాచుపల్లె వద్ద రోడ్డు విస్తరణలో ఇరువైపులా ఇళ్లు, స్థలాలు, భూములు కోల్పోయిన వారు తమకు అన్యాయం జరిగిందంటూ జెసి దృష్టికి తెచ్చారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. శేషయ్యగారిపల్లె వద్ద టోల్‌గేట్ కోసం భూములు ఇచ్చామని, ప్రస్తుతం కార్పొరేషన్ రేటు ప్రకారం సెంటు 12 లక్షలు విలువజేస్తుండగా తమకు మాత్రం 12 వేలు మాత్రమే సెంటుకు కేటాయించారని, తమకు భూ విలువ రేటు పెంచాలని, టోల్‌గేట్ కోసం భూములు కోల్పోయిన రైతులు జెసి దృష్టికి తేగా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జెసితో పాటు మండల తహశీల్దార్ శాంతమ్మ, మండల సర్వేయర్ నాగభూషణంరెడ్డి, విఆర్వోలు భాస్కర్‌రెడ్డి, నరసారెడ్డి పాల్గొన్నారు.

మంత్రులపై అధిష్టానానికి ఫిర్యాదు
* ఎమ్మెల్యే వీరశివారెడ్డి
కడప (క్రైం), ఫిబ్రవరి 20 : సొంత పార్టీని మోసం చేసి క్రాస్ ఓటింగ్ వేయమని చెప్పిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, సి.రామచంద్రయ్య, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలిసి వైకాపా మద్దతుదారులకు సహకరించారని ఆరోపించారు. వైకాపా నేతల నుండి మంత్రి డిఎల్ భారీగా ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. డిసిసిబి చైర్మన్‌ను ఎన్నుకునే సమయంలో డైరెక్టర్లు మాత్రమే ఉండాలని, అక్కడ ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. డైరెక్టర్ల కిడ్నాప్ కథ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి సృష్టేనని అన్నారు. ఆయన అంగట్లో అమ్ముడుపోయే సరుకది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే వైకాపా బలం కాదని, తమ పార్టీ నేతలే వారితో కుమ్మక్కై ఇలా చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని హైకమాండ్‌ను కోరనున్నట్లు తెలిపారు.
ఒకరిపై మరొకరు ఫిర్యాదులు
డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైకాపా, అధికార పార్టీ చెందిన నేతలు ఒకరిపై ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనపై దాడి చేయడంతో పాటు తమ కార్యకర్తలను దూషించారంటూ కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తల నామినేషన్లు నిలిచిపోవడంతో పిలుచుకుని వస్తుండగా వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, 500 మంది కార్యకర్తలు కలిసి తమ వాహనంపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరారని, అలాగే తన వద్ద ఉన్న డైరెక్టర్ ఎంసి పుల్లయ్యను కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా తమపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని అధికార పార్టీకి చెందిన ఐదుగురు డైరెక్టర్లు కేసు నమోదుచేశారు. మరోవైపు తనకూడా కులంపేరు దూషించారని ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై వైకాపా చెందిన ఎస్సీ సెల్ చైర్మన్ పులి సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఇరువురి వద్ద పనిచేశానని, అయితే వైకాపాలో చేరడంతో తమ కార్యకర్తలతో కోసం డిసిసిబి ఎదుట ఉన్న తనను వీరివురూ దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ఘర్షణ ముగిసిన కొద్ది సేపటికి ఎన్నికల అధికారి చంద్రశేఖర్ కలెక్టర్ బంగ్లాఎదుట ప్రత్యక్షమయ్యారు. ముందుగా కలెక్టర్‌ను కలిసి తాను కిడ్నాప్‌కు గురైనట్లు పేర్కొన్నాడు. అనంతరం నలుగురు తనను కిడ్నాప్ చేసినట్లు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అభివృద్ధిపై దృష్టి సారించండి
* ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి
చెన్నూరు, ఫిబ్రవరి 20 : మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తాగునీటి ఎద్దడి, ఆగిపోయిన పెండింగ్ పనులపై దృష్టి పెట్టి సత్వరమే పూర్తి చేయాలని మండల అధికారులను ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, చెన్నూరు స్పెషల్ ఆఫీసర్ లీలావతి ఆదేశించారు. బుధవారం స్థానిక సభాభవనంలో జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశంలో లీలావతి మాట్లాడుతూ ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఇబ్బందులు పెట్టకుండా ఆయా పనులు చేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి ఎద్దడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటి పథకాలతో పాటు బోర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. విద్యుత్ లేని సమయంలో తాగునీటికి ఇబ్బంది పడకుండా బోర్లు ఉపయోగపడే విధంగా వాటిని ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తుండాలని సూచించారు. మండలంలో వేసవి వస్తున్నందున ఉపాధి పనులు వేగవంతం చేయాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌డబ్ల్యుఓ అధికారి రాధిక, ఎండిఓ విజయకుమారి, మండల వ్యవసాయాధికారి పద్మావతి, ఎపిఎం బాలస్వామి, ఇఓపిఆర్‌డి మహుబూబ్‌చాన్, పిఆర్‌ఎఇ గోపాల్, హౌసింగ్ ఎఇ చిన్నారెడ్డి, ఇతర ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతానికి ఎలుగుబంటి మృతి
సిద్దవటం, ఫిబ్రవరి 20 : మండలం పరిధిలోని భాకరాపేటలోని మందపల్లె గ్రామంలో పట్రా నరసింహులు అనే రైతు పొలంలో విద్యుదుఘాతానికి మంగళవారం రాత్రి ఎలుగుబంటి మృతి చెందింది. రైతు తను సాగు చేసిన పంటకు రక్షణగా పొలం చుట్టూ విద్యుత్ తీగ కంచెను ఏర్పాటు చేసుకుని రాత్రి విద్యుత్ సరఫరా చేశారు. దీంతో అక్కడకు వచ్చిన ఎలుగుబంటి విద్యుత్ కంచె తగలి మృతి చెందింది. ఉదయానే్న సమాచారం తెలుసుకున్న అటవీశాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పట్రా నరసింహులను అరెస్టు చేశారు. అనంతరం ఎలుగుబంటిని పోస్టుమార్టం నిర్వహించి సమీప అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. ఈ సందర్భంగా సబ్ డిఎఫ్‌వో గురుప్రభాకర్ మాట్లాడుతూ మృతి చెందిన ఎలుగుబంటికి 3,4 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. రైతులు పొలాలకు విద్యుత్ సరఫరా చేస్తే వారిపై చర్యలు తీసుకొని వారి నివాస గృహలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామన్నారు. అటవీ ప్రాంతాల సరిహద్దుల నుంచి 100 మీటర్ల పరిధిలో పొలాలలు ఇలాంటి పంటలు వేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖాధికారి సూర్యచంద్రరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేకం
కడప (అర్బన్), ఫిబ్రవరి 20 : కడప-చెన్నై జాతీయ రహదారిలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో గురువారం ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార షరిషత్ అర్గనైజర్ బి ప్రకాష్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గురువారం ప్రొద్దుటూరు శ్రీకనకదుర్గమ్మ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉపన్యాసం, భజనతోపాటు శ్రీ ఆంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో డాక్టర్ బి సుబ్బరాయుడుచే హరికథ కాలక్షేపం జరుగుతుందన్నారు. శుక్రవారం అదే దేవస్థానంలో గోపూజ, కుంకుపూజ కార్యక్రమాలతో పాటు స్థానిక భాగవతార్ శ్రీనివాస్‌చే హరికథ కార్యక్రమాలు లజరుగుతుందన్నారు. కావున భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.
పదవ తరగతి
ఉత్తీర్ణత శాతం పెంచాలి
* డిఇఓ అంజయ్య
రాయచోటి(రూరల్), ఫిబ్రవరి 20 : పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని జిల్లా విద్యాశాఖాధికారి డిఇఓ తెలిపారు. బుధవారం స్థానిక డైట్ కేంద్రంలో డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయా వేలలు పాటించి పాఠశాలలకు హాజరు కావాలన్నారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి పాఠశాలలోను ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. గతంలో కంటే ఈ విద్యాసంవత్సరం 10వ తరగతిలో అధికంగా ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతే కాకుండా పాఠశాలల సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి రంగారెడ్డి, రాయచోటి డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

కారు ఢీకొని బాలిక మృతి
దువ్వూరు, ఫిబ్రవరి 20: మండల పరిధిలోని గుడిపాడు సమీపంలో ఉన్న జాతీయ రహదారిని మహాబూబ్‌చాన్(8) దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన మహబూబ్‌చాన్ గుడిపాడు గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వస్తుండగా మహబూబ్‌చాన్ తల్లి దండ్రులతో పాటు జాతీయ రహదారి దాటుతుండగా ప్రమాదవశాత్తు కర్నూలు వైపువెళ్తున్న మారుతీకారు ఢీకొంది. బాలిక మృతిపై బంధువులు తీవ్రంగా ఆవేదన చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.

* డిసిసిబి వార్‌తో అట్టుడికిన కడప * కలకలం రేపిన డిసివో కిడ్నాప్ సంఘటన * మళ్లీ వాయిదా పడిన ఎన్నికలు * వీరశివారెడ్డి వాహనంపై చెప్పులు * కాలి బూడిదవుతా : వైఎస్ వివేకా
english title: 
u

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>