విశాఖపట్నం (లీగల్), ఫిబ్రవరి 25: యువతి తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధిస్తూ, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.నరసింగరావు సోమవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక నెల జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూసపాటి పద్మజ అందించిన వివరాల ప్రకారం తుంగల సుబ్బారావు (32), డుంబ్రిగుడ మండలం కొర్రాం గ్రామానికి చెందిన వాడు. ఇతడు వ్యవసాయం చేసుకుంటుంటాడు. రవ్వలగూడెం ప్రాంతానికి చెందిన ఎల్ సుందరమ్మ (22) అరకు మండలం మలికిచెర్ల గ్రామంలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. సుబ్బారావు ఆమెను ప్రేమించేవాడు. తనను ప్రేమించమని సుందరమ్మను వేధించేవాడు. ఇతని బాధలు తట్టుకోలేక సుందరమ్మ సుబ్బారావుపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు సుబ్బారావును అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరచగా, కొంత కాలం శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన తరువాత బయటకు వచ్చిన సుబ్బారావు 20011 ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12 గంటలకు సుందరమ్మ పనిచేస్తున్న స్కూల్‌కు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని మళ్లీ వేధించాడు. అందుకు ఆమె నిరాకరించింది. బడి పిల్లలు చూస్తుండగానే, తన వెంట తీసుకువెళ్లిన కత్తితో పొడిచి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరుపరిచారు. సాక్ష్యాధ్యారాలను పరిశీలించిన మీదట సుబ్బారావుకు పై శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
యువతి తనను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య చేసిన
english title:
u
Date:
Tuesday, February 26, 2013