Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గాదె ఘన విజయం

$
0
0

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: ఉత్తరాంధ్ర శానసమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో గాదె శ్రీనివాసులునాయుడు ఘన విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం స్థానిక స్వర్ణ్భారతి స్టేడియంలో జరిగింది. మొత్తం పోల్ అయిన ఓట్లు 13,239. ఇందులో 253 ఓట్లు చెల్లలేదు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో 4,611 ఓట్లకు గాను, 4,338 ఓట్లు పోలయ్యాయి. విజయనగరం జిల్లాలో 3,723 ఓట్లకు గాను 3,514 ఓట్లు, విశాఖ జిల్లాలో 6,094 ఓట్లకు గాను 5,387 ఓట్లు పోలయ్యాయి. చెల్లిన 12,986 ఓట్లను లెక్కించగా, కొణతల రామారావుకు 564 ఓట్లు, గాదె శ్రీనివాసులు నాయుడుకు 5,224 ఓట్లు, సింహాద్రప్పడుకు 4,084 ఓట్లు, నక్కా దామోదరరావుకు 236, దివాకర్ రాయ్‌కు 54, బొడ్డేపల్లి మోహనరావుకు 2,423 ఓట్లు, ఎద్దెరపు సత్యంకు 500 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో విజయం సాధించాలంటే, ఒట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఏ అభ్యర్థికైనా 6,494 కన్నా ఒక్క ఓటైనా అధికంగా రావాలి. కానీ ఎవ్వరికీ ఇన్ని ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్ ఆరంభమైంది. మొట్టమొదట కేవలం 54 ఓట్లు వచ్చిన దివాకర్ రాయ్‌ను ఎలిమినేట్ చేశారు. ఆతరువాత 236 ఓట్లు వచ్చిన నక్కా దామోదరరావును, 465 ఓట్లు వచ్చిన కొణతల రామారావును, 500 ఓట్లు వచ్చిన ఎద్దెరపు సత్యంను, 2423 ఓట్లు వచ్చిన బొడ్డేపల్లి మోహనరావును వరుస క్రమంలో ఎలిమినేట్ చేశారు. వీరి ఓట్లను అధిక ఓట్లు వచ్చిన శ్రీనివాసులునాయుడుకు కలుపుకొంటూ వచ్చారు. దీంతో నాయుడుకు 8,464 ఓట్లు లభించాయి. సింహాద్రప్పడు రెండో స్థానంలో నిలచిపోయారు. శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు కలెక్టర్ శేషాద్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రెండోసారి కూడా తనను గెలిపించి, ఓటర్లు తన బాధ్యతను మరింత పెంచారని అన్నారు. గడచిన ఆరేళ్లలో తాను ఉపాధాయులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించానని అన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలను రానున్న ఆరేళ్ళ కాలంలో పరిష్కరిస్తానని తెలియచేశారు.

ఉత్తరాంధ్ర శానసమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో గాదె శ్రీనివాసులునాయుడు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>