* ఎండలో తిరిగేవారు చర్మం నల్లబడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ సార్లు మజ్జిగ, పండ్ల రసాలు, మంచినీరు తాగాలి.
* ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖానికి సన్‌క్రీమ్ లోషన్ రాసుకుంటే మేలు.
* నల్లద్రాక్ష గుజ్జులో కాస్త తేనె కలిపి ఉదయం వేళ స్నానానికి ముందు ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది.
* చర్మం మిలమిల మెరవాలంటే పెరుగులో కమలాపండు రసం కలిపి శరీరానికి రాసుకోవాలి. నిమ్మరసంలో కాస్త తేనె లేదా దోసకాయ రసం కలిపి రాసుకున్నా నిగారింపు వస్తుంది.
* పాలపొడిలో కాస్త తేనె, నిమ్మరసం, బాదం నూనె వేసి పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం తళుకులీనుతుంది.
* పండ్ల సందుల్లో ఇరుక్కునే ఆహార పదార్థాలను, పాచిని తీసేందుకు పిల్లలు గుండు సూదులు, అగ్గిపుల్లలు వంటివి వాడకుండా చూడాలి.
* మాంసాహార వంటకాల్లో మసాలా ఎక్కువైతే కాస్త నిమ్మరసం లేదా చింతపండు పులుసు గానీ కలిపితే ఘాటు తగ్గుతుంది.
ఎండలో తిరిగేవారు చర్మం నల్లబడకుండా ఉండాలంటే
english title:
idia
Date:
Thursday, February 28, 2013