Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

మిస్టర్ బీన్ కారు రిపేరు.. వామ్మో..!

Image may be NSFW.
Clik here to view.

బ్రిటీష్ నటుడు మిస్టర్ బీన్‌ని ఆబాలగోపాలం ఎరుగుదురు. 245 దేశాలలో ఈ నటుడి పధ్నాలుగు - మిస్టర్ బీన్ పాత్ర వున్న క్యామెడీ ఎపిసోడ్‌లు జోరుగా అమ్ముడుపోయాయి. వ యసు మళ్లినా- పసిపిల్లాడి మనస్తత్వం, అమాయక చేష్టలు ప్రదర్శిస్తూ- కొన్ని చిక్కుల్ని పరిష్కరించే బీన్ పాత్రలో జీవిస్తున్న ఈ నటుడి అసలు పేరు రోవాన్ అట్కెన్‌సన్. ఈయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎం.ఎ చేస్తున్నప్పుడు మొదట ఈ ఐడియా వచ్చింది. 2011లో అతను తన ఖరీదైన మోటారు కారుని (65 లక్షల పౌండ్ల ఖరీదు చేసే మాక్‌లారెన్ హెచ్1) ఒక చెట్టుకి ఢీకొట్టి మహా భయంకర ప్రమాదంలో పడ్డాడు. దాని రిపేరుకు ఏడాది పట్టింది. మరమ్మతుల ఖర్చులే పధ్నాలుగు లక్షల డాలర్లు (9 లక్షల పౌండ్లు) అయింది. కారు బాగుపడ్డది కానీ.. అతడి భుజానికి తగిలిన దెబ్బ ఇంకా బాధిస్తూనే వుంది!
శృంగారానికి ద్వితీయ ప్రాధాన్యం!
బ్రిటన్ పురుషుల్లో 46 శాతం మంది ఆటలంటే అమితాసక్తి కనబరుస్తూ, శృంగార క్రీడలకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నారట! కొం తమంది పరిశోధకులు జరిపిన ఓ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘వన్ పోల్’ అనే సంస్థ 18 నుంచి 34 ఏళ్ల లోపు వయసు కలిగిన సుమారు వెయ్యి మందిని సర్వే చే యగా ఈ విషయాలు వెలుగు చూశాయి. సర్వేలో పాల్గొన్నవారిలో అధికశాతం మంది ఆటలంటే తమకు ఇష్టమని పేర్కొనగా, 12 శాతం మంది శృంగారం పేరిట తాము ఇంతవరకూ ఎలాంటి ‘రిస్క్’ తీసుకోలేదని చెప్పారు. బ్రిటన్‌లో కీలకమైన నైరుతి ప్రాంతానికి చెందిన పురుషుల్లో 47 శాతం మంది తాము ఎలాంటి ‘థ్రిల్’ కోసం ఉబలాడ పడడం లేదన్నారు. బరువైన వస్తువుల్ని మోయడం కొంతమందికి సరదా కాగా, విభిన్న రుచుల ఆహారం పట్ల 29 శాతం మంది మోజు చూపుతున్నారు.

బ్రిటీష్ నటుడు మిస్టర్ బీన్‌ని ఆబాలగోపాలం ఎరుగుదురు.
english title: 
mr
author: 
- వీరాజీ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>