మాన్... ఎక్కడున్నావురా?’ అరిచింది దుర్గాంబ.
‘వంటింట్లో బెండకాయలు తరుగుతున్నానమ్మా’ అన్నాడు శ్రీమాన్.
‘ఆడాళ్ల పనులు చేయకురా... నాకు చాలా చిరాగ్గా వుంటుంది’ విసుక్కుంది తల్లి.
‘తొమ్మిదవుతోంది.. ఇద్దరం బ్యాంకుకు వెళ్లాలి. పూర్వం రోజుల్లో భార్య వంటింటికే పరిమితం అన్నారు కాబట్టి మగవాడు హాల్లో కూర్చుని మహారాజులా వుండేవాడు. ఇప్పుడలా కాదు కదమ్మా. నాతోపాటు జాబ్ చేస్తూ లోన్ తీసుకుని స్వంత అపార్ట్‌మెంట్ కొని, మనకి అద్దె ఇంటి బాధ తప్పించింది నా భార్య. నేను కట్నం తీసుకోనని పంతం పడితే నాకంటే ఎక్కువ జీతం తెచ్చే వనితని కోడలిగా అంగీకరించవు. అక్కడ పుట్టింట్లో వనితని వాళ్ళమ్మ ఒక్క పనీ చేయనిచ్చేది కాదు. నువ్వేమో కోడలు రాగానే వంటింటి నుంచి తప్పుకున్నావు. అన్ని పనులకీ ఓ మనిషిని పెట్టుకోవచ్చు గానీ, నీకు రుచిగా వంట చేసి పెట్టాలని వంట మనిషిని వద్దంది వనిత. ఇంటా బయటా శ్రమ. నాకు వనితని చూస్తే జాలివేస్తోందమ్మా. అందుకే కొద్దిగా ఉడత సాయం..’ అని చెబుతున్న కొడుకుని తెల్లబోయి చూసింది దుర్గమ్మ.
మర్నాడు క్యాబేజీని రంపం పొట్టులా తరిగి, కొబ్బరి చిప్పల్ని కోరి వంటింట్లో స్టౌ ప్రక్కన వుంచింది దుర్గాంబ. అత్త చేసే పనులను చూసి వనిత ఆశ్చర్యపోయింది. ‘నిన్న సౌమ్యంగా నీ గురించి మా అమ్మకు చెప్పేను. చిన్న చిన్న సాయాలు చేస్తే ఎదుటివారిని ఎంతగా సంతోషపెట్టవచ్చో తెలియచేశాను’ అన్నాడు శ్రీమాన్ నవ్వుతూ.
రెండు రోజుల తరువాత కోడలు, కొడుకు బ్యాంకు నుంచి వచ్చేసరికి వేడిగా పకోడి, ఫ్లాస్క్‌లో టీ చూశాక సంబరపడిపోయింది వనిత.
‘‘అత్తయ్యా.. మీరింత శ్రమపడటం.. ఈ వయసులో...’’ అంటుంటే, ‘నీకంటే ఎక్కువ శ్రమ పడుతున్నానా? అయినా ఏభై ఆరేళ్ళకే రిటైర్మెంట్ బాగుండదేమో. మరో నాలుగేళ్ళు పని చేస్తాను’ అని సరదాగా మాట్లాడుతున్న అత్తగారిని కౌగిలించుకుని ముద్దు పెట్టేసుకుంది వనిత.
దుర్గాంబకి చాలా సంతోషం కలిగింది కోడలు చేసిన పనికి.
‘‘అత్తయ్యా.. ఈరోజు నుంచి శ్రీమాన్‌లా నేను కూడా మిమ్మల్ని ‘అమ్మా’ అని పిలుస్తాను’’ అంది నవ్వుతూ.
ఆ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లో బంధించి చిరునవ్వుతో ‘ఇది మీ అమ్మ వాళ్ళింట్లో చూపెడతాను. వాళ్ళంతా ఎంతగా సంబరపడతారో’ అన్నాడు శ్రీమాన్ వనితతో మెల్లగా. అత్తగారు అమ్మగా మారాలంటే- కోడలిని కూతురులా చూసుకుంటూ, చేతనైన రీతిలో సాయం చేస్తే చాలు. ప్రతి ఇల్లూ నిజంగా ఒక స్వీట్ హోం అవుతుంది.
మాన్... ఎక్కడున్నావురా?’ అరిచింది దుర్గాంబ.
english title:
a
Date:
Thursday, February 28, 2013