హైదరాబాద్, ఫిబ్రవరి 9: జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో స్కాలర్‌షిప్‌లకు అర్హులైన విద్యార్థుల జాబితాను వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్ కళాశాలల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఈ సంవత్సరం స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందుతాయని, లేని పక్షంలో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతారని కూడా కలెక్టర్ వ్యాఖ్యానించారు. అంతేగాక, పదిహేను రోజుల్లో పూర్తి వివరాలను సమర్పించని వారిపై కఠిన చర్యలు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎజెసి, ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం స్కాలర్‌షిప్‌లకు అర్హత కల్గిన విద్యార్థుల జాబితాను పంపటంలో ఆలసత్వం వహిస్తున్న డిగ్రీ, ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టి, స్కాలర్‌షిప్‌లను చెల్లిస్తుందని, దాన్ని పూర్తిగా విద్యార్థులే సద్వినియోగం చేసుకునేలా ప్రిన్సిపాల్స్ సహకరించాలన్నారు. కాలేజీలు ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు విద్యార్థుల పూర్తి వివరాలను కాలేజీ ప్రిన్సిపాల్స్ పంపలేదని కలెక్టర్ వెల్లడించారు. సకాలంలో విద్యార్థుల జాబితా పంపటంలో సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తినా, సిబ్బంది సహకారం కావాలన్నా తమకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే తగినంత సిబ్బందిని ఇచ్చినా, సకాలంలో విద్యార్థుల వివరాలు రాలేవన్నారు. వివిధ కాలేజీల్లో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల వివరాలను ఎందుకు పంపలేదో అడిగి తెల్సుకున్నారు. ఫ్రెషర్స్ వివరాలను పంపుటకు సాఫ్ట్‌వేర్ సహకరించటం లేదని కొందరు పేర్కొంటే, మరికొందరు విద్యార్థుల వివరాలను పరిశీలనకు ఎమ్మార్వోలను కేటాయిస్తే వారి రోజువారి విధులు నిర్వహణ వత్తిడితో అల్లాడిపోతున్నారని, ఫలితంగా వారు తమతో పూర్తిగా సహకరించకలేకపోవటం వల్ల ఆలస్యం జరుగుతుందని ప్రిన్సిపాల్స్ వివరించారు. సాఫ్ట్‌వేర్ సమస్యను పరిష్కరించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు సహాయం తీసుకోవాలని సూచించారు. అదనపు సిబ్బంది సహకారం కావాలంటే ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ వారిని సంప్రదించాలని సూచించారు. పదిహేను రోజుల్లో పంపని వారికి తొలుత నోటీసులు జారీ చేయాలని ఎజెసిని ఆదేశించారు. మొత్తం ఫ్రెష్, రెన్యువల్స్ ఎస్సీ,ఎస్టీ,బిసి, ఇబిసి,వికలాంగులతో కలిపి 2011-12 సంవత్సరానికి మొత్తం 68వేల 11 మంది విద్యార్థులు అర్హులు కాగా, ఇందులో 23వేల 917 విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 41వేయి 84 మంది విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, 216 దరఖాస్తులు అసంపూర్తిగా ఉండి, కాలేజీల ద్వారా తిరస్కరించబడినవిగా పరిశీలన అధికారిచే పరిశీలించబడిన దరఖాస్తులు 27వేల 824 కాగా, 12వేల 554 దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉందని, కాలేజీల ద్వారా సిఫార్సు చేయబడిన విద్యార్థుల దరఖాస్తులు సుమారు 27వేల 546 వరకు, సిఫార్సు కాని 278 దరఖాస్తులున్నట్లు తెలిపారు. అనంతరం ఎజెసి సత్యానందం మాట్లాడుతూ విద్యార్థులకు ఇదో మంచి అవకాశమని, దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
స్కాలర్‌షిప్ అర్హుల జాబితాను పంపండి
english title:
ff
Date:
Friday, February 10, 2012