ముషీరాబాద్, ఫిబ్రవరి 9: ఓవైపు సుమధుర గాత్రంతో పాటలు పాడుతూనే మరోవైపు సామాజిక ప్రచారోద్యమం చేస్తూ తనదైన శైలిలో రాణిస్తున్న నగరానికి చెందిన ఓ వర్ధమాన గాయకుడు సామాజిక సేవలో తానుసైతం అంటూ పాల్గొంటున్నాడు. సంగీతం వినగానే స్పందించే ప్రతీక్‌ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ భుజం తట్టి బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దారు. నగరంలోని సైనిక్‌పురి ఇండస్ పబ్లిక్‌స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఎన్వీ ప్రతీక్ తన గానామృతంతో సామాజిక సాహితీవేత్తలు, ప్రముఖుల మన్ననలను పొందుతున్నాడు. కేవలం పాటలు పాడడంతోపాటు సామాజిక అంశాలపై ప్రతీక్ ప్రచారోద్యమం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా, అనాథలకు ఆపన్నహస్తం ఇవ్వాలని, మద్యం సేవించి నడిపే వాహన చోదకులకు వ్యితిరేకంగా, ధూమపానం, ర్యాగింగ్, టీజింగ్, యాసిడ్ దాడులు తదితర సమాజం ఎదుర్కొంటున్న అనర్ధాలపై ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివెళుతూ ప్రదర్శనలు ఇస్తుంటాడు. అన్ని రకాల గీతాలను అలవోకగా ఆలపించే ప్రతీక్ అన్ని వర్గాలనుండి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవలే ఓ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన సరిగమప లిటిల్ ఛాంప్స్‌లో పాలుపంచుకుని సంగీత ప్రియుల మన్ననలు సైతం పొందాడు. సినీ గీతాలపై తననైన మార్కుకోసం తొలిగురువు తల్లిపద్మజ వద్ద తండ్రి సురేష్‌కుమార్ ప్రొత్సాహంతో పాఠాలు నేర్చుకున్నాడు. ప్రతీక్ తల్లి పద్మజ (ఎంఏ సంగీతం), స్వతహాగా గాయని కావడంతో మరింత కలిసివచ్చింది. సామాజిక అంశాలపై ప్రతీక్ ప్రచారోద్యమం తన పుట్టినరోజుతోపాటు తల్లితంద్రులు, చెల్లెలు శరణ్య పుట్టిన రోజు కార్యక్రమాన్ని వృద్ధాశ్రమాలలో, అనాథ పిల్లల మధ్య జరుపుకోవడంతో ఆరంభమైంది. ఇటీవలే రామోజీ ఫిల్మింసిటీలో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో తన ప్రదర్శనతో అలరించాడు. జాతీయ స్థాయి అంతర్ పాఠశాల పోటీలు 2010లో ప్రథమ స్ధానం, సంఘం కళాగ్రూప్ నిర్వహించిన జాతీయ సినీయేతర గీతాల పోటీలు, సినీ గీతాల పోటీలలో ఉన్నత స్థానాలను సాధించాడు. టివీ ప్రదర్శనలోనూ గుర్తింపు సాధిస్తున్నాడు. పిల్లలలో నెలకొన్న ఆసక్తిని ప్రోత్సహిస్తే మరెందరో ప్రతీక్‌లను వెలుగులోకి తేవచ్చు.
సంగీతంతో పాటు సామాజిక ఉద్యమం
english title:
ff
Date:
Friday, February 10, 2012