లాన్సింగ్‌లో కారు దిగి ఇంట్లోకి అడుగుపెట్టేప్పటికి మేం చలిముద్దలం అయ్యాం. కారణం- మైనస్ డిగ్రీల చలి. అమ్మానాన్నలను అమెరికాలో తన ఇంట చూసిన మా అమ్మాయి ప్రత్యూష సంతోషానికి హద్దులు లేవు. పాపం దీప- మా హెవీ సూట్‌కేస్‌లను ఇంట్లోకి చేర్చింది. మేం కబుర్లు చెప్పుకుంటుండగా మా అల్లుడి నుంచి ఫోన్.
‘‘హలో.. మామయ్యా! ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. అందుకే ఎయిర్ పోర్ట్‌కి రాలేకపోయాను. అత్తయ్యా, మీరూ ఓకేనే కదా! జెట్‌లాగ్ ఉందా?’’-శ్రవణ్ పలకరింపు.
‘‘ఎవ్విరి ఒన్ అండ్ ఎవ్విరిథింగ్ ఓకే... అంతా బాగానే ఉంది.’’ అన్నా.
‘‘ఓకే మామయ్యా! ఈవినింగ్ వచ్చాక షాపింగ్‌కి వెళ్దాం. ఆల్రెడీ మీకు స్నో జాకెట్, గ్లోవ్స్ కొన్నాను. ఇంకా స్నోషూస్ కొనాలి... సాయంత్రం షాపింగ్‌కి వెళ్దాం’’-అంటూ శ్రవణ్ ముందు జాగ్రత్త.
మేం అమెరికాలో అడుగుపెట్టేప్పటికే మెడికల్ ఇన్సూరెన్స్ రెడీ...స్నోఫాల్ సీజన్ కాబట్టి మా విషయంలో ఇన్ని రకాల జాగ్రత్తలు.
అందరం రిలాక్స్‌డ్‌గా కాఫీ తాగుతుండగా- ‘‘ఆరు నెలలకోసం ఇన్సూరెన్స్ ఎందుకమ్మా’’ అన్నాను ప్రత్యూషతో.
‘‘లేదంకుల్... అది మస్ట్’’ వాతావరణ ప్రభావం చాల ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫ్లూ షాట్స్ తీసుకుంటారు. ఎందుకంటే కోల్డ్ ఎఫెక్ట్‌కి దూరంగా ఉండటానికి. అందుకే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడ ట్రీట్‌మెంట్ చాల ఎక్స్‌పెన్సివ్. ఎంత సంపాదించినా మందులకు కూడా సరిపోదు. ఆ ఖర్చులు భరించలేకనే ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్. ఒక విధంగా ఇన్సూరెన్స్ అనేది అనారోగ్యానికి, మెడికల్ ఎక్స్‌పెనె్సస్‌కి ఫిజికల్ ఈక్వలెంట్.’’
‘‘పోనీలే.. ఫిజికల్ ఈక్వలెంట్‌కి మెడిసిన్ ఉంది...ఆ ఎక్స్‌పెనె్సస్ కవర్ చేయటానికి ఇన్సూరెన్స్ ఉంది. మరి ఎమోషనల్ ఈక్వలెంట్ సంగతేంటి?’’ అన్నాను.
‘‘అంటే బ్యాడ్‌మూడ్‌లో ఉన్నపుడు ఏం చేయాలనా మీ ఉద్దేశం?’’ దీప ప్రశ్న.
‘‘ఎస్...మనకు అనేకానేక సందర్భాలలో మూడ్ అవుట్ అవుతుంటుంది. చీమ చిటుక్కుమన్నా భరించలేని మూడ్‌లో ఉంటాం... మనకుమనమే ఎమోషనల్‌గా క్రాక్ అవుతుం టాం... అంటే మన భావోద్వేగ తీవ్రతను మనకు మనమే భరించలేం...అప్పుడు చుట్టుపక్కల వారిపై విరుచుకుపడతాం... స్నేహితుల్ని సైతం లెక్కచేయం... పైగా మన మూడ్ అవుట్ కావటానికి వారే కారకులని నిందిస్తుంటాం. ఓ విధంగా ఈ బిహేవియర్ ఎమోషనల్ ఈక్వలెంటే కానీ, బ్యాడ్‌మూడ్ నుండి బయట పడటానికి సరైన ప్రత్యామ్నాయం కాదు. నిజానికి మనం ఇతరులను మన భావోద్వేగాలకి గురిచేయకూడదు. వారిని మన బ్యాడ్‌మూడ్‌కి దూరంగా ఉంచగలగటమే విజ్ఞత. ముందు జాగ్రత్తచర్యగా మనం ఫిజికల్‌గా ఎలా ప్రిపేర్ అవుతున్నామో, ఎమోషనల్‌గానూ ప్రిపేర్ కావాలి.’’
‘‘సాధ్యమంటావా.. దీపా?’’
‘‘ఎందుకు సాధ్యం కాదు... మీకు జలుబు చేస్తే ఏం చేస్తారు? అందరిలో కలవకుండా, ఆ ఇన్‌ఫెక్షన్ అందరికీ సోకకుండా జాగ్రత్తపడతారు. జలుబు, దగ్గు ఇన్‌ఫెక్షన్‌ని కలగజేస్తుందని, అది ఇతరులకు సోకే అవకాశం ఉందని తెలుసుకాబట్టి... ఇతరులూ బాధపడవలసి వస్తుందన్న ఇంగితజ్ఞానంవల్ల... ఇదే ఫార్ములాని మనం ఎమోషనల్‌గాను ఫాలో కావచ్చు కదా! కానీ పెద్దగా పట్టించుకోం. అందుకే మన బ్యాడ్‌మూడ్‌తో ఇతరుల్ని మూడ్‌అవుట్ చేస్తుంటాం. మన ఎమోషనల్ సఫరింగ్‌ని ఇతరులకు సంక్రమింప చేస్తుంటాం.’’
దీప మాట్లాడుతుంటే ఎంతో అనుభవంతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. పదహారేళ్ల పిల్లకి ఏం అనుభవం ఉంటుందిలే? అని కొట్టిపారెయ్యటానికి వీల్లేదనిపిస్తుంది. అనుభవం లేకున్నా తన అబ్జర్వేషన్ సామాన్యమైంది కాదు.
అడపా దడపా అలా తప్పదు!
‘‘అంకుల్! నాది టీన్ సైకాలజీ అంటూ కొట్టిపారెయ్యనంటే ఒక విషయం చెబుతాను. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి, మనల్ని మనం అనలైజ్ చేసుకోవటానికి నేను మరీ చిన్నదాన్నికాదు...నాది మరీ పసిపిల్ల మనస్తత్వమూ కాదు... అలాగని గాలికి కొట్టుకుపోయే వ్యక్తిత్వమూ కాదు. మనల్నిమనం క్రియేట్ చేసుకోవటానికి అనుశీలన ఎంతోఅవసరం. కొన్ని సందర్భాలలో మనల్ని మనమే విమర్శించుకోవలసి ఉంటుంది. మనతో మనమే పోరాటం చేయవలసి ఉంటుంది. ఎంతటి మహాత్ములైనా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి సాదాసీదా వ్యక్తులైనా అడపాదడపా బ్యాడ్‌మూడ్‌లోకి పోవటం సహజం. అసలు బ్యాడ్‌మూడ్ అంటే నాకు తెలీదని ఎవరైనా బుకాయించారనుకోండి- అటువంటివారిని ఏ మాత్రం విశ్వసించకూడదు. ఓపెన్ బుక్‌లా ఉండే వారిని నమ్మితే మనకు ఎటువంటి నష్టం ఉండదు.’’
దీప చిన్నపాటి క్లాస్ తీసుకుంటోందా? అనిపిస్తున్నా... తెలీని విషయాలు ఎన్నో చెబుతోంది. బుద్ధిగా, స్టూడెంట్‌లా వినటమే మంచిది అనిపించింది.
‘‘ఇంతకీ అంకుల్! ఈ బ్యాడ్‌మూడ్‌ని మా టీనేజర్స్ ‘వరల్డ్‌క్లాస్ థాట్ అటాక్’ అంటుంటాం. ప్రపంచీకరణతో ప్రపంచం మొత్తం ఒక్కటై పోతున్నట్లుగా ఈ వరల్డ్‌క్లాస్ థాట్ అటాక్ కూడా ప్రపంచ జనాభాకు చాలా కామన్ అయిపోయింది. కారణం ప్రపంచ పౌరులందరూ దీని రంగూ, రుచీ, వాసనలతో ఎమోషనల్ అయినవారే. సామాన్యంగా బ్యాడ్‌మూడ్‌తో మనలో అభద్రతాభావం నెలకొంటుంది. ప్రతికూల భావనలు అధికం అవుతాయి...వ్యతిరేక ధోరణులు బలపడతాయి... ఆత్మీయులనుకుంటున్నవారు సైతం అసూయాగ్రస్తులనిపిస్తుంటారు... స్నేహితులు సైతం మనకు శత్రువుల్లా అనిపిస్తుంటారు... చివరికి కన్నవారు సైతం ప్రతి విషయానికి మనపై కనె్నర్ర చేస్తున్నట్టనిపిస్తుంది. అంతెందుకు ప్రతి విషయంలోను పరాజితులం అవుతామేమోనన్న భయం వెన్నాడుతుంటుంది. ఇవన్నీ మన బ్యాడ్‌మూడ్ నుండి పుట్టిన భావనలే. దీనికి మీరైనా, నేనైనా అతీతం కాదు. అయితే మా టీనేజర్స్ బయటపడినంత త్వరగా మీ జనరేషన్ బయటపడలేదు. బ్యాడ్‌మూడ్ పరంగా మా జనరేషన్‌కీ, మీ జనరేషన్‌కీ ఉన్న తేడా అది.’’
‘దీపా! ఎక్కడినుండి ఎక్కడికి తీసుకెళ్తున్నావ్?’ అనుకున్నాను మనసులో.
‘‘అసలు మనం బ్యాడ్‌మూడ్‌లో ఉంటాం. ఆ విషయాన్ని మరచి ఇతరులు మనకు సలహాలు ఇస్తున్నా, సర్దిచెప్ప ప్రయత్నిస్తున్నా చెవుల కెక్కించుకోం. వారినే అనుమానిస్తాం... బ్యాడ్‌మూడ్‌తో మనం జీర్ణం చేసుకోలేకపోతున్న అంశాలనే వారి దృష్టికి తీసుకుపోతాం. వారికి అన్నింటినీ విడమరిచి చెప్తాం. వారు మన సమస్యను అర్థం చేసుకుని మనసు ఊరడించే ప్రయత్నంచేస్తుంటే వారినే కోపగించుకుంటాం...చులకనగా చూస్తాం... పైగా వారికే ఎదురుతిరుగుతాం. అలా బ్యాడ్‌మూడ్‌తో వారికి దూరమవుతాం. వారిని దూరం చేస్తూ మనం ఏదో బావుకున్నట్టు ఫీలవుతాం. ఇలా బ్యాడ్‌మూడ్‌తో ఉన్నంతకాలం మనం ఒంటరివారమే అవుతాం. ఆ సమయాలలో ఆత్మీయులైనా, స్నేహితులైనా- పరాయ వాళ్లలా మనకు అనిపిస్తుంటారు.’’
ఫూలిష్ బిహేవియర్..!
‘‘అంతెందుకు.. ఈ బ్యాడ్‌మూడ్‌తోనే జీవితం గడిచిపోదని మనకు తెలుసు. కొన్ని గంటలు లేదా ఒకటిరెండు రోజులు ఈ బ్యాడ్‌మూడ్‌లో ఉంటాం. ఆ తర్వాత దాని ప్రభావం నుంచి బయటపడి గుడ్‌మూడ్‌లోకి వస్తాం. ఆత్మీయులను, స్నేహితులను అక్కున చేర్చుకుంటాం. గుడ్‌మూడ్‌లో ఉంటే ఇతరులు మనకు చెప్పే విషయాలను బుద్ధిగా వింటుంటాం. మనం బ్యాడ్‌మూడ్‌లో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎంత చెత్తగా ఉందో వారు చెబుతుంటే మనమే విని ఆనందిస్తుంటాం, నవ్వుకుంటుంటాం. అంటే బ్యాడ్‌మూడ్‌లో మనది ‘్ఫలిష్ బిహేవియర్’అని తెలిసి వస్తుంటుంది. మొత్తానికి బ్యాడ్‌మూడ్ అనేది- ఫర్ ఎవర్ కాదన్నది మాత్రం స్పష్టం. ఒక విధంగా బ్యాడ్‌మూడ్ తాత్కాలిక ఆవేశం వంటిది.’’
‘‘అవును దీపా..! యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్. బ్యాడ్‌మూడ్ అంటేనే హారిబుల్ మూడ్ అని, ఒక విధంగా దీనే్న ‘లో స్టేట్ ఆఫ్ మైండ్’ అని అనొచ్చు. విలువైన, ఆదరించదగిన అంశాలు సైతం బ్యాడ్‌మూడ్‌వల్ల ఆదరణీయాలు, విలువైనవి కాకుండాపోతుంటాయి. ఇలా బాడ్‌మూడ్ అనేది ప్రతి ఒక్కరూ అనేక మలుపులలో ఎదుర్కోవలసిన స్థితే. పారిపోవాలనుకున్నా వెంటాడే స్థితి ఈ బ్యాడ్‌మూడే. ఎస్కేప్ కావాలనుకోకూడదు - ఫేస్ చేయాలి. ఫేస్ చేయగలిగితేనే అర్థంచేసుకునే అవకాశం దొరుకుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నంలో బ్యాడ్‌మూడ్ అవగాహనకు వస్తుంది. ఎంతటి ఆరోగ్యవంతులకైనా అప్పుడప్పుడు చిరు చిరు అనారోగ్యాలు తప్పవు. అలాగే- ఎంతటి స్ట్రాంగ్ మైండ్‌కైనా ఇలాంటి లో స్టేట్ ఆఫ్ మైండ్, హారిబుల్ మూడ్స్ తప్పవు.’’
‘‘అవును అంకుల్! మేం మేం టీనేజ్‌లో బ్యాడ్‌మూడ్‌ని సైతం పెద్దగా పట్టించుకోం... మహాఅయితే మేం బ్యాడ్‌మూడ్‌లో ఉన్నాం అని తెలుసుకుని, మా ప్రపంచంలో మేం ఉంటాం. మేం అలిగాం అనో, కోపంగా ఉన్నాం అనో- మీ వంటి పెద్దలు మమ్మల్ని నానా విధాల విసిగిస్తారే తప్ప, మేం బ్యాడ్‌మూడ్‌లో ఉన్నామని తెలుసుకునేలా ప్రయత్నించరు. తెలిసినా మా అహం దెబ్బతినేలా మాటలంటుంటారు. మా బ్యాడ్‌మూడ్‌కి కారణం మాకు తెలుసు. అందుకే ఆ సమయాలలో మాకు మేముగా అందరికీ దూరంగా ఉంటుంటాం. మేం ఇంత జాగ్రత్తగా, సెక్యూర్డ్‌గా ఆలోచిస్తుంటే, మా టీనేజర్స్‌ను మీ జనరేషన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందంకుల్!’’ అంది దీప.
ఇది తల బిరుసు సమాధానం మాత్రం కాదు! అర్థం చేసుకోగలిగితే- బ్యాడ్‌మూడ్‌లో సైతం టీనేజర్స్ ఎంత ముందుచూపుతో వ్యవహరించగలుగుతున్నారో తెలుస్తుంది.
టీనేజీ సైకాలజీ
english title:
b
Date:
Thursday, February 28, 2013