Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నకిలీ ధ్రువీకరణ పత్రాలపై విచారణ

$
0
0

నెల్లూరు, ఫిబ్రవరి 28: నకిలీ కుల ధ్రువీకరణల ద్వారా ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం విచారణ జరిపారు. గురువారం తన ఛాంబర్‌లో మొత్తం మూడు ఫిర్యాదులకు సంబంధించి ఈ విచారణ చేపట్టారు. నాటారి గీత, దాసరి పద్మతోపాటు మరో ఫిర్యాదుపై ఈ విచారణ కొనసాగింది.

=======
ముస్తాబవుతున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 28: ప్రభుత్వ మెడికల్ కాలేజి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రానున్న సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిని ముస్తాబు చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజిని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిచడానికి ప్రణాళికలు చేపట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలను అధికారులు మార్చివేస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న హాస్పిటల్‌కు గత రోజుల నుంచి పెయింట్‌లు, రోడ్లు, చుట్టు పక్కల ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్నారు. నెల్లూరీయుల కలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులు మీదుగా నెరవేరబోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజి కోసం ప్రజాప్రతినిధులు పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆనం సోదరుల కృషితో నెల్లూరు జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజి రావడం పట్ల విద్యార్థిల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ముందుగా ఈ నెల 28వ తేదీన ఖాయం అయినప్పటిప్పుడు హైదరాబాదులో జరిగిన బాంబు పేలుళ్ల దృష్ట్యా పర్యటన వాయిదా పడింది. అనంతరం 3,4,5 తేదీలలో పర్యటన ఖాయం చేశారు. ఇదిలావుండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సిఎం టూర్ మళ్ళీ వాయిదా పడింది.

మద్దతు ధరకు తగ్గించి కొనుగోలు చేసే దళారులపై చర్యలు:జెసి
నాయుడుపేట, ఫిబ్రవరి 28: రైతుల వద్ద ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయాలనుకునే వారిపై అవసరమైతే క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడబోమని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. గురువారం ఆయన మండల పరిధిలోని నరసారెడ్డి కండ్రిగ వద్ద రైతులు దళారులకు అమ్ముకుంటున్న ధాన్యాన్ని పరిశీలించారు. తాము నెల్లూరు జిలకర ధాన్యాన్ని పుట్టికి 13600 రూపాయలకు విక్రయిస్తున్నట్లు రైతులు, జెసి దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునిన ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు. గతంలో కొందరు అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు పాస్ బుక్కులు మంజూరు చేశారని, వీలైతే వారిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని తహశీల్దార్‌ను జెసి ఆదేశించారు. ఈ సమస్య ప్రస్తుతం కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చిన వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మండలపరిధిలో ప్రైవేటు వ్యక్తుల చేతులో ఉన్న ప్రభుత్వ భూమినికూడా స్వాధీనపరుచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం నాయుడుపేటలోని ఒక మీ సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారు అందిస్తున్న సేవలను ప్రజలనుండి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తపరిచారు. ఈయనతో తహశీల్దారు చెంచుకృష్ణమ్మ, సివిల్‌సప్లై డిటి కృష్ణారావు, ఆర్‌ఐ గోపీనాథ్‌రెడ్డి, విఆర్‌వో మురళీధర్ తదితరులున్నారు.

ఎర్రచందనం స్వాధీనం
వెంకటగిరి, పిబ్రవరి 28: వెంకటగిరి అటవీశాఖ పరిధిలో డక్కిలి మండలం నాగులపాడు సమీపంలో టాటా మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గురువారం తెల్లవారు జామున స్వాధీనం చేసుకున్నట్టు వెంకటగిరి డిప్యూటి రేంజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. సబ్‌డీఎఫ్‌వో ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది డక్కిలి-వెంకటగిరి మార్గమధ్యంలో నిఘాలో ఉన్న సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న ఓ వాహనాన్ని వెంబడించడంతో స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారైనట్లు చెప్పారు. దీంతో వాహనాన్ని పరిశీలించగా ఐదు లక్షల విలువ చేసే 65 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ దాడుల్లో తమతోపాటు డక్కిలి అటవీ బీట్ అధికారులు పి కుమార్, బి శ్రీనివాసరాజు, కె తిరుపతయ్య తదితరులు ఉన్నారు.
ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 28: రాష్టవ్య్రాప్తంగా ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో సజావుగా, సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి అదనపు జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారి రామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక విఆర్ కళాశాలలో జిల్లాలోని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, చీఫ్ ఎగ్జామినర్లు, సూపరింటెండెంట్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఆరోణలకు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అనుసరించి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు ఈకార్యమ్రంలో ఇంటర్ బోర్డు రీజినల్ అధికారులు వై పరంధామయ్య, జిల్లా కార్యనిర్వహక కమిటీ సభ్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సుందర చైతన్యానందస్వామి అమృతోపన్యాసాలు
ఇందుకూరుపేట, ఫిబ్రవరి 28: జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యావాచస్పతి, శతాధిక గ్రంథకర్త పూజ్య గురుదేవులు సుందరచైతన్యానందుల వారి 219వ జ్ఞాన యజ్ఞ ఆధ్యాత్మిక ప్రవచనాలు నెల్లూరు విఆర్‌సి ప్రాంగణంలో మార్చి 3వ తేదీ నుండి 10 వరకు జరుగుతాయని సుందర సత్సంగ్ నెల్లూరు అధ్యక్షుడు ఐఆర్‌కె రెడ్డి తెలిపారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈకార్యక్రమాన్ని నెల్లూరు సందర సత్సంగం, మురళీకృష్ణ మందిరం వారు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈకార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ జి శేషయ్య, ట్రెజరర్స్ సిహెచ్ కమలమ్మ, ఆదినారాయణ, కె రామచంద్రారెడ్డి, ఎం జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల సాధనపై టైలర్ల భారీ ర్యాలీ
ఇందుకూరుపేట, ఫిబ్రవరి 28: టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల సాధనపై గురువారం నర్తకి సెంటర్ నుండి కస్తూర్భా కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాక్షేత్రంలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిసిసి జిల్లా అధ్యక్షులు చాట్ల నరసింహారావు పాల్గొన్నారు. టైలర్లు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటు, విద్యుత్ రాయితీలు తదితర సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నరసింహారావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయా డెయిరీ చైర్మన్ కె రంగారెడ్డి, టైలర్స్ అసోసియేష్ జిల్లా అధ్యక్షుడు పి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఎస్‌కె మస్తాన్‌వలీ, ట్రెజర్ అబ్దుల్ ఫరూక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జవహర్‌లాల్ నెహ్రూ, నగర అధ్యక్షులు చంద్రవౌళి, పెద్ద సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
టైలర్స్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి రెడ్డప్ప హామీ ఇచ్చారు. నెల్లూరు వినాయక హాలు పక్కన శాంతి కల్యాణ మండపంలో గురువారం జరిగిన టైలర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేన్ వారు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడారు. తొలుత భారీ సంఖ్యలో టైలర్లు ట్రంకురోడ్డు సెంటర్ నుండి విఆర్‌సి వరకు, అక్కడ నుండి ట్రంకు రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రంకురోడ్డులో జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు సయ్యద్ చాంద్‌బాషా, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్‌మదార్, ఎన్ బాబు, జిల్లా ట్రెజర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

వెంకటగిరి, ఫిబ్రవరి 28: త్వరలో జరగనున్న సహకార ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని వసంతకృష్టా కల్యాణ మండపంలో వెంకటగిరి నియోజవర్గ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ స్ధానిక సంస్థల ఎన్నికలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్ధాయిలో విజయం సాధించేందకు ఇప్పటి నుంచి ప్రజల్లో చోచ్చుకొని పోవాలన్నారు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నమ్మకం పోయిందని, టిడిపికి మంచి పవనాలు వీస్తున్నాయని, రానున్న 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో అవినీతి పెట్రెగిపోయిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా ఘన విజయం సాధించేందుకు ఇప్పటి నుండి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. స్థానిక సంస్ధ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలో ఎలాంటి విబేధాలు లేకుండా ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలని సూచించారు. మండలంలోని లాలాపేట సొసైటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో 25మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, స్ధానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, నాయకులు, కర్యకర్తలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెలికం శంకరెడ్డి, కెవికె ప్రసాద్, మేరిగ రామకృష్ణ, బీరం రాజేశ్వరరావు, పులుకొల్లు రాజేశ్వరరావు, మాడా జానకిరామయ్య, సుధాకర్, ప్రసాద్, రాపూరు, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, కలువాయి మండలాల కార్యకర్తలు, పాల్గొన్నారు.

చిదంబరం బడ్జెట్‌పై
మిశ్రమ స్పందన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 28: చీటికి మాటికి పెరిగే పెట్రోల్ ధరలతో నిత్యావసరాలన్నీ నింగినంటుతున్నాయి. ఏడాదికోనాడు బడ్జెట్‌లో ఏవైనా సంక్షేమం గొప్పలు చెప్పినా ఆచరణలో సగటు మనిషికి అక్కరకు రావడం మిథ్య. 2013-14 బడ్జెట్‌లో పెట్రోల్ ధరల అదుపునకు ఊసే లేకపోవడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. పేదలపై పడే భారం తెలియనీయకుండా పాలకులు తీసుకుంటున్నారని విపక్షాల విమర్శలు. మాదంతా ప్రజలపక్షమైన బడ్జెట్టేనంటూ అధికారపార్టీ నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు యథాతధంగా వినిపిస్తున్నాయి.

10లోగా గ్రామపంచాయతీ ఓటర్ల లిస్టు సిద్ధం చేయండి
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 28: మార్చి 10వ తేదీలోగా గ్రామపంచాయితీకి సంబంధించిన ఓటర్ల లిస్టును తయారు చేయాలని డిఎల్‌పి సత్యనారాయణ అన్నారు. గురువారం నెల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నెల్లూరు డివిజన్‌లోని 12 మండలాలకు చెందిన గ్రామ కార్యదర్శులతో ఇఓపిఆర్‌డిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల లిస్టు తయారు చేయటంలో ఎలాంటి రాజకీయాలకు, అవకతవకలకు తావు లేకుండా లిస్టు తయారు చేయాలన్నారు. 2011 గ్రామీణ ఓటరు జాబితా, 2013 నాటి అసెంబ్లీ ఓటర్ల జాబితాను ఏకీకృతం చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ వీరభద్రయ్య, నెల్లూరు డివిజన్‌లోని గ్రామకార్యదర్శలు, ఎండిఓలు పాల్గొన్నారు.

టైలర్ల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే బీద హామీ
కావలి, ఫిబ్రవరి 28: సమాజంలోని ప్రజలకు కనీస అవసరమైన దుస్తులను కుట్టి తద్వారా బృహత్తర బాధ్యతలు నిర్వహిస్తున్న టైలర్లు దుర్భర పరిస్థితిల్లో జీవిస్తున్నారని, వారి సంక్షేమానికి తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు తెలిపారు. గురువారం టైలర్ల దినోత్సవం కాగా పట్టణంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్‌డిఓ కార్యాలయం వద్దనుండి ఒంగోలు బస్టాండ్ సమీపంలోగల ఏవిఎస్ కల్యాణ మండపం వరకు ట్రంకురోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్‌డిఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బీద ముఖ్యఅతిధిలుగా పాల్గొని ప్రసంగించారు. అసోసియేషన్ నాయకులు పట్టణంలోని టైలర్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొనిరాగా ఆయన స్పందించారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా పట్టణంలో 7వేల మందికి స్థలాలు, ఇళ్ళు మంజూరు కాగా అవి ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న వారికే పదుల సంఖ్యలో స్థలాలు వుండగా లేనివారు వాటి కోసం సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులతోపాటు తాను హామీ ఇచ్చిన వరవకాలువ, వరదకాలువ కట్టలపై జీవిస్తున్న బాధిత కుటుంబాలకు చెందిన 350మంది లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు స్వయంగా తాను పోరాడుతున్న మాట నిలబెట్టుకోలేకపోతున్నానని దీనికి కారణం అధికార యంత్రాంగం సహకరించకపోవడమేనని చెప్పారు. స్థలాల విషయమై తాను హామీ ఇవ్వనని అవకాశం వస్తే తప్పనిసరిగా న్యాయం చేస్తానని అన్నారు. టైలర్లంతా ఐక్యంగా వుండి డిమాండ్ల సాధనకు కృషిచేయాలని హితువు పలికారు. ఆర్‌డిఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి మాట్లాడుతూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న టైలర్ల సంక్షేమానికి అవకాశం వున్నంత వరకు ప్రభుత్వం నుండి సాయం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆయన టైలర్ల జీవితాల లోతుల్లోకి వెళ్ళి ప్రసంగించగా సమావేశంలోని వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. అనంతరం బిఎంఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా గత ఏడాది ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయిల విలువైన 25 కుట్టుమిషన్‌లను లబ్ధిదారులకు అందచేసారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు జరిగాయి. ఈకార్యక్రమంలో వస్త్ర వ్యాపారి అమరా యాదగిరి, కాంగ్రెస్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులనాయుడు, వైఎస్‌ఆర్ పార్టీ నేత హజరత్‌రెడ్డి, లోక్‌సత్తా నాయకుడు మాలకొండారెడ్డి, టైలర్ల అసోసియేషన్ నాయకులు జగదీష్, నారాయణ, వెంకటరావు, రమణయ్య, రమేష్, రవికుమార్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ముసునూరులో ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం
కావలి రూరల్, ఫిబ్రవరి 28: మండల పరిధిలోని ముసునూరులోని ఎస్‌సి, ఎస్‌టి కాలనీలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం గురువారం జరిగింది. అనంతరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో సమాజంసైన్స్ అనే అంశంపై ప్రత్యేక శిబిరం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న జెబి కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి నరసింహమూర్తి ప్రసంగిస్తూ విజ్ఞానశాస్త్ర ఆవశ్యకత, పరిణామం, ప్రయోజనాలను వివరించారు. ఈకార్యక్రమంలో ఎంఎస్‌కె జ్యోతి పర్యావరణం దాని ఆవశ్యకతను వివరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాజారహంతుల్లా, ఉపాధ్యాయులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, గ్రామపెద్దలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రమణయ్య, వెంకటరావుల ఆధ్వర్యంలో ఈకార్యక్రమాలు నిర్వహించారు.

రుణాల మంజూరుపై సమీక్ష
కావలి రూరల్, ఫిబ్రవరి 28: ఐకెపి ద్వారా లబ్ధిపొందే వివిధ రకాల రుణ మంజూరుపై స్థానిక ఐకెపి కార్యాలయంలో ఏపిఎం షాలిమ్‌రోజ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా అభయహస్తం, వడ్డిలేని రుణాలు, బీమా పథకాలు, భూపంపిణీ, భూమి అభివృద్ధి, ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, వికలాంగులకు చేయూత, రికార్డుల నిర్వహణ అంశాలపై చర్చ జరిగింది. ఈసమీక్షలో ఐకెపికి చెందిన అధికారులు, సంఘబంధాలు పాల్గొన్నాయి.

‘కుల గణనలో పారదర్శకంగా వ్యవహరించాలి’
కావలి రూరల్, ఫిబ్రవరి 28: కుల గణనకు ఆయా ప్రాంతాల అధికార వర్గాలు పారదర్శకంగా వ్యవహరించాలని కావలి డిఎల్‌పిఓ బాదూషాఖాన్ అధికార వర్గాలను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో డివిజన్‌స్థాయి ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, పంచాయతీ సెక్రటరిలతో ఓటరు నమోదులో అవసరమైన కులాల గణనకు సూచనలు, సలహాలు ఇచ్చారు. 2011లో విడుదల చేసిన ఓటర్ల నమోదు జాబితాలో కుల గణన సక్రమంగా నమోదు కాకపోవడంతో రిజర్వేషన్‌ల కేటాయింపు చేపట్టలేకపోయారని అన్నారు. దీనిని దృష్టిలో వుంచుకొని ప్రస్తుతం సంబంధిత మండలాల పరిధిలోని అధికారుల సమన్వయంతో కార్యదర్శులు వ్యవహరించి కుల గణన సక్రమంగా చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్‌స్థాయి ఎంపిడిఓలు, ఇఓఆర్‌డిఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చండి
గూడూరు, ఫిబ్రవరి 28: పట్టణంలోని ఐసిఎస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఎస్‌ఎంజి ఉన్నత పాఠశాలలో బయట ప్రాంతాల డ్రైనేజీ నీరు వచ్చి నిల్వ చేరడంతో దుర్గంధం వెదజల్లుతోందని గురువారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు సబ్ కలెక్టర్ నివాస్‌కు తెలియ చేశారు. వెంటనే ఆయన స్కూల్ ప్రాంగణాన్ని మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మతో కలసి సందర్శించారు. మురుగునీరు పాఠశాల ప్రాంగణంలో నిలిచి ఉండటాన్ని ఆయన స్వయంగా పరిశీలించి వారం రోజుల్లోగా ఆ నీటిని తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణం ఈ విధంగా ఉంటే విద్యార్థులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వెంటనే ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల మేధాసంపత్తి వెలికి తీసేందుకే సైన్స్ ఎగ్జిబిషన్లు
గూడూరు, ఫిబ్రవరి 28: విద్యార్థుల్లో ఉన్న మేధాసంపత్తిని వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని జిల్లా ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు మండలం నెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి ఎదో ఒక రంగంలో తన ప్రతిభను చూపుతుంటాడని, దానిని ఉపాధ్యాయులు గుర్తించి వారిని ఆ రంగంలో మరింత ప్రోత్సహించాలన్నారు. మరో అతిథి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్నారని, విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకొని తెలియని విషయాలను ఉపాధ్యాయుల నుండి తెలుసుకోవాలన్నారు. పలువురు విద్యార్థులు తయారు చేసిన పరికరాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల హెడ్మాస్టర్ దిలీప్‌కుమార్, ఎంఇఓ సునీల్‌కుమార్, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హెచ్‌ఎంకు ఘనంగా సన్మానం
ఓజిలి, ఫిబ్రవరి 29: మండల కేంద్రమైన ఓజిలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి భాగ్యలక్ష్మి గురువారం పదవీ విరమణ చేసిన సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ పాఠశాలను మంచి క్రమశిక్షణతో తీర్చిదిద్దారని కార్యక్రమంలో ఎంఇఓ సుబ్రహ్మణ్యం, డిటి రవీంద్రనాథ్, హెచ్‌ఎంలు శోభారాణి, పార్వతమ్మ, భాగ్యమ్మ, ఉపాధ్యాయులు చక్రపాణి, దశయ్య, మల్లిఖార్జున రావు, చక్రవర్తి, ప్రభావతమ్మ పాల్గొన్నారు.

నకిలీ ధ్రువీకరణ పత్రాలపై విచారణ
english title: 
h

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>