సంగారెడ్డి,ఫిబ్రవరి 28: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్‌గా టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ అభివర్ణించారు. సామాన్యుడి వ్యతిరేక బడ్జెడ్‌తో పాటు దేశాభివృద్దికి ఏ మాత్రం దోహదం చేయదని అభిప్రాయ పడ్డారు. వ్యవసాయ అధారిత దేశంలో గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి బడ్జెట్‌లో ఏ మాత్రం ప్రోత్సాహం లభించకపోవడం దారుణమైన విషయమన్నారు. రైతులందరూ రుణాల ఊబిలో కూరుకుపోయి ఉంటే రుణ మాఫీ ప్రకటించకపోవడం దారుణమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. చేనేత రంగాన్ని కూడా ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోలేదన్నారు. ద్రవ్యలోటు అధికంగా ఉందని, ద్రవ్యోల్భణం ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం కలవర పెడుతుందని చెప్పిని చిదంబంర ఈ సమస్యల పరిష్కారం కోసం ఏలాంటి చర్యలు తీసుకోవడం పోవడం దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. ఎట్టి పరిస్థితిలో 9 శాతం అభివృద్ధి సాధిస్తామని ప్రధాన మంత్రి మన్మోహన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరిశ్రమల కాడిడారు ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ను మరిచిపోవడం సవతి తల్లి ప్రేమను సూచిస్తుందన్నారు. అంకెల గారఢీతో ఉద్యోగులను, ప్రజలను చిదంబరం మొత్తంగా నిరాశపర్చడం జరిగిందన్నారు. బడ్జెట్‌తో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు సంబంవించవన్నారు.
కిచిడి బడ్జెట్ సిపిఎం నేత చుక్కరాములు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కిచిడిలా ఉందని, ప్రతి తరిగతి ప్రజలను సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో బడ్జెట్‌ను రూపొందించినట్లు ఉందన్నారు. విదేశీ కార్పోరేట్ శక్తులకు, స్వదేశీ గుత్త పెట్టుబడుదారులకు ఉపయోగపడే రీతిలో ఉందన్నారు. 2014 ఎన్నికల్లో మరో మారు యూపిఎ సర్కారు మోస గించడానికే ఈ బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఎరువులకు, పెట్రో ఉత్పత్తులను కేటాయించే సబ్సిడీని భారీగా ప్రభుత్వం తగ్గించడం జరిగిందన్నారు. ఆదాయ పరిమితిని మూడు లక్షలకు పెంచకుండా కేవలం 2.20 లక్షల పెంచడం పూర్తిగా నిరాశ కల్గించిందన్నారు.వౌళిక వసతులకు నిధులను కేటాయించకుండా రక్షణ శాఖకు రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించండం చూస్తూంటే అభివృద్ధికి ఎంతమేరకు చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. మొత్తంగా బడ్జెట్ అంకెల గారఢీగా ఉందే తప్పా ప్రజలు ఉపయోగపడదని విమర్శించారు.
ప్రజలను ఆదుకునే బడ్జెట్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2012-13 దేశ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వి రాంభూపాల్‌రెడ్డి పేర్కోన్నారు.మహిళ బ్యాంకుతో పాటు, వ్యవసాయరంగానికి నిధుల కేటాయింపు,రైతాంగానికి రుణాల కోసం నిధుల కేటాయింపు ఇందుకు నిదర్శనమన్నారు.ఆదాయ పరమితిని కూడా 2.20 లక్షలకు పెంచడం మద్యతరగతికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
దారి మళ్లించిన నిధులను
వెనక్కి తేవాలి
* జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
సంగారెడ్డి,ఫిబ్రవరి 28: ఎస్సీ, ఎస్టీలకు చెందిన వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వాలు దారి మళ్లించడం జరిగిందని వెంటనే వెనక్కు తీసుకవచ్చి ఆ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఐదవ మహాసభ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని కెమిస్ట్ భవన్‌లో గురువారం ఈ మహాసభలు జరిగాయి. ఈ సభలకు రాష్ట్ర అధ్యక్షుడు మురళీ కృష్ణ హాజరై మాట్లాడారు. మే మాసం నుండి ఇళ్ల స్థలాల కోసం, ఉపాధి హామీ పథకం పటిష్టంగా అమలు చేయాలని, విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టాలను తీసుకరావాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సమస్యలను అసలే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.దేశంలో పేదరికం పెరిగిపోతుంటే గతంలో13 మంది ఉన్న కోటీశ్వరుల సంఖ్య నేడు 67కి పెరిగిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుదారుల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.ఉపాధి హామీ పథకం ద్వారా పని దినానాలను 200 రోజులకు పెంచాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచాలని ఆయన కోరారు.ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చకుండా సరఫరా చేయాలని నగదు బదిలీ పథకంతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని సకాలంలో అన్ని పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవలన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎస్సీ , ఎస్టీ సబప్లాన్‌ను పక్కగా అమలు చేయాలని భారీ మొత్తంలో నిధులను కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు దారిమళ్లిన 25 వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకరావాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని మురళీ సభలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం అమ్మకాలను వెంటనే ప్రభుత్వం నిరోధించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు క్రాంతి, రాజయ్య, నర్సింలు, సి ఐ టి యు నేతలు సాయిలు, బి మల్లేశ్, ఎ మాణిక్యం, ఎంపి సర్దార్, రవి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను మహాసభ చేసింది. జిల్లాలోని సింగూరు జలాలను జిల్లా అవసరాలకు ఉపయోగించాలని, భూ పంపిణీ చేపట్టాలని తీర్మానించడం జరిగింది.
సింగూరు ఎత్తిపోతల పనులు పూర్తిచేయాలి
జోగిపేట, ఫిబ్రవరి 28: సింగూరు ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఎత్తిపోతల పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. పుల్కల్ మండలం సింగూరు గ్రామం వద్ద జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. ఎత్తిపోత పనులకు 20 కోట్ల రూపాయలు కేటాయించినందున జూన్ నెల నాటికి పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆదేవిధంగా సింగూర్ కాలువ పనులను కూడా వేగవంతం చేసి రైతులకు తాగు నీరు అందిచాలన్నారు. సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో నిర్మాణ పనులు సాగుతున్న జెయన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని దామోదర్ రాజనర్సింహ హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు, సబ్ కలెక్టర్ భారతి హొళ్ళికేరి, మాజీ జడ్పి చైర్మన్ బాలయ్య, పుల్కల్ తహశీల్దార్ దశరథ్‌సింగ్, నాయకులు మల్లప్ప, వెంకట్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జోగిపేట సిఐ సైదానాయక్, పుల్కల్ ఎస్సై జానకిరాములు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కంపెనీల కాలుష్య నివారణకే
మొక్కల పెంపకం
* సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి
చేగుంట, ఫిబ్రవరి 28: కంపెనీల నుండి వెదజల్లుతున్న కాలుష్యాన్ని ఆరికట్టడానికి చేగుంట ప్రాంతంలో మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అన్నారు. చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వర్షకాలంలో చేగుంట పరిసర ప్రాంతాల్లో హరిత విప్లవం సంతరించాలని ముత్యంరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలో కాలుష్యం వెదజల్లి ప్రజలు ఆనారోగ్యనికి గురైతున్న సర్పంచ్‌లుగాని, అధికారులుగాని పట్టిచుకోకపోవడం విచరాకరమన్నారు. కంపెనీల నుండి గ్రామపంచాయితీలకు రవలసిన పన్ను బకాయిలు వసులు చేయాలి కాని స్వర్థ రాజకీయలకు మాజీ ప్రాజాప్రతినిధులు పాటుపడ్డరిని దీంతో గ్రామలు అభివృద్ది చేందలేదన్నారు. చేగుంట మండలంలో చెట్లు నాటే కార్యక్రమం ముమ్మరం చేసామని ట్యాంకర్ల ద్వారా నీరు అందిచి చేట్లు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామి పనుల్లో చేపట్టిన కందకాల గట్లపై మెక్కలు నాటుతారని ఒక్కో మెక్కకు 25 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఈ ప్రాంతంలో 500 కిలోమీటర్ల పోడువున వివిధ రోడ్లలో చెట్లు నాటనున్నట్లు ఆయన తెలిపారు. ఇజియస్ పనులను నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతున్నయని డబ్బులు వృదా చేస్తే సహించేది లేదన్నారు. నేషనల్ బెనిఫిట్ స్కిమ్ కింద ఆపదలో ఉన్నవారికి చెక్కులు అందిచామన్నారు. హమాలి సంఘం సభ్యుల విశ్రాంతి భవన నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నివాస గృహలు దగ్దమైన పెద కుటుంబాలకు 37 వేల రూపాయలు అందించేందుకు నిధులు విడుదల చేయించామన్నారు. వృద్దాప్య, వితంతు, వికలాంగుల ఫించన్లు పెంచడం జరిగిందన్నారు. మంజీర నీరు దౌల్తబాద్ మండలం వడ్డెపల్లి వరకు పనులు పూర్తి చేశారని చేగుంట తదితరు మండలల్లో పనులు పూర్తి చేయనందున సంబధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ముత్యంరెడ్డి తెలిపారు. 8 కోట్ల రూపాయలతో మహిళ సమైక్య భవనాలకు నిధులు మంజురు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు సంక్షేమం కోసం మాడల్ పాఠశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, రెసిడెన్సియల్, డిగ్రీ కళాశాలలు తాను మంజూరు చేయిస్తున్నప్పటికి తెలంగాణ నాయకుల కుట్రతో తన దిష్టిబొమ్మను దగ్దం చేయడం విద్యార్థులకు తగదన్నారు. నూతనంగా నిర్మించిన చేగుంట మార్కెట్ కమిటీలో మెట్టమెదటి సారిగా ధాన్యం కోనుగోలు చేయడానికి 65 లక్ష్యలు అధికారులు వెచ్చించారన్నారు. చేగుంటలో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి కృఫి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కళాశాలకు బిటి రోడ్డు మంజూరు చేయించినట్లు ముత్యంరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటి తహశీల్దార్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. అనంతరం వివిధ గ్రామపంచయితీయకు బోరుమోటర్లు పంపిణీ చేశారు.
ఉపాధి పనులకోసం ధర్నా
అల్లాదుర్గం, ఫిబ్రవరి 28: గ్రామాలలో ఉపాధిపనులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న తమకు ఇంతవరకు పనులు కల్పించలేదని ఆగ్రహించిన కూలీలు గురువారం నాడు అల్లాదుర్గం ఎంపిపి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో తమకు ఉపాధి పనుల చూపని ఫిల్డ్ ఆసిస్టెంట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలో శ్రమశక్తి సంఘాలున్నప్పటికి ఇంత వరకు కేవలం రెండు సంఘాలకు మాత్రమే పని కల్పించడం ఏమిటని ఆవేధన వ్యక్తం చేశారు. తాము రెక్కాడితేగాని డొక్కాడాని కడు నిరుపేదలమని ప్రభుత్వం తమ కోసం ప్రవేశ పెట్టిన ఉపాధి పనుల ద్వారా కొంతైన ఉపాధి లభిస్తుంటే సంబంధిత అధికారులు తమకు పనులు కల్పించకుండా పొట్టకొడుతున్నారని ఆరోపించారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఈ పనులు జరుగుతున్నప్పటికీ మండల కేంద్రమైన అల్లాదుర్గం ఎందుకిలా వివక్ష చూపుతున్నారని అధికారులను నిలదీశారు. తమకు పనులు కల్పించేవరకు కదలమని ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న ఎంపిడిఓ సుధీర్‌కుమార్ ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించి మార్చి 4 నుండి కూలీలందరికి ఉపాధి పనులు కల్పిస్తామని హామి ఇచ్చారు. కూలీల ధర్నాకు మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బ్రహ్మం సంఘీభావం తెలిపారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
* ఎఐవైఎఫ్ రాష్ట్ర నేత కుమారస్వామి డిమాండ్
సంగారెడ్డి,ఫిబ్రవరి 28: ప్రభుత్వ శాఖాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కార్యాలయంలో గురువారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాది, వైద్యం తదితర రంగాల సమస్యలపై సంఘం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రెండుమార్లు రకరకాల హామీలతో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అటు తర్వాత యువను విస్మరించిందన్నారు. వైద్య , విద్య, ఉపాధి రంగాలను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. ఈ రంగాలను గుత్త పెట్టుబడుదారులు తమ ఆధీనంలో ఉంచుకుని ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారన్నారు. వైద్య రంగంలో వేలాది పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే రైల్వే శాఖలో మూడు లక్షల ఉద్యోగాలు ఉన్న భర్తీ కోసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
సైన్స్‌ఎక్స్‌పోలో అద్భుత పరిశోధనల ఆవిష్కరణ
గజ్వేల్, ఫిబ్రవరి 28: విద్యార్థుల మేథోశక్తికి ప్రతిరూపంగా సైన్స్‌ఎక్స్‌పో నిలుస్తున్నట్లు మాజీ ఎంపిపి, ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం వర్గల్ మండలం నెంటూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మానవ జీవితం సైన్స్‌తోముడిపడి ఉండగా, విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, ఆలోచనాశక్తులను వెలికి తీయడానికి ఇలాంటి సైన్స్‌ఫేర్‌లు దోహద పడుతున్నట్లు తెలిపారు. కంప్యూటర్ యుగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చుతున్న విద్యార్థులకు మాత్రమే చక్కటి ఆవకాశాలు దక్కు తుండగా, విద్యార్థులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి కొత్తకొత్త ఆలోచనలకు అద్యాపకులు రూపకల్పన చేసి మార్గదర్శ కాన్ని నిర్దేశించాలని సూచించారు. ప్రభుత్వం వైజ్ఞానిక ప్రదర్శనలపై దృష్టి సారిస్తూప్రత్యేక సదుపాయాలు, నిధులు సమకూర్చుతూ ప్రోత్సహిస్తోందన్నారు. కాగా వర్గల్, ములుగు, గజ్వేల్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు.
సిద్దిపేటలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
సిద్దిపేట : జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక గురునాధ విద్యాలయంలో ఘనంగా సైన్స్‌డే గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్రతిభ పరీక్షల నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రేపటి తరానికి స్పూర్తిగా నిలువలనే ఉద్దేశ్యంతో ఇలాంటి టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సైన్స్‌పట్ల అవగాహన పెంచి పరిశోధకులుగా నిలవడానికి ఉపాధ్యాయులగా తోడ్పాడాలని తెలిపారు. నిరంతరం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడన్నారు. నేర్చుకున్న అంశాన్ని పరిశోధన చేసేటట్టు చూడాల్సిన బాధ్యత సైన్స్ ఉపాధ్యాయులదన్నారు. పాఠశాలలో సైన్స్‌లో వందకు వంద మార్కులు సాధిస్తు గత సంవత్సరం 10 పాయింట్లు సాధించిన సైన్స్‌లో అద్బుత ప్రతిభ చూపారన్నారు. వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని గొప్ప శాస్తవ్రేత్తలుగా ఎదగాలన్నారు. ఆనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు.
ట్రెస్మా ఆధ్వర్యంలో..
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రికగ్నజైడ్ స్కూల్స్ మెనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రి విద్యాలయంలో సైన్స్ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ట్రెస్మా నేతలు మల్లారెడ్డి, జయపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న అంశాలను పరిశోధన రూపంలో చేసి శాస్తవ్రేత్తలుగా ఎదగి సౌకర్య వంతమైన సమాజాన్ని తయారుచేయాలన్నారు. సర్ సివి రామన్ ఎఫెక్టుతో ప్రపంచానికి దేశం గర్వించేల చేసిన మహానీయున్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్‌లు నిర్వహిస్తు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నతులుగా ఎదగాలన్నారు. ఆనంతరం సైన్స్ టాలెంట్ టెస్టులో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ట్రెస్మా సభ్యులు కృష్ణమాచారి, రవీందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, అనిల్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, యాదగిరి, లక్ష్మినారాయణ, మసూద్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ అక్రమాలపై
తహశీల్దార్ నిలదీత
కొండపాక,ఫిబ్రవరి 28: జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమలు జరిగాయని కూలీలు తహశీల్దార్‌ను నిలదీసిన సంఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఉపాధిహామీ కూలీలకు చెల్లించాల్సిన 26 లక్షల రూపాయలకు ఎలాంటి ఆధారాలూ లేకుండా ఫీల్డు అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడని తమగోడు వెళ్లబోసుకున్నారు. అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపన మేరకు ఫీల్డు అసిస్టెంట్ పై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ స్వామి తెలిపారు.