Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి’

$
0
0

గజపతినగరం, ఫిబ్రవరి 28 : త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని వైఎస్సార్ పార్టీ నియోజకవర్గ నాయుకులు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపిటిసి, సర్పంచ్ పదవులకు త్వరలో ఎన్నికలు నిర్వహించడానిక ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నందున పార్టీ కార్యకర్తలు నాయకులు సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికలు సమర్ధవంతంగా ఎదుర్కొవాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు ప్రజలకు వివరించాలన్నారు.పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైకాపా ప్రచార కార్యదర్శి ఉప్పల ఈశ్వరరావు, బుద్దరాజు రామ్‌జీ, దాసరి జగన్నాధం, పోలిపల్లి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలతో
జనం బెంబేలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 28: ఒకపక్క వేసవి మండిస్తోంది. ఎండలు ముదురుతున్నాయి. చల్లని వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందాలనుకునే ప్రజానీకాన్ని విద్యుత్ శాఖ కలవర పెడుతోంది. గంటల తరబడి విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తూ తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. అధికారికంగా పట్టణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు కోతలు అమలు చేస్తున్నట్టు ప్రకటిస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థ నాలుగు గంటలకు పైగానే కోతలు విధిస్తోందంటూ వినియోగదార్లు గగ్గోలు పెడుతున్నారు. విజయనగరం పట్టణంలో ఉదయం సమయాల్లో రెండు గంటలు, సాయంత్రం సమయాల్లో రెండు గంటల పాటు కోతలు అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా రాత్రి వేళల్లో కూడా విద్యుత్ కోతలకు అధికారులు సన్నద్ధ మవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం వేళల్లో 9 నుంచి 11 గంటల వరకూ, రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలచిపోతోంది. ఇక మున్సిపల్ కేంద్రాల్లో కూడా రోజుకు నాలుగు గంటల పాటు కోతలు అమలవుతున్నాయి. మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది కేవలం అధికారిక కోతల వేళలు మాత్రమే. అనధికారికంగా ఎవర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఇఎల్‌ఆర్) పేరిట జిల్లా కేంద్రం, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా కోతలు విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. విద్యుత్ కోతలనే కంటే విద్యుత్ సరఫరా చేసే సమయాలు ప్రకటించాలని వినియోగదార్లు కోరుతున్నారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా జరగట్లేదు. ఇదిలా ఉండగా జిల్లాలో గృహ విద్యుత్ వినియోగదార్లు సుమారు 5 లక్షలకు పైబడి ఉన్నారు.

గరుడుబిల్లిలో 10 మందికి అతిసార
బొండపల్లి, ఫిబ్రవరి 28 : మండలంలోని గరుడబిల్లి గ్రామంలో అతిసార విజృంభించడంతో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. గ్రామానికి చెందిన లెంక వరలక్ష్మి, కృష్ణమ్మ, మజ్జి అప్పలనర్సమ్మ, పి స్నేహలు గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుంతుండగా మిగిలిన వారు విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తాగునీరు కలుషితంతోపాటు అపారిశుధ్యం కారణంగా వ్యాధి ప్రబలిందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు బాగోలేవని గ్రామ కార్యదర్శి ప్రత్యేక అధికారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన మజ్జి కృష్ణవేణి, పి.రాములప్పలమ్మలు విలేఖర్లకు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాది నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే గ్రామంలోవైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకూ అధికార యంత్రాంగం స్పందించకపోవడం విమర్శలకు గురవుతోంది.

‘పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’
శృంగవరపుకోట, పిబ్రవరి 28 : పార్టీ బలోపేతానికి ప్రతీఒక్కరూ కృషి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎరుకమ్మపేరంటాలు కళ్యాణ మండపంలో గురువారం టిడిపి నియోజకవర్గ విస్తత్ర స్థాయి సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా గడిచిన 10 సంవత్సరాలలో రాష్ట్రం ఆర్ధికంగా దెబ్బతిన్నదన్నారు. ఆర్ధిక నేరాలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, భూకబ్జాలు, ఎక్కువయ్యాయన్నారు., నాయకులే వీరికి కొమ్ముకాస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. పెరిగిన రేట్ల సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చెయ్యాలన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ తమ పార్టీ గతంలో అమలు పరచిన సంక్షేమ పధకాలను కాంగ్రెస్ తంగలోకి తొక్కేసిందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉందన్నారు. సామాన్యమానవులను తాగుబోతులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ద్వారపురెడ్డి జగదీష్, లగుడు సింహాద్రి, ఐవిపి రాజు, రెడ్డి వెంకన్న, బుగత వెంకటేశ్వరరావు, వెంకటనాయుడు, కె.నరసింగరావు, పాల్గొన్నారు.

‘రాజనీతిజ్ఞుడు రాజేంద్రప్రసాద్’
విజయనగరం(పోర్టు), ఫిబ్రవరి 28 : భారత తొలి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ రాజనీతజ్ఞుడని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఉషోదయ టాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రాజు అన్నారు. గురువారం వాసవీక్లబ్, టాకర్స్‌క్లబ్ సంయుక్తంగా ఆఫీసర్స్ క్లబ్బులో నిర్వహించిన రాజేంద్రప్రసాద్ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. తొలిత రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించి గాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చి అనేక జైలు శిక్షలు అనుభవించిన త్యాగశీలి అని కొనియాడారు. వాకర్స్‌క్లబ్ అధ్యక్షుడు ఎర్రనాయుడు, గురుప్రసాద్, డిసివిఎన్ రాజు, చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు కాంతారావు, పి.విశ్వనాధం, ఈపు విజయ్‌కుమర్, గౌరీప్రసాద్ పాల్గొన్నారు.

పింఛన్ల సొమ్ము స్వాహా
శృంగవరపుకోట, ఫిబ్రవరి 28 : ఎస్.కోట పంచాయతీ పరిధిలో 1,17,100 రూపాయల మేరకు పింఛన్ల సోమ్ము అధికారులు స్వాహా చేసినట్లు ఆడిట్‌లో తేలింది. గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో కొద్ది రోజులుగా జిల్లా రిసోర్స్ పర్స్‌న్స్,విలేజ్ సోషల్ ఆడిటర్లు నిర్వహించిన ఆడిట్ ద్వారా ఎస్.కోట పంచాయతీ పరిధిలో 48 మందికి రావలసిన 1,17,100 రూపాయలు స్వాహా అయినట్లు రుజువైందని సంబంధిత అధికారులు బహిరంగంగా వెల్లడి చేసారు. ఉపాధి హామీ పధకం కింద జరిగిన పనులలో 34573 రూపాయలు తప్పుడు లెక్కలు చూపినట్లు రుజువైంది. ఈ మొత్తాలను వారం రోజుల్లో సంబంధిత సిబ్బంది తిరిగి చెల్లించాలని అసిస్టెంట్, విజిలెన్స్ అధికారి ఆదినారాయణ తెలిపారు. అంతే కాకుండా రికవరీ అనంతరం ఈనివేదికలు జిల్లా కలక్టర్‌కు నివేదికలు సమర్పించిన పిదప తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో డుమా పిడి శ్రీరాములనాయుడు, ఎపిడి ప్రసాద్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మీరా షేక్‌మహమద్, చలపతిరావు, ఎంపిడిఓ రమణమ్మ, ఎపిఓ బి.చినప్పయ్య, ఎస్‌ఆర్‌పిలు, డిఆర్‌పిలు, విఎస్‌పిలు పాల్గొన్నారు.
‘ఉపాధి అమలులో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి’
బొబ్బిలి, ఫిబ్రవరి 28: రాష్ట్రంలోనే ఉపాధి హామీ పథకంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. స్థానిక శ్రీకళాభారతిలో ఉపాధి హామీ పథకం గ్రామీణాభివృద్ధికి సంబంధించి బొబ్బిలి క్లస్టర్‌ల సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏ.పి. ఓ.లు, ఉపాధి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే జిల్లాలో 75వేల మంది వేతనదారులకు 100 రోజుల పని కల్పించినట్లు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి మరో 75వేల మందికి పని కల్పించాల్సి ఉందని స్పష్టం చేశారు. సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ఈ పనులను నిర్వర్తించాలన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు గురికాకుండా కూలీలందరికీ పని కల్పించాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా మస్తర్‌ను సక్రమంగా నిర్వహించాలన్నారు. పనులలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు.
అనంతరం బొబ్బిలి, సీతానగరం, గరుగుబిల్లి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బందితో పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమలో డుమా పి.డి. శ్రీరాములు, ఏ.పి.డి. లక్ష్మణరావుతోపాటు ఆరు మండలాలకు చెందిన ఏ.పి. ఓ.లు, ఎం.డి. ఓ.లు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కోతలు ప్రారంభం
విశాఖపట్నం, ఫిబ్రవరి 28: విద్యుత్ కోతలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి వీటిని అమలు చేయాలని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) నిర్ణయించింది. ఏపీ ట్రాన్స్‌కో సిఎండి గురువారం నిర్వహించిన టెలికానె్ఫరెన్స్‌లో రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు (డిస్కామ్) ఆదేశాలు జారీ చేశారు. దీనిలోభాగంగా ఇక్కడి ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఆదేశాలు అందాయి. దీంతో సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ సంస్థప పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లకు నాలుగు గంటలు, మునిసిపాలిటీలకు ఆరు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలపాటు విద్యుత్ కోతలుంటాయి. ఒక్క విశాఖ నగరానికి మాత్రం రెండు గంటలు మాత్రమే కోతలు అమలవుతాయి. ఇందు మునిసిపాలిటీల్లో మూడు గంటల వంతున ఆరు గంటలు, మండల కేంద్రాల్లో నాలుగు గంటల వంతున ఎనిమిది గంటలపాటు కోతలు అమలవుతాయి. ఈ విధంగా అన్ని మున్సిపాలిటీలకు చెందిన పట్టణఆల్లో ఆరు గంటల నుంచి 9 గంటల వరకు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో ఏడు గంటల నుంచి 9 గంటల వరకు కోతలుంటాయి. అలాగే జిల్లా కేంద్రాలు శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు ప్రాంతాలకు 8 గంటల నుంచి పది గంటల వరకు, అన్ని మండల కేంద్రాల్లో 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ కోతలు అమలవుతాయి. విశాఖ నగరంలో (జోన్-2,3) పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కోత ఉంటుంది. విశాఖ నగరంలో జోన్-1 పరిధిలో ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు కోత అమలవుతుంది. మళ్ళీ మధ్యాహ్నాం 1 గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కోతలు అమలవుతాయి. జిల్లా కేంద్రాల్లోను, కార్పొరేషన్లు (రాజమండ్రి,కాకినాడ) మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు, జిల్లా కేంద్రాలు శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరుల్లో మధ్యాహ్నాం 1 గంట నుంచి మూడు గంటల వరకు, అన్ని మండల కేంద్రాల్లో మధ్యాహ్నాం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ కోతలు అమలవుతాయి. విశాఖ నగరం (జోన్-2,3) మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు, విశాఖ నగరం జోన్-1 పరిదిలో ప్రాంతాలకు మధ్యాహ్నాం 3 గంటల నుంచి నాలుగు గంటల వరకు కోత ఉంటుందని పేర్కొన్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తుండగా, రాత్రిళ్ళు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో భాగంగా రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సరఫరా ఉంటుందని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ అండ్ సి) పేర్కొన్నారు.

సేంద్రియ వ్యవసాయమే రైతులకు లాభసాటి

పార్వతీపురం, ఫిబ్రవరి 28: రైతాంగానికి సేంద్రియ వ్యవసాయమే లాభసాటిగా ఉంటుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడాప్రాంగణంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ విధానం అమలుకు ఏర్పాటు చేసిన రైతు చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం వల్ల పంట పెట్టుబడులు పెరిగిపోయి నష్టాల బారిన పడుతున్నారన్నారు. ఇందుకు గంటూరు, ప్రకాశం జిల్లాల మిర్చి రైతుల ఆత్మహత్యల ఉదంతాలను ఆయన రైతాంగానికి గుర్తుచేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో ఖర్చులు తగ్గించుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా రైతాంగానికి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్, ఆర్డీవో జె.వెంకటరావు, ఎమ్మెల్యే జయమణి, డ్వామా పిడి రెడ్డి శ్రీరాములు నాయుడు, తహశీల్దారు శ్రీనివాసరావు, ఎ ఎం సి చైర్మన్ బీమవరపుకృష్ణమూర్తి, జట్టు వ్యవస్థాపకులు డొల్లు పారినాయుడ,బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సిస్టర్స్ అండ్స్, బ్రదర్స్ పాల్గొన్నారు. చైతన్య సదస్సులో పలువురు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శలు ఇటు అధికారులను, అటు రైతాంగాన్ని ఆకట్టుకున్నాయి.

‘మూఢ నమ్మకాలను విడనాడాలి’
గంట్యాడ, ఫిబ్రవరి 28 : దేశాభివృద్ధికి సైన్స్ దోహద పడుతుందని ప్రత్యేకాధికారిణి సుజాత తెలిపారు. కస్తూరిబా విద్యాలయంలో జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పలువురు శాస్తవ్రేత్తల జీవిత విశేషాలతో కూడిన పోటో ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం వురోభివృద్ధిని సాధించినా గ్రామీణులు ఇప్పటికే మూడ నమ్మకాలను విడనాడక పోవడం విచార కరణమన్నారు. ప్రజల్లో శాస్ర్తియ దృక్పదం పెరగాలని, శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. సివి రామన్ ఆరిస్టాటిల్, నూటన్ వంటి మహానుభావులు చేసిన పరిశోధనవల్ల ఎంతో ప్రగతి సాధ్యపడిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలకులు శ్యాం పలు విషయాలపై బాలికలకు అవగాహన కల్పిస్తూ ఇచ్చిన మేజిక ప్రదర్శ అందరినీ అబ్బుర పరిచింది. మూఢ నమ్మకాలు, బాబాల మహిమలు తదితర విషయాలపై మేజిక్ ప్రదర్శనలు ఇచ్చిన అనంతరం వాటిలో దాగున్న రహస్యాలను వివరించారు. బాలికంతా శ్రద్దగా చదివి మంచి ర్యాంకులు సాధించాలని మిజీషియన్ అభినందించారు. కార్యక్రమాలతో కస్తూరిబా విద్యాలయం బోదకులు, సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ. 5 కోట్లతో ప్రణాళిక
పార్వతీపురం, పిబ్రవరి 28: వేసవిలో నీటి ఎద్దడిని నివారణకు 5 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. గురువారం ఇక్కడి కలెక్టర్ క్యాంపు హౌస్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నాన్ సి ఆర్ ఎఫ్ కింద రూ.4కోట్లు, ప్రభుత్వ నిధులు మరోకోటి రూపాయలతో కలిపి ఈయాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఈ నిధులతో తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, బోరువెల్స్ మరమ్మతులు తదితర పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మండలానికి రూ.3లక్షల వంతున ఈనిధులు కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో 24లక్షల జనాభా ఉంటే మొదటి ఫేజ్‌లో 20లక్షల జనాభా ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియలో పాల్గొన్నారన్నారు. వీరందరికీ కార్డులు వచ్చే పనులు జరుగుతున్నందున ఇవి పూర్తికాగానే రెండవ దఫా ఆధార్ నమోదు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఉపాధి కార్యక్రమం ద్వారా ఇంతవరకు రూ.1410కోట్లు వ్యయం చేసి 4.6లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ఉపాధి వేతనదారులకు సగటున రూ.99.75పైసలు వంతున రోజుకు వేతనం చెల్లించామన్నారు. అయితే పనుల్లో పాల్గొన్న కుటుంబాలు 3.3లక్షల కుటుంబాలు కాగా ఇందులో ఎస్సీకి చెందిన వర్గాలు 12.47శాతం, ఎస్టీలు 11.23శాతం మందిగా పేర్కొన్నారు.
ఐఎపి పనులు వేగవంతం
జిల్లాలోని ఐఎపి పనులు వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు. ఈపనుల్లో భాగంగా తాగునీటి పథకాలు పూర్తిచేశామన్నారు. అలాగే రోడ్ల నిర్మాణానికి ఏజెన్సీలో రిజర్వు ఫారెస్ట్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా కేవలం 5హెక్టార్ల విస్తీర్ణంలో రహదార్లు నిర్మాణం చేపట్టుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి లభించిందన్నారు. అందువల్ల మరోమూడునెలల్లో ఈ రోడ్లు పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే గిరిజన హాస్టల్, యూత్ భవనాలు మేనాటికి పూర్తిచేసే చర్యలు వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఆర్డీవో ఎల్.వెంకటరావు పాల్గొన్నారు.

‘స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి’
english title: 
gh

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>