Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కంద పద్యం నుంచి కల్లోల గీతం దాకా.. (సాహితీ వ్యాసం)

$
0
0

ఈ నెల కళల్ని గుబాలిస్తుంది. ఇక్కడి మట్టి సాహిత్య వాసనేస్తుంది. ఇక్కడ వీచే గాలి ప్రేమ పరిమళాల్ని విరభూస్తుంది. గోదావరి గలగల ధ్వనీ ప్రతి ధ్వనుల్లో ఎదిగిన సాహిత్యం ఆవిశ్రాంతంగా ముందుకు సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త రూపాల్ని సంతరించుకుంటూ కరీంనగర్ ప్రాంత సాహిత్యం మొత్తంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో తన విలక్షణతను వైవిద్యాన్ని అందిపుచ్చుకుంది. నేటి వర్తమాన సాహిత్య ప్రపంచంలో కరీంనగర్‌ది విశిష్ట స్థానం. కథ, నవల, కవిత్వం ఏ సాహిత్య రూపాన్ని సృష్టించినా కరీంనగర్ ప్రాంత సృజన రాశిలోను వాసిలోనూ ఎన్నదగినది. తల్లడం, మల్లడం అవుతున్న జన జీవితపు సంక్షోభాన్ని, సంఘర్షణల్ని తడిమిన పల్లె సీమల ప్రకంపనాల్ని తనలో నిక్షిప్తం చేసిన ఈ గడ్డపై వెలువడ్డ సాహిత్యం నిజయితీతో నిలుచుంది. మధ్యతరగతి ప్రజల కలల ప్రపంచాల్ని తడిమిన, ప్రపంచీకరణ పర్యవసానాల్ని పరికించిన నిఖార్సైన నిబద్ధతతలో కరీంనగర్ సాహిత్య ప్రజల ముందుకు ‘వచ్చిందంతా’ గొప్పది కాకపోయినా ఇక్కడి సాహిత్యకారులు తమ సొంత గొంతుల కోసం పరితపించారు. తమ సొంత నేల కోసం తమ సామాజిక స్థానం కోసం మదనపడ్డారు. స్థానీయత స్ఫూర్తితో ప్రాంతీయ దృక్పథంతో చాలామంది తమ కలాల్ని గళాల్ని విప్పి పలవరించారు. సృజన చేశారు. చేస్తున్నారు. ఆ ఒరవడి ఇంకా సాగుతూనే ఉన్నది. ఈ స్థితి ఒక నాటితో మొదలు కాలేదు. అనేక ఏళ్ల, దశాబ్ధాల, శతాబ్ధాల చారిత్రక నేపథ్యంలోంచి ఈవాల్టి సాహిత్యానికి ఈ స్థితి వచ్చింది. మూడు దశాబ్ధాల క్రితం వచ్చిన ‘బదలా’ మొదలు జిల్లాలో విస్తరించిన ప్రగతిశీల సాహిత్య అనేక మలుపుల్ని దాటి వివిధ కోణాల్ని తడిమి పలు సాహిత్య రూపాల్లో ముందుకు సాగుతూనే ఉంది. వీటికి తోడు మానవతా, కవిత పరిమళాలు విరజిమ్ముతూ మరోపక్క, మరెంతో మంది సాహిత్యకారులు తమ సాహితీ వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. ఇటీవలి వర్తమాన చరిత్ర అయితే శతాబ్ధాలుగా సాహిత్య చరిత్రలో కరీంనగర్ ప్రాంత సాహిత్యకారుల పాత్ర చిన్నదేమి కాదు. కరీంనగర్ జిల్లాలో లభించిన శాసనాల్లో నాటి కవులు, పండితులు వారి సాహిత్య ప్రక్రియలకు చెందిన అనేక వివరాలు మనకు కనిపిస్తాయి. ఆనాడే వేములవాడ, ధర్మపురి, పొలాస, మంథని తదితర ప్రాంతాలు వైదిక, వాజ్ఞ్మయ కేంద్రాలుగా విలసిల్లాయి. వేములవాడ చాళుక్యులు పాలించిన కన్నడ రాజభాషగాను, తెలుగు ప్రజల భాషగాను నడిచింది. రెండవ అంకెసరి రాజు ఆస్థాన కవి పంపడు. ఆయన క్రీ.శ.902లో పుట్టినట్టు చరిత్ర చెబుతున్నది. అతడు పొన్నకవి, రన్నకవిలతో కూడా విక్రమార్జున విజయాలు పేర కన్నడ భారతాన్ని రాశాడు. పంప మహాకవి సోదరుడు జినవల్లభుడు 945లో గంగాధరల వేయించిన శాసనంలో చివరలో మూడు కంద పద్యాలు ఉన్నాయి. ఆది కవి నన్నయ కంటే ఒక శతాబ్ధం పూర్వపుకవి, అయిదవ శతాబ్ధమందే కరీంనగర్ జిల్లాలో పద్య రచనలు ఉందనడానికి సాక్ష్యంగా చెబుతారు. వేములవాడ చాళుక్యుల కాలం వాడే సుప్రసిద్ధ కవి సోవదేవ సూరి ఆయన 959లో నీటి కావ్యామృతములాంటి ఉత్తమ రచనలు చేశాడు. కాగా కాకతీయుల కాలంలో నగునూరు పాలకుండిగా ఉన్న గంగాధరుడు 1171లో వేయించిన శాసనములలో చక్కటి తెలుగు పద్యాలున్నాయి. ఇక రామగిరి ప్రాంతపు రాజు ముప్ప భూపాలునికి ఆస్థాన కవిగా ఉన్న మడికి సింగన పద్మపురాణేతర ఖండము, భాగవత దశమ స్కంధము రాశారు. 12వ శతాబ్ధారంభంలో వేములవాడ భీమకవి రాఘవ పాండవీయము, నృసింహ పురాణము చాతకంత రామాయణం రచించారు. వేములవాడ భీమ కవి ఉనికిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక 15వ శతాబ్ధంలో ఎలగందులకు చెందిన నారాయ బమ్మెర పోతన మాత్యుని శిష్యునిగా ప్రతీతి. ఆయన ప్రాచీన భాగవతంలోని కొంత భాగాన్ని పూరించి వెలిగందుల నారాయణగా సాహిత్య చరిత్రలో ప్రసిద్ధుడైనాడు. ఇక 16 నుండి 19వ శతాబ్ధం వరకు నరసింహ శతక కర్త శేషప్ప, మూల చరిత్ర ప్రబంధ వ్యాక్యాత సోమనాథుడు. గొప్ప వ్యాప్తినొందిన సాహితీ మూర్తులు సుప్రసిద్ధ కావ్యాలతో పాటు కరీంనగర్ నుంచి యక్షనాద వాంజ్మయం కూడా వెలువడింది. ఇక 20వ శతాబ్ధంలో జిల్లా నుంచి అపారమైన రచనలు వెలువడ్డాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో లబ్ధప్రతిష్టులయిన కవులు, రచయితలు ఎంతో మంది ఈ జిల్లా నుంచి వచ్చారు. ధర్మపురికి చెందిన పెద్ద మహదేవ్, నరసింహా, నరహరి, కాకర్ల లక్ష్మికాంత శాస్ర్తీ, చంద్రశేఖర శాస్ర్తీ లాంటి పండితులు, గట్ల నర్సింగాపురంకు చెందిన వానమామలై వెంకటాచార్యులు, మంథని అవధానుల పురుషోత్తం, జగిత్యాల సోమశేఖర శాస్ర్తీ, పెద్దపల్లి వానమామలై లక్ష్మణాచార్యులు, చేగుర్తి భాష్య విజయసారథి, హుజూరాబాద్ వానమామలై జగన్నాథాచార్యులు వేములవాడ మామిడిపల్లి సాంబశివశర్మ, కరీంనగర్ జువ్వాడి గౌతం రావు, వెలిచాల కేశవరావు, బోయినపల్లి వెంకట్రామారావు, ఇలా ఎందరో సాహితీ రంగాలలో రాణించారు.
ఇంకా పివి నరసింహారావు, సినారె, జె.బాపురెడ్డి, తాడగిరి పోతరాజు, సురవౌళి, మలయశ్రీ, ముద్దసాని రాంరెడ్డి ఇలా ఎందరో ముందుతరం సాహితీ వేత్తలకు తోడు అల్లం రాజయ్య, సాహు, అలిశెట్టి, బిఎస్.రాములు, కాలువ మల్లయ్య, జూకంటి, జింబో, వఝల, కె.వి.నరేందర్ ఇలా ఎందరెందరో కవులు, రచయితలు పత్తిపాక మోహన్ లాంటి యువకులూ తమ రచనల్లో తెలుగు సాహిత్య సీమను పరిపుష్టం చేస్తున్నారు.

బుక్ షెల్ఫ్

మధుర కవి
మామిడిపల్లి సాంబ శివ శర్మ
జీవితము -రచనలు
-డాక్టర్ విష్ణువందనాదేవి
వెల :100/-
ప్రతులకు : మృద్విక్, 1-5-577/1, చేతన హౌజింగ్ కాలనీ, ఓల్డ్ అల్వాల్; సికింద్రాబాద్ -10
సెల్ నెం: 9550702025

వౌన శబ్ధాలు నానీలు
-డాక్టర్ విష్ణువందనాదేవి
మృదు ప్రచురణలు
వెల :30/-
ప్రతులకు : విష్ణువందన
ఇంటి.నం.1-5-77/1
జొన్న బండ, సికింద్రాబాద్ -10
ఫోన్ నెం: 040-27865665

మనో గీతికలు

గమనం
స్ర్తిమూర్తి -ప్రకృతి
ప్రపంచపు ఆకృతి
పాడు చేయకు నేస్తమా!
నిత్యం కాపాడుకో..
అవినీతికి నేతలు
పోటీలు పడుతున్నారు
గుళ్లల్లో అవినీతి
బళ్లల్లో అవినీతి
సత్యాన్ని నిత్యము బతికించు నేస్తమా!
అవినీతికి అస్తమ్రై ఉంటుంది మిత్రమా!
కల్తీలకు అంతులేదు
ధరల అదుపునకు కుదురులేదు
ప్రతీ వస్తువు సామాన్యుడి
నడ్డి విరుచు నేస్తమా!
జనమంత ఒక్కటై పోరాడుము మిత్రమా!
అసత్యపు నడకలు
అనాగరికపు చేష్టలు
నాగరికత పేరు జెప్పి
నడిచే నేటి యువత
మంచివైపు మీరంతా మారండి నేస్తమా!
దేశానికి మీరెంతో అవసరము మిత్రమా!
ప్రకృతి శోభతో చెట్లు, అడవులు
మానవుని మనుగడకే ఇవి
కాలుష్యం తుంచె వీటిని
పెంచిపోషించు నేస్తమా!
జీవన గమనం సరియగు మిత్రమా!

-బొమ్మిదేని రాజేశ్వరి
ఎన్‌టిపిసి, జ్యోతినగర్ , కరీంనగర్
సెల్ నెం: 9160908045

గ్రూప్ లాజిక్స్
మాథమెటిక్స్ మెదడు మాడిస్తే
బయాలజీ భయపెడుతుంది
కలణ గణితం కలవరపెడితే
త్రికోణమితి తిప్పలు పెడుతుంది
బోటనీ బోరుకొడితే
జువాలజీ జిడ్డుకొడుతుంది
ఇక ఆర్ట్స్ గ్రూప్ సరేసరి
ఎకనామిక్స్‌తో ఏముంది కన్వీనియన్స్
సివిక్స్ చదివితే రాసుకోవాలి విక్స్
కామర్స్ అంతా కన్‌ఫ్యూజన్
హిస్టరీ అంతా ఒక మిస్టరీ
అంతా ఒక మ్యాజిక్
అక్కడే ఉంది లాజిక్
సారీ! తీసుకోండి ఇదంతా ఓ జోక్‌గా
తీసుకోండి మీతోనే నాజూగ్గా
అయినా! అన్నీ తెలుసుకోవడం బెస్ట్
లేకుంటే జీవితం వేస్ట్

-ఎ.పోచయ్య, బిఎస్సీ బిజెడ్సీ-3,
సెల్: 652332928

అమ్మ
అకాశమంత మనసున్న అమ్మ
నీ ప్రేమ ఎక్కడ వెతికిన దొరకనిదమ్మా
నీకొన ఊపిరితో నా తొలి ఊపిరిపోశావు
నీ కనుపాపగా నిను పెంచావు
నా ప్రతి శ్వాస నీవయ్యావు
ఏమిచ్చి తీర్చుకోను నీ రుణం
నా రుూ జన్మ చేయాలి నీ పాదాలకు అంకితం
నా తుది శ్వాస ఆగేది
అమ్మా అని నా నోటి వెంటరానపుడే

జీవితం

జీవితం ఒక సాగరమైతే..?
అందులో సుఖః దుఃఖాలను ఈదడమే నీ ధ్యేయం
జీవితం ఒక ప్రశ్నయితే?
జవాబు తెలుసుకోవడమే నీ లక్ష్యం
జీవితం ఒక ఆటైతే?
నీతిగా, నిజాయితీగా గెలవడమే నీ కర్తవ్యం

-కె.తిరుపతి, బిఎస్సీ బిజెడ్సీ-3, సెల్:9573453037

స్నేహం
పాల మీగడలకన్న
పంచదార చిలుకలకన్న
మధురమైన మధువుకన్న
మగువ మృదువైన పెదవి కన్న
మదిలో మెదిలే స్వప్నం కన్న
సృష్టిలో తీయనైనది ‘స్నేహం’
స్నేహం అతి మధురం
హిమాలయాల మహోన్నతం

-అనీల్

కవిత్వం
నీరు లేని కొలనులో కాలువలుండునా
మంచిలేని మనసులో మమతలు ఉండునా
పచ్చదనం లేని ప్రకృతిలో వాయువు ఉండునా
ప్రేమ లేని హృదయంలో స్పందనలు ఉండునా
నక్షత్రాలు లేని నింగిలో అందముండునా
ఆశయం లేని అంతర్యంలో సాధన ఉండునా
సూర్యుడు లేని సృష్టిలో వెలుగు ఉండునా
సాహసం లేని గుండెలో విజయం ఉడునా
పువ్వులేని పుడమిలో పరిమళం ఉండునా
మానవత్వం లేని మనిషిలో మమకారముండునా
జీవితం లేని ప్రపంచంలో జీవితాలుండునా
ఆత్మలేని మనిషిలో ఆయువుండునా!

-అనీల్

బలిదానం
పోరాటం కాదు
మరణం కాదురా అన్నిటా మార్గం
చావుతో అన్నీ సాధ్యం అయితే
నాలుగున్నర కోట్ల చితులను తప్పక ఇపుడే పేర్చేద్దాం
తల్లీ, పిల్లా, గొడ్డూ, గోదా, భూమినే
భూడిద చేసేద్దాం
ఎందుకు చస్తావ్, ఎందుకు చస్తావ్
పిరికితనంగా భయపడి
ఎందుకు చస్తావ్
బలిదానాన్ని పోరాటం
అని భ్రమపడి
మరణం కాదురా
అన్నింటా మార్గం
జీవితమంటే నిత్యం యుద్ధం
ఎందుకు చస్తావ్, ఎందుకు చస్తావ్
పిరికితనంగా భయపడి
ఎందుకు చస్తవ్ బలిదానాన్ని
పోరాటం అని భ్రమపడి

-రాజేశ్వర్‌ఛ, ఎస్సారార్ కాలేజి

నిర్వహణ: వారాల ఆనంద్ varalaanand@yahoo.com

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం కోసం ఈ క్రిందిచిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫోటో, చిరునామాతో ఈ మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. knrmerupu@deccanmail.com

ఈ నెల కళల్ని గుబాలిస్తుంది. ఇక్కడి మట్టి సాహిత్య వాసనేస్తుంది.
english title: 
k
author: 
- నందు, కరీంనగర్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>