హైదరాబాద్, మార్చి 2: కేంద్రం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్‌లో అంకెల మాయాజాలం తప్పితే, అభివృద్ధి ఎంత మాత్రం కనిపించడం లేదని పలువురు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిపుణులు అన్నారు. ప్రజాబడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించినా, అడుగడుగునా ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయని, రాబోయే ఆర్థిక సంవత్స రం మరోమారు ఆర్థిక మాంద్యా న్ని చవిచూసే అంశాలు కోకొల్లలన్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య(్ఫ్యప్సీ) ‘పన్నుల విధానం-బడ్జెట్ ప్రభావం’ అంశంపై సదస్సును శనివారం ఇక్కడ నిర్వహించింది. ఈ సందర్భంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి, ఆర్థికవేత్త జయేష్ సింఘ్వీ మాట్లాడుతూ వచ్చే ఏడాది జాతీయ ఆర్థికాభివృద్ధి 6.1 శాతం నుంచి 6.7 శాతం వృద్ధిరేటు సూచిస్తున్నా, పెరిగిన అధిక ధరల వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గి ఏడు శాతం ఆర్థిక మాంద్యం చోటుచేసుకునే సూ చనలు కనిపిస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో 1.8 శాతం, పారిశ్రామిక రంగంలో 3.1 శాతం, సేవల రంగంలో 6.5 శాతం ఆర్థికాభివృద్ధి నమోదుకావచ్చన్నారు. రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ప్రధాన ఆర్థికాధికారి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ వౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి లేని ఏ దేశం కూడా అభివృద్ధిని సాధించలేదన్నారు. నూ తనంగా 25 లక్షల రూపాయల రు ణంతో గృహ నిర్మాణం చేసుకునే వా రికి ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూ పాయల పన్ను రాయితీ బాగానే ఉ న్నట్లనిపించినా, దేశంలో ఒక్కో ప్రాం తంలో గృహ నిర్మాణానికి ఒక్కో రేటు పలుకుతుందని గుర్తుచేశారు. 50 లక్షల రూపాయల వ్యయాన్ని మించి స్థిరాస్తులను కొన్నప్పుడు ఒక శాతం టిడిఎస్ కట్టాలనే నిబంధన వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
* బడ్జెట్‌పై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిపుణులు
english title:
budget
Date:
Sunday, March 3, 2013