హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఎన్నో వివాదాల మధ్య ఎపిపిఎస్‌సి ప్రారంభించిన గ్రూప్-1 ఇంటర్వ్యూల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 205 పోస్టులకు 417 మందికి విస్తృత స్థాయి సింగిల్ బోర్డు ద్వారానే నిర్వహించారు. అభ్యర్థుల మెరిట్ లిస్టును శనివారం ఉదయం ఎపిపిఎస్‌సి ప్రకటిస్తుందని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రే వారికి వచ్చిన ఇంటర్వ్యూ మార్కులను ఎపిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో ఉంచింది. కొంతమంది మార్కులు వెబ్‌లో లేకపోవడంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్ 39/08, 10/09ల కింద నిర్వహించిన గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మెయిన్ పరీక్షలలో ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎపిపిఎస్‌సి 2011 డిసెంబర్ 17వ తేదీన విడుదల చేసింది.
31/2007 నోటిఫికేషన్ కింద తెలుగు వెర్షన్‌లో 4497 మంది, ఇంగ్లీషు మీడియంలో 1509 మంది మొత్తం 6006 మంది పరీక్ష రాయగా, వారిలో 387 మంది ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు, అందులో తెలుగు మీడియం వారు 172 మంది కాగా, ఇంగ్లీషు మీడియం వారు 215 మంది ఉన్నారని కమిషన్ కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. ఐదు పట్టణాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, అదే 38/2008, 10/2009 నోటిఫికేషన్ల కింద తెలుగు మీడియంలో 4270 మంది, ఇంగ్లీషు మీడియంతో 1382 మంది మొత్తం 5652 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని, వారిలో 416 మందిని ఇంటర్వ్యూలకు అర్హులుకాగా, అందులో తెలుగుమీడియం వారు 174 మంది, ఇంగ్లీషు మీడియం వారు 242 మంది ఉన్నారని ఆమె తెలిపారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో తెలంగాణ ప్రాంతం నుండే 281 మంది ఎంపిక కాగా, విజయవాడ నుండి 40 మంది, విశాఖ నుండి 62 మంది, తిరుపతి నుండి 33 మంది మాత్రమే ఎంపికయ్యారని ఆమె వివరించారు. హైదరాబాద్‌లో 3184 మందికి గానూ 259 మంది, వరంగల్‌లో 378 మందికి గానూ 22 మంది, విజయవాడలో 776 మందికి గానూ 40 మంది, విశాఖలో 886 మందికి గానూ 62 మంది, తిరుపతిలో 637 మందికి గానూ 33 మంది ఎంపికయ్యారు.
ఇంటర్వ్యూల మార్కులు వెల్లడి
english title:
g
Date:
Saturday, February 11, 2012