కాకినాడ, మార్చి 2: భారతదేశంతో వ్యాపార సంబధాలు బలపరుచుకుంటామని, కాకినాడ వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో విపరీతమైన వ్యాపార సామర్థ్యం ఉందని గమనించే కెనడా ప్రభుత్వం ద్వైపాక్షిక వ్యాపారాభివృద్ధి జరపాలని ఆకాంక్షిస్తోందని కెనడా దేశ ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్ చెప్పా రు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నగర పరిసర ప్రాంతాలకు చెందిన కొం దరు పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్ మాట్లాడుతూ రష్యా, అమెరికా వంటి దేశాలతో కెనడా సమాన విస్తీర్ణం కలిగి సుమారు 40 వేల డాలర్ల తలసరి ఆదాయం కలిగి ఉం దన్నారు. వ్యాపారాభివృద్ధికి భారత్ వంటి శ్రామికశక్తి కలిగిన దేశాలతో సంబంధాలు నెలకొల్పాలని విద్యాభివృద్ధి, ఆంగ్ల బాష పరిజ్ఞానం కలిగి ద్వైపాక్షిక సంబధాలు మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయోత్పత్తుల్లో ప్రబలమైన సామర్థ్యం కలిగి ఉందని గుర్తించామని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పితే వాటిని కెనడా అభివృద్ధి చేసేందుకు ఆసక్తి కలిగి ఉందని చెప్పారు. కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షు డు దంటు సూర్యారావు మాట్లాడుతూ కాకినాడ మొదటి నుండి డచ్, బ్రిటన్ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు కలిగి ముడి సరుకులు ఎగుమతి దిగుమతి చేస్తూ ఫినిష్‌డ్ గూడ్స్ దిగుమతి చేసుకునేదన్నారు. 2 ఓడరేవులు కలిగి జిఎంఆర్, సెజ్‌ల వంటివి రావడంతో ఈ ప్రాంతం అభివృద్ది చెందిందన్నారు.
కెనడా ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్
english title:
trade development
Date:
Sunday, March 3, 2013