న్యూఢిల్లీ, మార్చి 2: భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) శుక్రవారం రికార్డు స్థాయిలో ఇ-టికెట్ల బుకింగ్‌ను స్వీకరించింది. ఈ ఒక్కరోజే 5.02 లక్షల టిక్కెట్లు ఇంటర్నెట్ ద్వారా ఐఆర్‌సిటి సి వెబ్‌సైట్ నుంచి బుకింగ్ అయ్యా యి. దీంతో గతంలో నమోదైన ఒక్కరోజు ఇ-టికెట్ల బుకింగ్ రికార్డు కనుమరుగైంది. గత ఏడాది జూలై 7న 4.96 లక్షల ఇ-టికెట్లను ఐఆర్‌సిటిసి బుక్ చేసుకున్నట్లు సం బంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా, పండుగలు, ఇతరత్రా కీలక సమయాల్లో తత్కాల్ బుకింగ్స్ రద్దీని ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ తట్టుకోలేదని, టికెట్ల బుకింగ్స్‌లో విఫలమవుతుందనే విమర్శల నేపథ్యంలో వెబ్‌సైట్‌ను ఆధునీకరించి, సామర్థ్యాన్ని పెంచినట్లు ఆ అధికారి వివరించారు. స్టోరేజ్ ఏరి యా నెట్‌వర్క్‌తోపాటు సాఫ్ట్‌వేర్ లైసెన్సులను రూ.3 కోట్లతో వృద్ధి చేశామని, మరో రూ.3.5 కోట్లతో వెబ్‌సైట్ సామర్థ్యాన్ని కూడా పెంచామని పే ర్కొన్నారు. ప్రస్తుతం ఐఆర్‌సిటిసి వ్యవస్థ 64 జిబి ర్యామ్ హెక్సా కోర్ సర్వర్లతో మరింత పటిష్టమై ఉందన్నారు. గతంలో ఈ వ్య వస్థ 8 జిబి ర్యామ్ డ్యూయల్ కోర్ సర్వర్లతో పనిచేసేదని గుర్తుచేశారు. వ్యవస్థ ఆధునీకరణకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశామని స్పష్టంచేశారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం కోసం రైల్వే శాఖ పెట్టిన భారీ పెట్టుబడులతో ఇకపై తత్కాల్ బుకింగ్స్ సమయంలో గతంలో కంటే 40-45 శాతం ఎక్కువ బుకింగ్స్ జరగగలవనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా సదరు అధికారి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్లలో 48 శాతం ఇ-టికెట్ల బుకింగ్ సైట్ల ద్వారానే బుకింగ్ అవుతున్నాయి. ఇదిలావుంటే పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్ ప్రసంగంలో రైల్వే మంత్రి బన్సల్ మాట్లాడుతూ ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ఆధునీకరణతో నిమిషానికి 7,200 టికెట్లు బుకింగ్ అవగలుగుతున్నాయని, గతంలో నిమిషానికి 2,000 టికెట్లు బుకింగ్ అయ్యేవన్నారు.
ఒక్క రోజులో ఐఆర్‌సిటిసి రికార్డు
english title:
irctc
Date:
Sunday, March 3, 2013