ముంబయి, మార్చి 2: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాల పరంపర వరుసగా ఐదోవారం కూడా కొనసాగింది. ఫలితంగా గడిచిన ఐదువారాల్లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1190 పాయింట్ల మేర, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 355 పాయింట్ల మేర నష్టపోయాయి. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ మంగళవారం రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌తోపాటు, గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ నిరాశపరచడంతో మదుపర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా ఈ రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ సైతం 200 పాయింట్ల మేర కోల్పోయింది. ముఖ్యంగా టాక్స్ రెసిడెన్సీ సర్ట్ఫికెట్ (టిఆర్‌సి) పై గురువారం నాటి బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం చేసిన ప్రకటన విదేశీ మదుపర్లలో గందరగోళానికి దారి తీసింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు గురయ్యాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు, నిఫ్టీ 103 పాయింట్ల వరకు దిగజారాయి. అంతకుముందు సోమవారం స్వల్ప లాభాలు సాధించి మంచి ఆరంభాన్నిచ్చాయనుకున్నప్పటికి మంగళవారం రైల్వే బడ్జెట్ ఆశించినంతగా మదుపర్లను మెప్పించకపోవడంతో సెనె్సక్స్ 317 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లు క్షీణించాయి. అయితే బుధవారం ఆశాజనకంగా ఉన్న ఆర్థిక సర్వే అంచనాల కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. అయినప్పటికీ గడిచినవారం మొత్తంగా స్టాక్‌మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. కాగా, టిఆర్‌సిపై మదుపర్లలో నెలకొన్న అస్పష్టతను నివారించేందుకు చిదంబరం చేసిన ప్రకటనతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు కాస్త పుంజుకున్నా యి. ఇక నిర్మాణ, ప్రభుత్వరంగ, రిఫైనరీ, లోహ, బ్యాంకింగ్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు అత్యధికంగా నష్టాలకు గురయ్యాయి. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటి, టెక్నాలజీ రంగాలకు మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. అయినప్పటికీ సెన్సెక్స్ 398.49 పాయింట్లు పతనమై 18,918.52 వద్ద, నిఫ్టీ 130.60 పా యింట్లు దిగజారి 5,719.70 వద్దకు పడిపోయాయి. ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గించారు. గడిచినవారం 54 3.99 కోట్ల రూపాయలను మాత్రమే పెట్టుబడులుగా పెట్టారు. టర్నోవర్ పరంగా సెన్సెక్స్ గడిచినవారం 11,598.65 కోట్ల రూపాయలకు, నిఫ్టీ 66,171.13 కోట్ల రూపాయలకు పెరిపెరిగాయ.
వరుసగా ఐదో వారం నష్టాల్లో స్టాక్ మార్కెట్లు * సెన్సెక్స్ 400, నిఫ్టీ 130 పాయింట్ల పతనం వారాంతపు సమీక్ష
english title:
weekend review
Date:
Sunday, March 3, 2013