చంద్రగిరి, మార్చి 3: శ్రీనివాస మంగాపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం ఉదయం శ్రీయోగనరసింహస్వామి సింహ వాహనంపై ఊరేగి భక్తులకు అభయప్రదానం చేశారు. ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకూ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకూ ఊంజల సేవ జరిగింది. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకూ స్వామి, అమ్మవార్లు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక వాహనాల ఊరేగింపు ముందు భిన్న వేషధారణలు, భజన మండళ్ల కోలాటాలు, భక్తులు భగవనామ స్మరణలు చేస్తూ భక్తిపారవశ్యంతో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జెఇఓ వెంకట్రామిరెడ్డి, సివిఎస్‌ఓ జివిజి అశోక్‌కుమార్, డిప్యూటి ఇఓ రెడ్డమ్మ, ఏఇఓ లక్ష్మణనాయక్, విజిఓ హనుమంతు, ఎస్‌ఇ సుధాకర్‌రావు, ఇఇ నాగేశ్వర్‌రావు, ఉద్యోగులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
శ్రీనివాస మంగాపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి
english title:
venkanna
Date:
Monday, March 4, 2013