ఏలూరు, మార్చి 6 : ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన విద్యార్ధినీ విద్యార్ధులను డిబార్ చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు హెచ్చరించారు. స్థానిక పిడిబిటి కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్ధులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని, విద్యార్ధినీ విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా పరీక్షలు రాశారన్నారు. జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో తాగునీరు, ప్రాధమిక చికిత్సా సదుపాయాలను కల్పించామని, ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 64,491 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలకు హాజరుకావలసి వుందన్నారు. బుధవారం జరిగిన ప్రధమ సంవత్సరం పరీక్షలకు 35082 మంది విద్యార్ధినీ విద్యార్ధులు హాజరుకావలసి వుండగా వారిలో 32465 మంది పరీక్షలు రాశారని, 2617 మంది పలు కారణాల వల్ల పరీక్షలకు హాజరుకాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని, ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాలలో తొలిరోజు పరీక్ష సందర్భంగా ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని తెలిపారు. బాబూరావునాయుడు వెంట పిడిబిటి కళాశాల ప్రిన్సిపాల్ పివి బ్రహ్మాజీరావు, వైస్ ప్రిన్సిపాల్ వై గౌరీశంకర్, పరీక్షా కేంద్రం ప్రత్యేక అధికారిణి సుజాత, డాక్టర్ నరసింహం తదితరులు ఉన్నారు.
9నుండి ‘వస్తున్నా... మీకోసం’
*బాబు రూటు మ్యాప్ ఖరారు*జిల్లా పర్యటనకు భారీ ఏర్పాట్లు*ఇంకా తేలని ముగింపు*అయిదు నియోజకవర్గాలు, 82 కిలోమీటర్లు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మార్చి 6 : డీలా పడుతున్న పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తూ ప్రజా సమస్యలపై సత్వరం స్పందిస్తూ సాగుతున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా... మీకోసం పాదయాత్ర ఈ నెల 9న జిల్లాలో ప్రవేశించనుంది. ప్రస్తుతం వున్న అంచనాల ప్రకారం దాదాపు అయిదు నియోజకవర్గాల పరిధిలో 82 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. అయితే ముగింపు మాత్రం ఇంకా ఎటూ తేలకుండా నిలచిపోయింది. ఏ నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించాలన్న అంశంలో పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ అంశాన్ని మినహాయించి మిగిలిన రూటు మ్యాప్‌ను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. దీని ప్రకారం చంద్రబాబు పాదయాత్ర ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజకవర్గాల పరిధిలో కొనసాగనుంది. చంద్రబాబు రూట్‌మ్యాప్ ఈ విధంగా సాగనుంది. 9వ తేదీ ఉదయం కృష్ణాజిల్లాలో పాదయాత్ర ముగించుకుని ఉప్పుటేరు వద్ద చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. తొలిరోజున ఉండి నియోజకవర్గం, ఆకివీడులోని దుంపగడప అడ్డరోడ్డు, దుంపగడప, జూనియర్ కాలేజీ గ్రౌండ్, ఆకివీడు రైల్వే స్టేషన్, పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, సి ఎం మిషనరీ స్కూలు, అర్ధమూరు గరువుల మీదుగా పాదయాత్ర సాగుతుంది. పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించే చంద్రబాబు అర్ధమూరుగర్వులో రాత్రి బస చేస్తారు. 10వ తేదీన అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఉండి మండలం చెరకువాడ, కలిసిపూడి, గోరింతోట, పెదపుల్లేరు అడ్డరోడ్డు మీదుగా ఉండి చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం మహదేవపట్నం అడ్డరోడ్డు మీదుగా పెద అమిరం రియల్ ఎస్టేట్ ఖాళీ స్థలానికి చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 11వ తేదీ ఉదయం కాళ్ల మండలం పెద అమిరం రియల్ ఎస్టేట్ ఖాళీ స్థలం నుంచి పాదయాత్ర ప్రారంభించి పెద అమిరం, జువ్వలపాలెం అడ్డరోడ్డు, భీమవరం రూరల్ మండలం చిన అమిరం క్రాస్‌రోడ్డు- ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, భీమవరం టౌన్, ఉండి రోడ్డు, ప్రకాశం చౌక్ సెంటర్, ఎం ఆర్ ఓ ఆఫీసు సెంటర్, మావుళ్లమ్మ గుడి సెంటర్, బస్టాండ్ సెంటర్, రైల్వే ఓవర్‌బ్రిడ్జి సెంటర్, సెయింట్ మెరీస్, షిరిడీ సాయి ట్రస్టు బహిరంగ ప్రదేశం, విస్సా కోడేరు, గొరగనమూడి, పెన్నాడల మీదుగా పాలకోడేరు మండలం మార్కెట్‌యార్డు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 12వ తేదీ ఉదయం అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించి పాలకోడేరు మండలం శృంగవృక్షం, భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నందమూరు గరువు ( ఆంజనేయస్వామి గుడి సెంటర్), వీరవాసరం, పాలకొల్లు నియోజకవర్గం ఎస్ చిక్కాల, చిక్కాల, దగ్గులూరు, లంకలకోడేరు, వెలివెల అడ్డరోడ్డు, భగ్గేశ్వరం, సూర్యతేజ ఫంక్షన్ హాలు మీదుగా పూలపల్లి చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 13వ తేదీన పాలకొల్లు టౌన్‌లోని పాలకొల్లు రైల్వే గేటు సెంటర్, ఎన్‌టి ఆర్ విగ్రహం సెంటర్, పాలకొల్లు రూరల్ మండలం ఉల్లంపర్రు, పోడూరు మండలం జిన్నూరు, మట్టపర్రు అడ్డరోడ్డు, వేడంగి, కవిటం లాకుల సెంటర్, కవిటంల మీదుగా పాదయాత్ర కొనసాగించి రాత్రి బస చేస్తారు. అలాగే 14వ తేదీ ఉదయం పాదయాత్ర ప్రారంభించి పోడూరు మండలం జగన్నాధపురం, ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం, మార్టేరు సెంటర్, నెగ్గిపూడి, పెనుగొండ (వాసవీ మాత గుడి ఆవరణ), గాంధీ సెంటర్, మార్కెట్ సెంటర్, తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం అయితంపూడి, సాయిదుర్గా మోడరన్ రైస్‌మిల్లు ఖాళీ స్థలం, ఏలేటిపాడు అడ్డరోడ్డు, గొల్లగుంటపాలెం, వేండ్రవరాపాలెం మీదుగా శ్రీ వేంకటేశ్వర రైస్‌మిల్లు ప్రాంగణానికి చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. 15వ తేదీన అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఇరగవరం మండలం యర్రాయిచెరువు, ఆనతికుంట, మహాలక్ష్మి చెరువు, వేల్పూరు బిసి కాలనీ, వేల్పూరు సెంటర్, వీరభద్రపురం, మండపాకల మీదుగా పైడి పైర్రు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. మొత్తం 82.7 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. అయితే కొవ్వూరు మీదుగా పాదయాత్ర సాగుతుందా లేక మరో రూటులో తూర్పుగోదావరి జిల్లాకు చేరుతుందా అన్నది ఇప్పటికీ తేలలేదు. ఈ విషయంపైనే పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రాధమికంగా చంద్రబాబు పాదయాత్ర రూటు మ్యాప్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. మరోవైపు ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేశారు.
ఆలిండియా మెన్స్ టెన్నిస్ టోర్నీ ప్రారంభం
భీమవరం, మార్చి 6: ఎనిమిదవ ఆలిండియా మెన్స్ టెన్నిస్ టోర్నమెంటు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక యూత్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తరహా టోర్నమెంట్లు భీమవరం వేదికగా జరగడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులకు వసతులతో పాటు అనువైన క్రీడాప్రాంగణాలు కూడా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. సీనియర్స్ విభాగంలో టెన్నిస్ టోర్నమెంట్లను గత కొనే్నళ్లుగా నిర్వహిస్తున్న క్లబ్ నిర్వాహకులను ఎమ్మెల్యే రామాంజనేయులు అభినందనలతో ముంచెత్తారు. అనంతరం ఎమ్మెల్యే, గోకరాజు వెంకట నర్సింహరాజు పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో తలపడ్డారు. మొదటిరోజు సింగిల్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. వీటిలో గెలుపొందిన వారి వివరాలు... 65+ వయస్సు విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు (ఎపి) చెందిన వై ప్రభాకరరెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌కు (ఎపి) చెందిన డిఎస్‌ఎన్ రాజు గెలుపొందారు. ఎపికి చెందిన ఎన్‌కెవి రాజుపై ఎపికి చెందిన విఆర్‌కె రాజు గెలుపొందారు. మహారాష్టక్రు (ఎంఎహెచ్) చెందిన డి డిసోజపై ఎపికి చెందిన మోహన్‌సింగ్ గెలుపొందారు. ఎపికి చెందిన డిడి రావుపై ఎపికి చెందిన టి పద్మ గెలుపొందారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌పై మహారాష్టక్రు చెందిన ఎస్ గైక్వాడ్ గెలుపొందారు. ఎపికి చెందిన సి శేషసాయిపై ఎపికి చెందిన ఎఎస్‌ఎన్ రాజు గెలుపొందారు. ఎపికి చెందిన ఎస్ మూర్తిపై కేరళకు చెందిన పద్మనాభన్ గెలుపొందారు. మహారాష్టక్రు చెందిన ఎస్ మెహతాపై మహారాష్టక్రు చెందిన ఎస్ పరేఖ్ గెలుపొందాడు. ఎపికి చెందిన ఎన్ రంగయ్యపై మహారాష్టక్రు చెందిన వి షైన్ గెలుపొందారు. ఎపికి చెందిన ఎవి కుమార్‌పై ఎపికి చెందిన వైవి కృష్ణ గెలుపొందారు. ఎపికి చెందిన కెవి రాజుపై ఎపికి చెందిన సిబిఎస్ ప్రసాద్ గెలుపొందారు. ఎపికి చెందిన సి సుబ్రహ్మణ్యంపై ఎం రాంబాబు గెలుపొందారు. ఎపికి చెందిన ఎస్ రఘపై ఎఎపికి చెందిన ఎస్ నర్సింహరావు గెలుపొందారు. కేరళకు చెందిన ఎం స్వామిపై కేరళకు చెందిన విఆర్ కులకర్ణి గెలుపొందారు. ఎపికి చెందిన ఎన్ కుమార్‌పై టి శ్రీ్ధర్ గెలుపొందారు. 55+ వయస్సులో విభాగంలో ఎపికి చెందిన డి మూర్తిపై ఎపికి చెందిన సి కుమార్ గెలుపొందారు. మహారాష్టక్రు చెందిన ఎస్ రామారావుపై కేరళకు చెందిన ఎజె కుమార్ గెలుపొందాడు. ఎపికి చెందిన డి కిషోర్‌పై ఎపికి చెందిన కె మూర్తి గెలుపొందాడు. ఎపికి చెందిన ఎస్ మధనరావుపై ఎపికి చెందిన ఎ రెడ్డి గెలుపొందాడు. ఎపికి చెందిన ఎ రెడ్డిపై ఎపికి చెందిన ఎస్‌ఎఎన్ రాజు గెలుపొందారు. ఎపికి చెందిన కె రాజుపై ఎపికి చెందిన ఆర్‌ఇ సుదర్శన్‌రావు గెలుపొందాడు. ఎపికి చెందిన వివిఎస్‌ఎస్ వర్మపై ఎపికి చెందిన వివివి సత్యనారాయణ గెలుపొందాడు. ఎపికి చెందిన టి ఆనందరావుపై తమిళనాడుకు చెందిన శేతు గెలుపొందాడు. మహారాష్టక్రు చెందిన పెన్‌ధర్‌పై ఎపికి చెందిన ఎఆర్ రాజు గెలుపొందాడు. పికె రత్నక్‌పై బిజె రెడ్డి గెలుపొందాడు. ఎపికి చెందిన ఎస్ సింగ్‌పై ఎపికి చెందిన ఎస్‌డి కుమార్ గెలుపొందాడు. ఎపికి చెందిన కె సాయిబాబుపై ఎపికి చెందిన వై ప్రసాద్ గెలుపొందాడు. ఎపికి చెందిన కె రాజుపై గుజరాత్‌కు చెందిన విఎల్‌ఎస్‌ఎన్ రాజు గెలుపొందాడు. కేరళకు చెందిన వి సోమశేఖర్‌పై కేరళకు చెందిన ఆర్ సుబ్రహ్మణ్యం గెలుపొందాడు. 45+ వయస్సు విభాగంలో ఎపికి చెందిన సివి రెడ్డిపై ఎపికి చెందిన ఎస్ రెడ్డి గెలుపొందాడు. ఎపికి చెందిన టి శివరావుపై ఎపికి చెందిన ఎంవి స్వామి గెలుపొందాడు. ఎపికి చెందిన పిఎస్‌ఎన్ వర్మపై ఎపికి చెందిన సిహెచ్‌వి రంగారావు గెలుపొందాడు. ఎపికి చెందిన బి మోహన్‌రావుపై ఎపికి చెందిన బి రెడ్డి గెలుపొందాడు. ఎపికి చెందిన విశ్వనాధ్‌పై ఎపికి చెందిన కె ప్రకాష్ గెలుపొందాడు.
మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలి
జాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు
పోలవరం, మార్చి 6: మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి. బాబూరావునాయుడు అన్నారు. పట్టిసీమ రేవులో బుధవారం సాయంత్రం మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జెసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి వాతావరణం చాలా తేడా వుందని, ప్రస్తుతం వాతావరణం వేడిగా వున్నందున భక్తులు మంచినీటికి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఉత్సవాల మినిట్స్ ప్రకారం ప్రతి శాఖవారు చేయవలసిన పనులు చేశారా, లేదా, ఎప్పటిలోగా పూర్తిచేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. ఆలయ మేనేజర్ నాళం సూర్యచంద్రరావు మాట్లాడుతూ భక్తులు దర్శనానికి వెళ్లే క్యూలైన్ల కోసం ఐరన్ బారికేడ్లు నిర్మించామన్నారు. ఆలయానికి విద్యుత్ అలంకరణలు పూర్తయ్యాయని, 20 కెవి జనరేటర్ 8వ తేదీ సాయంత్రానికి సిద్ధం చేస్తామని అన్నారు. ఆలయ పరిసరాలు శుభ్రపరిచేందుకు 50 మందిని సిద్ధంగా వుంచుతామన్నారు. అలాగే వెయ్యి కేజిల పులిహోర తయారుచేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. గుడి వెనుక ఫ్లడ్ లైట్లు పెట్టించాలని జెసి సూచించారు. డిఎల్‌పిఒ కె. సాయిబాబా మాట్లాడుతూ 40 కెవి, 20 కెవి జనరేటర్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఆరు ఔట్‌పోస్టు గదుల నిర్మాణం పూర్తిచేశామని, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గోదావరి నది ఒడ్డున 40 గదుల నిర్మాణం 8వ తేదీకి పూర్తిచేస్తామన్నారు. భక్తుల అవసరార్ధం 5 లక్షల మంచినీటి ప్యాకెట్లు సిద్ధం చేస్తామని, 2 లక్షల ప్యాకెట్లు దాతల ద్వారా, మిగిలిన 3 లక్షలు మత్స్యశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీ శాఖల ద్వారా ఏర్పాటుచేస్తామని అన్నారు. వివిధ పంచాయతీల నుండి 164 మంది సిబ్బంది ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ టి. లోకేష్ మాట్లాడుతూ నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేస్తామని, ఇసుక తినె్నలపై 25 చేతిపంపులు తాత్కాలికంగా ఏర్పాటుచేస్తామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ కె. రాము మాట్లాడుతూ వివిధ డిపోల నుండి 150 బస్సులను పట్టిసీమకు నడుపుతున్నట్టు తెలిపారు. అలాగే తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రయాణికులు వేచి వుండేందుకు వీలుగా టెంట్లు వేస్తామన్నారు. డిప్యుటీ డిఎం అండ్ హెచ్‌ఒ రాథోడ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు శివరాత్రి ఉత్సవాల్లో 8 పిహెచ్‌సిలు ఏర్పాటుచేస్తామన్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలు సిబ్బంది విధుల్లో వుంటారని తెలిపారు. అందులో మందులు, సిలైన్ సీసాలు, ఆక్సిజన్ సిలెండర్లు సిద్ధం చేస్తామన్నారు. అభిలాష అంబులెన్సులు రెండు, 108, 104 వాహనాలు కూడా సిద్ధంగా వుంటాయని తెలిపారు. బోట్ సూపరింటెండెంట్ బి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ భక్తులు లాంచీలు ఎక్కేందుకు ఆరు పంట్లు రప్పిస్తున్నామని, పది లాంచీలను సిద్ధం చేస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయంలో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫెర్రీ పాయింట్ల వద్ద ప్రమాదాలు జరుగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు. ఆర్డీవో ఎన్‌వివి సత్యనారాయణ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు 8వ తేదీ సాయంత్రానికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిపిఒ ఎ. నాగరాజువర్మ, ఆర్‌అండ్‌బి డిఇ పి. రాములు, పోలవరం తహసీల్దార్ ఐ. నాగేశ్వరరావు, ఎజిఆర్‌బి డిఇ టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నిర్వాసిత గ్రామాలకు ప్రాధాన్యతనివ్వాలి
పోలవరం, మార్చి 6: ఉపాధి హామీ పథకంలో భూమి అభివృద్ధి పనుల్లో ముందుగా ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు ప్రాధాన్యతనివ్వాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి వున్న ప్రాంతాలను గుర్తించి చేయాల్సిన పనులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ టి లోకేష్‌ను ఆదేశించారు. అలాగే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి సత్వరం బిల్లులు చెల్లించాలన్నారు. పేదవాని కల ఇంటి నిర్మాణమని, వ్యయ ప్రయాసలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటే బిల్లుల విషయంలో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఎపిఒ వెంకట్రావు మాట్లాడుతూ 2013 ఆర్థిక సంవత్సరానికి గాను 564 ఉపాధి హామీ పనులు గుర్తించామని, 560 రైతులకు చెందిన 1345 ఎకరాల్లో మామిడి, జీడి మామిడి తోటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి హామీ పనుల్లో గ్రావెల్, పుంత రోడ్ల నిర్మాణానికి అంచనాలు తయారు చేసామని చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ పి లోకేష్ మాట్లాడుతూ పోలవరం పంచాయితీ పరిధిలో రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణం కోసం 30 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎనిమిది లక్షల రూపాయలతో బోర్ల మరమ్మతులు, మోటార్లు కొనుగోలు చేస్తామన్నారు. తహసీల్దార్ ఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ నాలుగు వరకు మండలంలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
వేర్వేరు ప్రాంతాల్లో 5.55 టన్నుల బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెంలో బొలిరో ట్రక్‌తో సహా 2.5 టన్నులు, కామయ్యపాలెంలో 3.05 టన్నుల బియ్యం స్వాధీనం
జంగారెడ్డిగూడెం, మార్చి 6: వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు బుధవారం 5.55 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో 2.5 టన్నులు స్వాధీనం చేసుకోగా, జీగలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో ఒక ఇంటిపై దాడి చేసి 33.5 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పద్మ ధియేటర్ సమీపంలో బొలిరో మ్యాక్సీ ట్రక్‌లో రవాణా అవుతున్న 2.50 టన్నుల బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు బుధవారం ఉదయం పట్టివేసారు. ట్రక్‌ను స్థానిక తహశీల్థార్ కార్యాలయానికి తరలించి విచారణ చేసారు. ట్రక్‌లో పట్టుబడ్డ బియ్యం చౌకడిపోలకు సరఫరా చేసే బియ్యంతో పాటు ఇతర బియ్యం కూడా ఉన్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తహశీల్థార్ సోమంచి రామమూర్తి తెలిపారు. 50 కిలోల బస్తాలు ట్రక్‌లో 50 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బియ్యంతో పాటు ఎపి 37టిసి 2556 నంబర్‌గల ట్రక్ కూడా స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 4.50 లక్షల రూపాయలని తెలిపారు. వీటిని భద్రపరిచేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి.ఉదయ్‌కు అప్పగించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా చనుబండ గ్రామం నుండి ఎటువంటి రవాణా పత్రాలు లేకుండా జంగారెడ్డిగూడెంకు రవాణా అవుతున్నట్టు తెలిపారు. పట్టుబడ్ట సమయంలో వాహనాన్ని నడిపేది డ్రైవర్ పి.సురేష్ అని, వాహన పత్రాలు పరిశీలించగా యజమాని కొండూరు కాశీఫళనీకుమార్ అని తేలిందని తెలిపారు. జీలుగుమిల్లిలో విజిలెన్స్ చెక్‌పోస్టు ఏర్పాటు చేసేందుకు వెళుతుండగా జంగారెడ్డిగూడెంలో టిఫిన్ చేసి బైపాస్ మీదుగా జీలుగుమిల్లి వెళ్ళేందుకు బుట్టాయగూడెం రోడ్డులోకి రావడంతో తమకు ఈ వాహనం తారసపడినట్టు రామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్థార్ బి.ఎస్.నారాయణరెడ్డి, ఆర్.ఐ ఉదయ్, విజిలెన్స్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి డి.డి.రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్ ఎస్.కె.బాషా, విఆర్‌ఒ జగ్గారావు పాల్గొన్నారు.
కామయ్యపాలెంలో 3.05 టన్నుల బియ్యం పట్టివేత
జీలుగుమిల్లి: మండలంలోని కామయ్యపాలెంలో ఒక ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు బుధవారం తనిఖీలు నిర్వహించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన విద్యార్ధినీ విద్యార్ధులను డిబార్ చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి
english title:
n
Date:
Thursday, March 7, 2013