అమలాపురం, మార్చి 8: సమాజాభివృద్ధికి మహిళలే మూలస్తంభాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో స్నేహిత స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహిళ, జిల్లా తొలి మహిళా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ ఆటో నుండి అంతరిక్షం వరకూ మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. అటువంటి మహిళల పట్ల వివక్ష ప్రదర్శించకుండా గౌరవభావంతో చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సునీతా విలియమ్స్ కల్పనాచావ్లా, మార్గరెట్ ధాచర్ వంటి మహిళలు అందరికీ ఆదర్శప్రాయమని మంత్రి విశ్వరూప్ అన్నారు. ప్రపంచంలో మహిళలు లేని రంగం అంటూ ఏదీ లేదన్నారు. సాప్ట్‌వేర్ రంగం, ఆటో, నేవీ,ఫైలెట్ తదితర రంగాలన్నీ మహిళల ప్రముఖ పాత్రతో ముందంజలో ఉన్నాయన్నారు. మహిళలకు స్వాతంత్య్రానికి ముందు ఎలాంటి హక్కులు ఉండేవి కాదని, డాక్టర్ బిఆర్ అంభేద్కర్, జ్యోతిరావ్‌పూలే వంటి మహాత్ములు మహిళలకు రాజ్యాంగంలో హక్కులకోసం కృషిచేసారన్నారు. జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా వచ్చిన నీతూకుమారి ప్రసాద్‌ను ఆదర్శంగా తీసుకుని మహిళలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాల్ని అదిష్టించాలని మంత్రి విశ్వరూప్ పిలుపునిచ్చారు. ఈ అభినందన సన్మాన కార్యక్రమానికి స్నేహిత స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు కుంచే స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్ దుశ్శాలువా,బొకేలతో జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ శే్వతామహంతి, ఆర్డీఒ పి సంపత్‌కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, ఆల్డా ఛైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర రెవిన్యూ సర్వీసెస్ ఆసోసియేషన్ కార్యదర్శి విఎస్ దివాకర్, ఇసుకపట్ల రఘబాబు, తహశీల్ధార్‌లు నక్కా చిట్టిబాబు, బేబీజ్ఞానాంబ, ఎంపిడిఒలు శాంతామణి, కెసిహెచ్ అప్పారావు,ఎఎంసి ఛైర్మన్ ఇళ్ల శేషారావు, జవ్వాది బుజ్జి,వంటెద్దు బాబి, వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ కంచిపల్లి అబ్బులు, వంటెద్దు వెంకన్నాయుడు, నల్లా చిట్టిబాబు, చిక్కం సూరిబాబు,కల్వకొలను ఛాయాదేవి,శాంతి ఒకేషనల్ కళాశాల కరస్పాండెంట్ డి శాంతికుమార్, కుంచే శ్రీనివాస్, గెడ్డం సంపదరావు, డిబిలోక్, ఉండ్రు వెంకటేశ్వరరావు,మెండి రమేష్‌బాబు, సుంకర సుధ, చెల్లుబోయిన శ్రీనివాస్, గెడ్డం సురేష్‌బాబు తదితరులు పాల్గొని కలెక్టర్ నీతూకుమారిని ఘనంగా సన్మానించారు.
మహిళా దినోత్సవ సభలో మంత్రి విశ్వరూప్
english title:
mahila dinotsavam
Date:
Saturday, March 9, 2013