రాజమండ్రి, మార్చి 8: గోదావరి డెల్టాకు ఎట్టకేలకు సీలేరు నుండి బైపాస్ మార్గంలో అదనపు జలాలను విడుదలచేసేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. గోదావరి ప్రధాన ప్రవాహం రోజు రోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో సీలేరు నుండి బైపాస్ జలాలను విడుదలచేయించకపోతే రబీ పంట ఎడిపోతుందన్న ఆందోళనను ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, మంత్రివర్గ సమావేశంలో లేవనెత్తటంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీలేరు బైపాస్ జలాలను విడుదలచేయించేందుకు అంగీకరించారు. దాంతో సీలేరు నుండి 15రోజుల పాటు 1.5టిఎంసి నీటిని విడుదలచేసేందుకు మార్గం సుగమమయ్యింది.
గోదావరి డెల్టాకు ఎట్టకేలకు సీలేరు నుండి బైపాస్ మార్గంలో
english title:
by-pass
Date:
Saturday, March 9, 2013