Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రేమించి మోసగించిన వ్యక్తితో వివాహం చేయాలని యువతి నిరాహారదీక్ష

$
0
0

వీరవాసరం, మార్చి 8: తనను ప్రేమించి పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తితో తనకు వివాహం చేయలంటూ వీరవాసరం మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన గుబ్బల రాజేశ్వరి శుక్రవారం వీరవాసరం పోలీసుస్టేషన్ వద్ద, ప్రియుడి ఇంటి వద్ద నిరహరదీక్షకు దిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. వీరవాసరానికి చెందిన పాల శ్రీనివాస్ తాను 2009 నుండి ప్రేమించుకున్నట్లు రాజేశ్వరి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక ఇంట్లో కాపురం పెట్టి రెండు రోజుల అనంతరం తనకు చెప్పకుండా హైదరాబాద్ నుండి శ్రీనివాస్ వీరవాసరం వెళ్లి పోయాడని తెలిపింది. ఎంతకూ శ్రీనివాస్ రాకపోవడంతో తాను హైదరాబాద్ నుండి వచ్చినట్లు తెలిపింది. పెద్దల సమక్షంలో సమస్యను తెలపగా శ్రీనివాస్ పెళ్ళి చేసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం చేయలేదన్నారు. అయితే తనకు న్యాయం చేయాలంటూ వీరవాసరం పొలీసుస్టేషన్ వద్ద దళిత మహానాడు అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్, చింతపల్లి మాణిక్యాలరావు, పాల మాసిరాజు ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో ఎస్సై శీలం శంకర్ ఆందోళనకారులతో చర్చించారు. రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ పై కేసు నమోదుచేశామని, నాగ శ్రీనివాస్‌ను అరెస్టు చేయడానికి తిరుగుతున్నామని తెలిపారు. అయితే నాగశ్రీనివాస్‌తో వివాహం జరిగే వరకు నిరహార దీక్ష చేస్తానని రాజేశ్వరి తెలిపింది.

తనను ప్రేమించి పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తితో
english title: 
fasting

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>