శ్రీశైలం/ ఆత్మకూరు రూరల్, మా ర్చి 9: మహాశివరాత్రి సందర్భంగా దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తజనం అధిక సం ఖ్యలో తరలివస్తున్నారు. వారి ఆశ, దీపం అంతా ఆ రుద్రుడే. ఆయన దర్శనమే ముఖ్యం. ఇందు కోసం ఎంతో దూరం నుండి వస్తారు. ఎన్ని గంటలైన వేచి చూస్తారు. ఎన్ని అసౌకర్యాలైనా భరిస్తారు. అయితే ఇదే సమయంలో ముష్కరులు విధ్వంసాలు సృష్టించే అవకాశాలు మెండుగా వున్నా యి. ఈ క్రమంలో శ్రీశైల క్షేత్రంలో భద్రతా చర్యలపై భక్తులు, ప్రజల నుం చి విమర్శలు వినిపిస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తు లు వాహనాల్లో పెద్దఎత్తున చేరుకుంటున్నారు. తిరుమల తరహాలో వాహనా లు ప్రయాణించే వారితో పాటు వారి సామాగ్రి నమోదు అవుతుందా? సత్రాల్లో గదులు తీసుకున్న వారి వివరాలు వుంటాయి కాని గదులు లేని భక్తులు సత్రాల బయట వుంటున్నారు మరి వారి వివరాలు వున్నాయా? అనే వాటిపై అనుమానాలు తలెత్తుతున్నా యి. నలుమూలల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రధాన ద్వారం మఠాల దగ్గర పోలీసుల నిఘా నామమాత్రం గా వుంది. నిరంతరం రద్దీని గమనించాల్సిన పోలీసులు పేపర్లు చదువుకుం టూ కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. ఆలయం చుట్టూ, విఐపిలు వున్న ప్రాం తాల్లో పోలీసుల హడావిడి కనిపిస్తుం దే తప్ప ఆలయానికి దూరంగా వున్న సత్రాలు, మఠాల వద్ద కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వైభవంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం, మార్చి 9: రాఘవేంద్రస్వామి మఠంలో ద్వాదశి వేడుకలను మఠం పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులతో ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి రాఘవేంద్రస్వామి బృందావనానికి నిర్మల్యవిసర్జన, సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, అలంకరణలోభాగంగా వెండి, చెక్క రథోత్సవాలపై అదీష్టించి ఆలయ ప్రాంగణం చుట్టు ఊరేగించారు.
నగర అభివృద్ధే ధ్యేయం
* మంత్రి టిజి వెంకటేష్
కర్నూలు స్పోర్ట్స్, మార్చి 9: కర్నూ లు నగర అరాభివృద్ధే తన ధ్యేయమని మంత్రి టిజి.వెంకటేష్ పేర్కొన్నారు. నగరంలో శనివారం మంత్రి క్రీడల రన్‌ను ప్రారంభించారు. ఈ రన్ స్థానిక వినాయక్ ఘాట్ నుంచి కలెక్టరేట్, వైద్య కళాశాల మీదగా స్విమ్మింగ్ పూల్‌కు చేరుకుంది. స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి టిజి.వెంకటేష్, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్‌కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, నగర పాలకసంస్థ కమిషనర్ పివివిఎస్.మూర్తి, డిఎస్‌డిఓ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టిజి మాట్లాడుతూ నగర అభివృద్ధికై తన వంతు కృషి చేస్తున్నానని, వరదల తరువాత నగరానికి పూర్వ వైభవంకి తీసుకొచ్చామన్నారు. నగరంలోని కెసి కాలువ సమీపంలో రూ. 30 కోట్ల వ్యయంతో వినాయక్ ఘాట్ వద్ద బోటింగ్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి నగరాన్ని సుందరవనంగా తీర్చిద్దిదుతామన్నారు. ముఖేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో ఇటువంటి రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ రన్‌లో చిన్నాపెద్ద తేడా లేకుండా పాల్గొనడం క్రీ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎంఎ.రవూఫ్, క్రీడా సంఘాల ప్రతినిధులు రామాంజినేయులు, ఎం.విజయకుమార్, గంగాధర్, హర్షవర్ధన్, సుధీర్, పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించే వరకూ
పోరాడుతాం..
* సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షడ్రక్
కల్లూరు, మార్చి 9: పెంచిన ధరలపై ప్రభుత్వం దిగొచ్చేంత వరకూ పోరాడుతామని, విద్యుత్ కోతలు, చార్జీలు తగ్గించేంత వరకూ వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షడ్ర క్ హెచ్చరించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో శనివారం సిపిఐ, సిపి ఎం, ఫార్వర్డ్ బ్లాక్, వామ పక్షాల పార్టీలతో సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాక ర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌం డ్ టేబుల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా షడ్రక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల పార్టీలతో కలిసి ఈ నెల 14వ తేదీ విద్యుత్ కోతలకు నిరసనగా తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ప్రభు త్వం ప్రణాళికలు లేని విధానాలను అవలంభిస్తున్న వల్లే రాష్ట్రంలో అంధకారం ఏర్పడిందన్నారు. విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వానికి నివేదికలు అందించడంలో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు. ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాన్ని తగ్గించకపోతే ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ విద్యుత్ కోతలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం విధించిన విద్యుత్ కోత కారణంగా నాశనమవుతున్న విద్యార్థుల భవిష్యత్‌కు కిరణ్ సర్కారు బాధ్యత వహించాలన్నారు. గ్రామీణ ప్రజలు విద్యుత్ కోతల కారణంగా నరకాన్ని అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమన్నారు. ఇంటి బాడుగ కంటే విద్యుత్ బిల్లు అధికంగా రావడంతో పేద, మధ్య తరగతి కటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. సిపిఐ నగర కార్యదర్శి రసూల్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో వామపక్షాల నేతలు గోకారి, నాగన్న, చక్రవర్తి, రామాంజనేయులు, పాల్గొన్నారు.
* సత్రాలు, మఠాల్లో కనిపించిని సిసి కెమెరాలు.. * విఐపిలకే పరిమితమైన భద్రత..
english title:
s
Date:
Sunday, March 10, 2013