చింతకాని/కామేపల్లి మార్చి 9: ప్రమాదవశాత్తు బావిలో పడి మూడేళ్ళ చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కాశీమాల ప్రసాద్, తిరుపతమ్మలకు ఇద్దరు పిల్లలున్నారు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళటంతో చిన్న పాప అయిన మధులత(3) ఇంటి వద్దనే ఆడుకుంటోంది. ఈ సమయంలో చాక్‌లెట్ల కోసం తన తాత వద్ద నుంచి రెండు రూపాయలు తీసుకొని ఇంటి పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్ళి వస్తున్న సందర్భంలో కుక్కలు పాప వెంటపడ్డాయి. దీంతో పరుగులు తీసిన చిన్నారి తన ఇంటి పక్కన ఇళ్ళయిన డోగుపర్తి రజీమ్ నివాసంలోని బావిలో పడి మృతి చెందింది. అటువైపు వెళ్తున్న మహిళ బావిలో మధులత మృతదేహాన్ని చూసి కేకలు వేయటంతో గ్రామస్థులు మృతదేహాన్ని వెలికితీసి పొలంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పొలానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ముద్దుగా ఆడుకుంటున్న తన కుమార్తె మృత్యు ఒడిలోకి చేరటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో కుక్కలు అధికంగా ఉన్నాయని, కుక్కల వల్లనే పాప మృతి చెందిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
కామేపల్లి మండలం పొనె్నకల్‌లో....
కామేపల్లి: మండల పరిధిలోని పొనె్నకల్ గ్రామానికి చెందిన విహహిత యువతి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలో చోటుచేసుకుంది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామేపల్లికి చెందిన మిట్టపల్లి భవాని మండలంలోని పొనె్నకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు రెండేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది కుమార్తె ఉంది. శనివారం బట్టలు ఉతీకేందుకు సమీప బావి వద్దకు వెళ్ళిన భవాని నీళ్ళు తోడుతుండగా ప్రమాదవశాత్తు జారి బావిలో పడి మృతి చెందింది. మృతురాలి తల్లి భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శవ పంచనామాను స్థానిక తహాశీల్దార్ లక్ష్మణ్ స్వామి నిర్వహించారు.
* ప్రమాదవశాత్తు శనివారం నాడు ఓ చిన్నారి, మరో వివాహిత బావిలో పడి దుర్మరణం పాలైన ఘటనలు చింతకాని, కామేపల్లి మండలాల్లో చోటుచేసుకున్నాయ
english title:
c
Date:
Sunday, March 10, 2013