కొత్తగూడెం టౌన్, మార్చి 9: విద్యుత్‌కోత నుండి కొత్తగూడెం నియోజకవర్గానికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని టిఆర్‌ఎస్ నాయకులు విద్యుత్ అధికారులకు అందించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్టస్రమితి నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రావు, జెవిఎస్ చౌదరి మాట్లాడుతూ విద్యుత్ అవసరాలకు ఉపయోగపడే బొగ్గును అందించటమే కాక విద్యుత్‌కేంద్రం సైతం కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న దృష్ట్యా ప్రభుత్వం విద్యుత్‌కోత నుండి కొత్తగూడెం నియోజకవర్గానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు సక్రమంగా విద్యుత్ సరఫరా అందించకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు అధికశాతం కరెంట్‌కోత వలన మంచినీరు దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్‌కోతను ఎత్తివేయాలని లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు పిట్టల కమల, మల్లెల ఉషారాణి, భూక్య రుక్మిణి, తుంగ కనకయ్య, ఇమ్రాన్, ఆనంద్, అనుదీప్, మోర్రె భాస్కర్ పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో అపహరణకు గురైన
బాబు దొరికాడు
* పోలీసుల అదుపులో నిందితురాలు
* ఆస్పత్రి సిబ్బందిపై అనుమానాలు
ఖానాపురం హవేలి, మార్చి 9: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం 8రోజుల బాబును అపహరించిన మహిళను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.