పూతలపట్టు, మార్చి 9: ఇద్దరు విద్యార్థినులు నీటి గుంటలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని ఆకనంబట్టులో శనివారం చోటుచేసుకుంది. దీనితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకొన్న వారి బంధువులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామమే శోకసంద్రమైంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని ఆకనంబట్టు దళిత వాడ సమీపంలో ఉన్న మంచినీటి గుంటలో ఇటీవల కురిసిన వర్షానికి నీరు చేరింది. రెండవ శనివారం శెలవుకావడంతో ఇంటివద్దనే ఉన్న ఇద్దరు చిన్నారులు సంధ్య(12), వౌనిక(9) సరదాగా స్థానం చేసేందుకు గుటలోకి వెళ్ళారు. గుంటలో దిగిన వారు మృత్యువడిలోకి చేరుకోవడంతో వారిని రక్షించించేదుకు ఉపేంద్ర అనే యువకుడు నీటి గుంటలోకి దిగి మునిగిపోతుండడంతో అది గమనించిన చిరంజీవి అనే యువకుడు ఉపేంద్రను జుట్టుపట్టుకొని పైకిలాగాశాడు. ఈ ఇద్దరు తమ అక్కచెళ్లెళ్లు నీళ్ల గుంటలో మునిగిపోయారని బోరున విలపిస్తుండడంతో పక్కనే పొలాల్లో ఉన్న రైతులు సంఘటన స్థలానికి చేరుకొని నీళ్ల గుంటలో ఉన్న సంధ్య, వౌనికను బయటకు తీసుకొచ్చారు. వెంటనే 108అంబులెన్సు ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్ అక్రంరబ్బాని వీరిని పరిశీలించి అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. మృతి చెందిన వీరు ఆకనంబట్టులో సంధ్య 7వ తరగతి, వౌనిక 4వ తరగతి చదువుతున్నారు. దీంతో ఆకనంబట్టు దళితవాడలో విషాదచాయలు అలుముకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎంఇఓ ప్రసాద్, హెచ్‌ఎం పట్ట్భా విద్యార్థినుల మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
ఇంజనీరింగ్ విద్యార్థులు కూలి పనికెళ్తున్నారు.....
ఇదేనా ప్రగతి?
యుపిఎ తొమ్మిదేళ్ళ పాలనలో ఎనిమిది లక్షల కోట్ల అవినీతి
ప్రజాసమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం తప్పదు
కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్
తిరుపతి,మార్చి 9: యుపిఎ తొమ్మిదేళ్ళ పాలనలో ఎనిమిది లక్షల కోట్ల అవినీతి రూపాయల అవినీతి జరిగిందని ఈ డబ్బును వెలికితీస్తే ప్రజలపై పన్నులభారం వేసే పరిస్థితే ఉత్పన్నం కాదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఉద్ఘాటించారు. పెంచిన కరెంటుచార్జీలను నిరసిస్తూ జిల్లాలో నిర్వహించిన జీపులజాతా ముగింపుసభ తిరుపతి మునిసిపల్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గఫూర్ మాట్లాడుతూ ఆర్థికవేత్త అయిన ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ దేశాన్ని పరిపాలిస్తున్నారని, ఆయన పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు భావించారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా అప్రజాస్వామిక విధానాలు, అవినీతి కుంభకోణాలు, దేశంలో పెచ్చరిల్లుతున్నాయని ధ్వజమెత్తారు. యుపిఎ తొమ్మిదేళ్ళ పాలనలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బడా కార్పొరేట్ కంపెనీలకు 5 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారన్నారు. లక్షలకోట్ల రూపాయలు పన్నుల భారం ప్రజలపై మోపారన్నారు. అవినీతి నల్లధనాన్ని వెలికితీస్తే ప్రజలపై పన్నులభారం మోపాల్సిన అవసరమే వుండదన్నారు. డబ్బులు చెట్లకు కాయవని చెప్పిన యుపిఎ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌కు ఎలా ధారాదత్తం చేస్తుందని ప్రశ్నించారు. ఇది పేదలను మరింత పేదలుగా, ధనికులను మరింత ధనికులుగా మారుస్తున్న అరాచక, అప్రజాస్వామిక పాలనకు అద్దం పడుతుందన్నారు. దేశం ప్రగతిపధంలో దూసుకుపోతున్నదన్న ప్రధానమంత్రికి ప్రజాసమస్యలు కన్పించడంలేదా అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ విద్యార్థి సైతం ఉపాది హామీ పనులకు పోతున్నారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో వుందో అర్ధమవుతున్నదన్నారు. డిగ్రీలు, పిజిలు చేతబట్టుకుని ఉపాదికోసం కార్పొరేట్ కంపెనీల చుట్టూ నిరుద్యోగ యువత తిరుగుతున్నదని విమర్శించారు. దేశంలో 14 లక్షల ఉద్యోగాలు ఖాళీలు వున్నాయన్నారు వీటన్నిటిని భర్తీ చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 900 కోట్లు విద్యుత్ భారంమోపిన చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయి నేటికి కోలుకోలేని పరిస్థితిలో వుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రజలపై 30,000 కోట్ల రూపాయలు భారం మోపిందన్నారు. త్వరలో మరో 12,700కోట్లు కరెంటు చార్జీల భారం మోపేందుకు కిరణ్ సర్కార్ రంగం సిద్ధం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో 3400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే గ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లున్నాయన్నారు. అయితే వీటికి గ్యాస్ అందించాల్సిన రిలయన్స్ కంపెనీ రాష్ట్రంలోని గ్యాస్ నిక్షేపాలను గుజరాత్‌కు తరలిస్తూ దోపిడీ చేస్తుందని ఆరోపించారు. ఈ సమస్యలన్నిటిపైన ఈనెల 14న రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. 19వ తేదీన దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందారపు మురళి, సోమయ్య, జిల్లా నాయకులు చైతన్య, పుల్లయ్య, నగరనాయకులు కుమారమ్మ, అరుణ, గజేంద్ర, యశోద, హేమలత, విజయలక్ష్మి, సుబ్రమణ్యం, జయచంద్ర, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం
* మాక్‌డ్రిల్ అని తేల్చిన ఆర్‌పిఎఫ్ అధికారులు
రేణిగుంట, మార్చి 9: రేణిగుంట రైల్వేస్టేషన్‌లో శనివార సాయంత్రం బాంబు కలకలం రేగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆర్‌పిఎఫ్ అధికారులకు రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టారంటూ వచ్చిన అసత్యపు ప్రచారం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా జరిగింది. ఆర్‌పిఎఫ్ అధికారులు, జిఆర్‌పి అధికారులు, రైల్వే అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. ఇక ప్రయాణికుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 1వ నంబర్ ప్లాట్‌ఫారం మొదలు ఐదవ నెంబర్ ఫ్లాట్‌పారం వరకు రైల్వేస్టేషన్‌లోని బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది అణువణువును పరిశీలించారు. ఐదవ నెంబర్ ప్లాట్‌ఫారంలో ఓ బెంచి కింద అనామత్తుగా పడి ఉన్న రెండు బియ్యపు సంచులు, ఓ లగేజీ బ్యాగును గుర్తించారు. వీటిని ఆర్‌పిఎఫ్ అధికారులు విప్పి చూడగా అందులో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు లభించాయి. గన్‌ఫౌడర్, డిటోనేటర్లు, ఎఇకె ఫౌడర్, ఫ్యూయల్ వైర్, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు లభించాయి. ఇవి ఎవరో పెట్టిన పేలుడు పదార్థాలు కావని, తామే ప్రయాణికుల అప్రమత్తత కోసం మాక్‌డ్రిల్ నిర్వహించామని ఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. గుంతకల్ డివిజన్ చీప్ కమాండెంట్ సెంథిల్‌కుమరేశన్, ఐపిఎస్ అధికారులు విఎస్‌ఎన్ రాజు, జివిఆర్ కుమార్, చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
* ఆకనంబట్టులో విషాదం
english title:
b
Date:
Sunday, March 10, 2013