విజయవాడ, మార్చి 10: ఆకస్మిక మరణానికి గురైన మాజీ డెప్యూటీ మేయర్ అన్నే ప్రసన్న భౌతికకాయంకు ఆదివారం ఇఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని శ్మశానవాటికలో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. కస్తూరిబాయిపేటలోని నివాస గృహం వద్ద ఉంచిన ప్రసన్న భౌతికకాయాన్ని ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. వీరిలో ఎంపి లగడపాటి రాజగోపాల్, శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంఎల్సి జల్లి విల్సన్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, మాజీ మేయర్లు తాడి శకుంతల, ఎంవి రత్నబిందు, పంచుమర్తి అనూరాధ, నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ హుస్సేన్, యూత్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ కార్పొరేటర్లు పి దుర్గ్భావాని, వీరమాచనేని లలిత, పిల్లి లక్ష్మీతులసి, అడపా శేషు, మాజీ శాసనసభ్యుడు షేక్ నాసర్వలి, కె సుబ్బరాజు, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులున్నారు. శాసనసభ్యుడు మల్లాది విష్ణు ముందుగా ఆసుపత్రిలోనే సందర్శించి వెళ్లారు.
ఆకస్మిక మరణానికి గురైన మాజీ డెప్యూటీ మేయర్
english title:
funeral
Date:
Monday, March 11, 2013