నెల్లూరు, మార్చి 9: వస్త్రాలపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను నిరసిస్తూ వ్యాపారుల నిరవధిక బంద్ ప్రారంభమైంది. శనివారం నుంచి వ్యాపారులంతా తమ దుకాణాలను మూసివేసి మూకుమ్మడి నిరసన వ్యక్తం చేశారు. వస్త్ర విక్రేతల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలోనూ వ్యాపారులు బంద్ చేశారు. ఈ సందర్భంగా నగరంతో సహా పలు పట్టణాల్లో వ్యాపారులు ర్యాలీ చేపట్టారు. వస్త్ర వ్యాపారంలో పదిశాతం బడా వర్తకులకు మాత్రమే అనుకూలించేలా ప్రభుత్వం వివిధ నిబంధనల్ని జోడించడంపై దుకాణదారులంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వస్త్రాలను సెన్సిటివ్ కమాడెటీస్ పరిధిలోకి తీసుకురావడం దారుణమంటూ దుయ్యబడుతున్నారు. కాగా, ఇప్పటి వరకు వస్తవ్య్రాపారుల ఆందోళనలపై మద్దతు ఇస్తున్న నిలుస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ప్రారంభించిన బంద్‌కు మాత్రం సహాయ నిరాకరణ దిశగా వ్యవహరిస్తోంది. ఇదిలాఉంటే ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై వ్యాట్ విధించడం తగదంటూ బిజెపి నెల్లూరుజిల్లా అధ్యక్షులు పి సురేంద్రరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం సున్నితమైన వినిమయ వస్తువులు వస్త్రాల్ని పరిగణించి వ్యాట్ విధించడం శోచనీయమని పేర్కొన్నారు. వస్త్ర దుకాణాల నిరవధిక మూత వల్ల జిల్లాలోని నెల్లూరు నగరంతో సహా కావలి, వెంకటగిరి, ఆత్మకూరు పట్టణాల్లో పెద్దసంఖ్యలో ఉన్న వ్యాపారులతోపాటు ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఉపాధి లేక వీధిన పడతారన్నారు. అంతేగాక హమాలీలు, ట్రాన్స్‌పోర్టర్లు సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. వస్తవ్య్రాపారుల బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేసిన వారిలో బిజెపి జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన నెల్లూరు నగర కమిటీ అధ్యక్షులు మండ్ల ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు వై రాజేష్, నరసింహులుగౌడ్, తదితరులున్నారు.
బిజెపి మద్దతు
english title:
cloth merchants bandh
Date:
Monday, March 11, 2013