Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రావణ వాహనంపై మూలస్థానేశ్వరస్వామి దర్శనం

$
0
0

నెల్లూరు , మార్చి 9: స్థానిక మూలపేటలోని భ్రమరాంబా సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శివరాత్రి బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మూలస్థానేశ్వరస్వామి వెండి రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చప్పర ఉత్సవం చేశారు. రేబాల హరిశ్చంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉత్సవాలకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, అష్టోత్తర, సహస్రనామ పూజలు చేశారు. సహస్రలింగేశ్వరస్వామికి క్షీరాభిషేకం, పూలంగిసేవ చేశారు. విఘ్నేశ్వర నృత్యనికేతన్ విజయలక్ష్మి నాట్యబృందం శాస్ర్తియ నృత్యాలు, లక్ష్మీ నాట్య మండలి పాశం మస్తానయ్య ఆధ్వర్యంలో ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం భక్తులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు పూలంగిసేవ, ఉదయం గినె్నభిక్ష, రాత్రి లింగోద్భవ అభిషేకం, వెండి నంది సేవ జరుగుతాయి.
రాత్రి 7 గంటలకు రాయబారం పడకసీను, మోహినీభస్మాసుర తపస్సు సీను వంటి సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. నగరంలో డైకస్‌రోడ్డు ఉమా మహేశ్వరస్వామి ఆలయం, దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలోని సుందరేశ్వరస్వామి ఆలయం, మూలపేటలోని అన్నపూర్ణాసమేత నీలకంఠేశ్వరస్వామివారి దేవస్థానంతోపాటు నగరంలోని పలు శివాలయాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

స్వశక్తితోనే మహిళాభివృద్ధి సాధ్యం
* రాష్ట్ర మహిళా మోర్చా విజయలక్ష్మి పిలుపు
నెల్లూరు కల్చరల్, మార్చి 9: మహిళలు స్వశక్తితోనే అభివృద్ధి సాధించాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ, విముక్తి ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం స్థానిక బోడిగాడితోట కాలనీలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ త్యాగాలకు, కష్టాలకు మహిళలు ప్రతిరూపమైన నిరాధార మహిళలు స్వశక్తితోనే పైకి ఎదగాలన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు రోజురోజుకూ అణిచివేతకు గురవుతుని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో స్ర్తి శక్తిలేకుంటే సృష్టి మనుగడ అసాధ్యమన్న సంగతి పురుషులు గుర్తించాలన్నారు. విముక్తి నిర్వహిస్తున్న బాధిత మహిళల కోసం తమ వంతు సాయం అందచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత మహిళలు తమ సమస్యలు తన దృష్టికి తెస్తే ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విజయలక్ష్మి హామీ ఇచ్చారు. విముక్తి కన్వీనర్ పద్మ మాట్లాడుతూ విముక్తి సంఘం ద్వారా బాధిత మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందించామన్నారు. బాధిత మహిళల సంతానం అక్రమ రవాణాకు గురై వ్యభిచార కూపంలో చిక్కుకోకుండా ఉండేందుకు విముక్తి పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సుహాసిని, ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస సావర్కర్, సభ్యులు లక్ష్మి, అమలు, ఆదిలక్ష్మి, అమల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అలరించిన భక్తిగాన లహరి
నెల్లూరు , మార్చి 9: త్యాగరాజ సాంస్కృతిక సభ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక టౌన్‌హాలులో నిర్వహించిన శ్రీకృష్ణ లీలా తరంగాల భక్తిగాన లహరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సాంస్కృతిక సభ, గురుకృప సంగీత విద్యాలయం అధినేత్రి ఎ లక్ష్మీప్రసన్న పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీప్రసన్న శిష్యులు మల్లాది అనూష, భావన, శశికళ, అంజన, లక్ష్మీప్రసన్న, కీర్తన, శ్రీరాగ, సన్విత ఈకార్యక్రమంలో పాల్గొని తరంగాలు గానం చేశారు. వీరి గానానికి వయోలిన్‌పై ఎం లోకేష్‌బాబు, మృదంగంపై శాంతి కళాధర్, తబలాపై శాంతికుమార్, కీబోర్డు సురభి సంగీత్, ఫ్లూట్ హనూక్‌బాబు, ప్యాడ్ గరి, వీణపై పి హేమలక్ష్మి, ఆర్ పద్మ చక్రవర్తి సహకరించారు. పురప్రముఖులు, సంగీతాభిమానులు, నగర ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

కమనీయం శ్రీనివాస కల్యాణం
నెల్లూరు కల్చరల్, మార్చి 9:తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్, టిటిడి ధార్మిక సలహా మండలి సభ్యుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక కెఎన్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్లో శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, దేవేరుల ఉత్సవ మూర్తులను వివిధ రంగుల పుష్పాలు, దివ్యాభరణాలతో ముస్తాబుచేసి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉంచి అర్చకస్వాములు వేదోక్తంగా, శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాలు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చాటనల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. సూర్యనారాయణస్వామి, చైతన్యస్వామి, గిరిధర స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులకు లడ్డు, అన్నప్రసాదాలను అందచేశారు. పుర ప్రముఖులు, నగర ప్రజలు, విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం దర్గామిట్టలోని టిటిడి కల్యాణ మండపంలో నిర్వహించిన శ్రీవారి శ్రవణా నక్షత్ర శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించిన పలువురు భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు.

టెన్త్ విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ
నెల్లూరు కల్చరల్, మార్చి 9: అఫ్కాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక భక్తవత్సలనగర్‌లోని కెఎన్‌ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు ఈదూరు రాజ్‌కుమార్ మాట్లాడుతూ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు 3వందల పరీక్ష అట్టలు, పెన్నులు అందచేశామన్నారు. ఇందుకు సహకరించిన భారతీ గిరీష్ జైన్‌కు రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ వైదేహి, గిరీష్‌జైన్, ప్రధానోపాధ్యాయులు విజయ్‌ప్రకాష్, సంస్థ సిఇఓ డి రామ్‌రాజ్, కోశాధికారి బి ఉషారాణి, శిరీష, పద్మ, భరణి, నవీన్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇన్‌ఫ్యాంట్ వార్మర్ సంజీవని వంటిది
నాయుడుపేట, మార్చి 9: నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్యాంట్ వార్మర్ చంటి పిల్లలకు సంజీవని వంటిదని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. శనివారం ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చంటిపిల్లలో కొందరికి కామెర్ల వ్యాధి సోకివుంటుందని చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధని, దీన్ని గుర్తించిన వెంటనే చంటి పిల్లలను ఇన్‌ఫ్యాంట్ వార్మర్‌లో ఉంచి చికిత్స ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా తక్కువ బరువుతో ఉన్న చిన్నారులు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను దీనిలో ఉంచి చికిత్స చేస్తామన్నారు. ఈసౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

వాకాటిని విమర్శించే అర్హత బీదకు లేదు
నాయుడుపేట, మార్చి 9: ప్రజల మనిషి వాకాటి నారాయణరెడ్డిని విమర్శించే అర్హత బీద రవిచంద్రకు లేదని నాయుడుపేట కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మచ్చలేని నాయకుడిగా ఉన్న వ్యక్తిని విమర్శించటం సరికాదన్నారు. వాకాటిని విమర్శించే ముందు తనకు ఆ అర్హత ఉందా లేదా అని సరిచూసుకోవాలని హితవు పలికారు. టిడిపి నేతల్లా చౌకబారు రాజకీయాలు చేయటం తమ వల్లకాదని వారు తెలిపారు. ప్రజలు వాకాటి నాయకత్వాన్ని అంగీకరించారు కాబట్టే రైతులు తమ పక్షాన నిలిచారని గుర్తు చేశారు. వాకాటి ఏవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో నిరూపించాలని బీదకు సవాల్ విసిరారు. ఇకనైనా ప్రజలతో మమేకమైన తమ నాయకుడిపై ఇటువంటి ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈసమావేశంలో ఎఎంసి మాజీ చైర్మన్ ఎస్ విజయభాస్కర్‌రెడ్డి, సిడిసి చైర్మన్ కట్టా సుధాకర్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ కె సత్యనారాయణరెడ్డి, ఎఎంసి ఉపాధ్యక్షుడు కట్టా కమలాకరరెడ్డి, బిసిసిబి డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, వేణుంబాక లక్ష్మినారాయణరెడ్డి, లాయర్ గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై కొరడా
నాయుడుపేట, మార్చి 9: నాయుడుపేటలోని స్వర్ణముఖి నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గూడూరు సబ్‌కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని పలుచోట్ల భూముల కన్వర్షన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన స్వర్ణముఖి నది వద్ద విలేఖర్లతో మాట్లాడారు. స్వర్ణముఖి నది, మామిడి కాల్వ నుండి పలు చోట్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయని, ఆయా ప్రాంతాలలో వాహనాలు వెలుపలకు పోకుండా అడ్డుగా కర్రలగేటు ఏర్పాటు చేయాలని తహశీల్దార్ చెంచు కృష్ణమ్మను అదేశించారు. అదే విధంగా జోస్యుల వారి కండ్రిగ వద్ద కూడా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇకపై ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తూ దొరికిన వాహనాలను రెవెన్యూ అధికారులు స్వాధీనపర్చుకొని వేలం వేస్తారని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు సంబంధిత అధికారుల నుండి వేబిల్లులు పొందాలన్నారు. ఈయనతో పాటు సర్వేయర్ సుబ్రహ్మణ్యం, విఆర్‌ఓ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ధరకు తగ్గించి కొనేవారిపై క్రిమినల్ కేసులు నమోదు
నాయుడుపేట, మార్చి 9: ధాన్యాన్ని మద్దతు ధరకు తగ్గించి కొనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం ఆయన నాయుడుపేట ఆర్ అండ్ బి అతిథిగృహంలో రైసుమిల్లరు, ధాన్యం దళారులతో సమావేశం ఏర్పాటు చేసారు. 1010 రకానికి చెందిన వరి ధాన్యాన్ని 10700కు తగ్గించి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయటానికి వీలులేదని ఆయన తెలిపారు. రైతుల వద్ద ధాన్యాన్ని దళారులు 10500 రూపాయలకు కొనుగోలు దళారులు కొనుగోలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ముందస్తుగా దళారులకు, రైసుమిల్లు యజమానులకు ముందస్తుగా హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దళారులు ధరలు తగ్గించికొన్నట్టు తేలితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక తహశీల్దార్ చెంచు కృష్ణమ్మను ఆదేశించారు. రైసుమిల్లుయజమానులు కూడా మద్దతు ధర తగ్గించి కొనరాదని అలా చేసిన వారి ఫుడ్‌గ్రైన్ లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఇకపై ప్రతి రోజు గ్రామాలలో పర్యటించి అవసరమైన చోట దళారులపై పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈసమావేశంలో సబ్‌కలెక్టర్ జె నివాస్, తహశీల్దార్ చెంచు కృష్ణమ్మ, సివిల్ సప్లయిస్ డిటి కృష్ణారావు, రైసుమిల్లుల యజమానులు, ధాన్యం బ్రోకర్లు పాల్గొన్నారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ గ్రామస్థుల ధర్నా
ఇందుకూరుపేట, మార్చి 9: కోట మండలంలోని కొత్తపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న తోళ్ళ పరిశ్రమపై ఇటీవల అధికారులకు, గ్రామస్థులకు మధ్య వివాదం జరిగింది. దీనిలో గ్రామస్థులు, విద్యార్థులు, పాఠశాల హెచ్‌ఎంపై కేసులు నమోదయ్యాయి. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ గ్రామస్థులు నెల్లూరు కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవిందపల్లికి చెందిన తమపై ప్రభుత్వ అధికారులు నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టటం ఏమిటని విమర్శించారు. విద్యార్థులు, పాఠశాల హెచ్‌ఎంపై కూడా కేసులు నమోదు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం వారు కలెక్టరేట్ పరిపాలనాధికారి మధుసూధన్‌కు వినతిపత్రం అందజేసారు.

వేబ్రిడ్జిల వద్ద తనిఖీలకు ప్రత్యేక అధికారి
ఇందుకూరుపేట, మార్చి 9: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం తూకాలలో తేడాలు లేకుండా తనిఖీలు నిర్వహించేందుకు వేబ్రిడ్జిల వద్ద ప్రత్యేక అధికారిని నియమించినట్టు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం శనివారం తెలిపారు. తనిఖీలకు తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ వెంకటరమణను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు. నాయుడుపేటలోని బాలాజీ, లక్ష్మి, సూళ్ళూరుపేటలోని సాయిగోపాల్, వెంకటగిరిలోని జిహెచ్‌ఆర్, గౌరీశంకర్ వేబ్రిడ్జిలను శనివారం తనిఖీ చేసినట్టు, తనిఖీల నివేదిక తనకు అందినట్టు జెసి లక్ష్మీకాంతం తెలిపారు.

ఇంజన్ ఆయిల్ పొదుపులో ఆర్టీసీ డిపోకు అవార్డు
ఉదయగిరి, మార్చి 9: 2011-12 సంవత్సరం స్థానిక ఆర్టీసీ డిపోలో ఇంజన్ ఆయిల్ పొదుపు చేసినందుకు జిల్లాలో ఉత్తమ డిపోగా గుర్తించి బెస్ట్‌లూప్ కెపిఎల్ అవార్డును ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గురువారం హైదరాబాద్‌లో ప్రకటించినట్టు డిపో మేనేజర్ శేషుకుమార్, ఎంఎస్ ప్రతాప్ చెప్పారు.

స్థానిక మూలపేటలోని భ్రమరాంబా సమేత
english title: 
mula

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>