Date:
Wednesday, March 13, 2013 (All day)
వృశ్చికం:
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వుంటాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.
మేషం:
అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. డబ్బు చేతికందుతుంది. నూతన ఆభరణాలు సేకరిస్తారు.
వృషభం:
ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా దైవ ప్రార్థన చేయాలి.మనోల్లాసాన్ని పొందుతారు.
మిథునం:
శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదుచేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
కర్కాటకం:
నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది.
సింహం:
మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తులజోలికి వెళ్లరాదు.
కన్య:
అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. గణేశుని ప్రార్థన మంచిది.
తుల:
బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.
ధనుస్సు:
తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టంకలగవచ్చు. వృధా ప్రయాణాలెక్కువచేస్తారు. అనాసక్తితో వుంటారు.
కుంభం:
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది.
మీనం:
పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.
దుర్ముహూర్తం:
మ.12.51 నుండి 02.31 వరకు
రాహు కాలం:
..
వర్జ్యం:
రా.01.03 నుండి 02.43 వరకు
నక్షత్రం:
ఉత్తరాభాద్ర మ.12.36
తిథి:
శుద్ధ విదియ రా.12.47
మకరం:
వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. అప్రమత్తంగా నుండుట అవసరం.