వాషింగ్టన్, ఫిబ్రవరి 10: మరో 5 నుంచి 20 కోట్ల సంవత్సరాల్లో ఆస్ట్రేలియా భారత్‌లో విలీనమై పోవచ్చని ఖండాలన్నీ ఒకదానితో మరోటి ఢీకొని బ్రహ్మాండమైన ఒకే ఖండం ఆవిర్భవించవచ్చని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. అమెరికా ఖండాలు, ఆసియా ఉత్తర దిశగా కదిలిపోతాయని, ఆర్కటిక్, కరేబియన్ సముద్రాలు కలిసిపోయి, ఉత్తర ధ్రువం ప్రాంతంలో అన్నీ ఒకటిగా విలీనమై పోయి ‘అమేసియా’గా పిలవబడే ఒకే మహా ఖండంగా ఏర్పడతాయని అమెరికాలోని యాలే యూనివర్సిటీకి చెందిన భూభౌతిక శాస్తవ్రేత్తలు అంటున్నారు. వీరు జరిపిన పరిశోధన గురువారం ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైంది. భూమి అడుగు ఫలకాలు నిరంతరం కదులుతూ ఉంటాయని, ఏదో ఒక రోజున ప్రపంచం ఇప్పుడున్న దానికి పూర్త్భిన్నంగా ఉంటుందనే వాదనను వీరి పరిశోధన మరోసారి గుర్తు చేస్తోంది. ఈ ఫలకాల కదలిక కారణంగా ఆసియా, ఐరోపా ఖండాలు, ఇప్పటి ఉత్తర ధ్రువానికి దగ్గర్లో పరస్పరం ఢీకొంటాయని యాలే యూనివర్సిటీ భూభౌతిక శాస్తవ్రేత్త రాస్ మిచెల్ చెప్పినట్లు ‘నేషనల్ పోస్ట్’ పత్రిక తెలియజేసింది. ‘మా పరిశోధన ప్రకారం ఆస్ట్రేలియా కూడా ఉత్తర దిశగా కదులుతూ భారత్ పక్కకు చేరుకుంటుంది’ అని ఆయన చెప్పారు. ఖండాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం ద్వారా ఏర్పడే ఈ మహా ఖండాలు ఒకదానికొకటి 90 డిగ్రీల సమాంతరంగా ఏర్పడతాయని కూడా ఈ శాస్తజ్ఞ్రులు నమ్ముతున్నారు. తమ పరిశోధన కోసం మిచెల్ ఇతర శాస్తజ్ఞ్రులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన శిలల జన్మస్థలాల మ్యాప్‌ను తయారు చేయడం కోసం వాటిని విశే్లషించారు. ఈ పరిశోధనలను బట్టి మహాఖండాల ఏర్పాటు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని వారు గుర్తించారు. సుమారు 30 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన చివరి మహా ఖండం ‘పంగెయా’కు ముందు అలాంటి మూడు మహాఖండాలు ఏర్పడినట్లు మిచెల్ చెప్పారు. రాక్షసాకార సరీసృపాలు, డైనోసార్‌లు పుట్టిన పంగెయా తనకన్నా ముందున్న మహాఖండం రొడీనియాకు 90 డిగ్రీల సమాంతరంగా ఏర్పడినట్లు, రొడీనియా కూడా తనకన్నా ముందున్న ‘నునా’ అనే మహాఖండానికి అంతే సమాంతరంగా ఏర్పడినట్లు శాస్తజ్ఞ్రులు గుర్తించారు. శాస్తజ్ఞ్రుల బృందం తాము జరిపిన పరిశోధనకు ఆర్థోవెర్షన్ అని పేరు పెట్టారు. ఇప్పటివరకు మహాఖండాల ఏర్పాటుకు సంబంధించి రెండు వాదనలు మాత్రమే ఉన్నాయి. వీటిలో మొదటిది ఇంట్రోవెర్షన్, ఈ వాదన ప్రకారం మహా ఖండాలు ఎలా ఏర్పడ్డాయో అదే విధంగా విడిపోయి తిరిగి అదే స్థానానికి చేరుకుంటాయని మిచెల్ చెప్పారు. మహాఖండం విడిపోవడం వల్ల ఏర్పడిన ఆర్కటిక్ మహాసముద్రం ఖండాలు తిరిగి యథాస్థానానికి చేరుకున్నప్పుడు మాయమైపోతుందని కూడా ఆయన చెప్పారు. ఇక రెండవదైన ఎక్స్‌ట్రోవెర్షన్ వాదన ప్రకారం మహాఖండం విడిపోయేటప్పుడు ఆయా ఖండాలు ఒక చోటినుంచి మరోచోటికి ప్రయాణించి కొత్త ఖండాలు ఏర్పడుతాయి. తాజా పరిశోధన ప్రకారం మొదటగా మాయమయ్యే సముద్రాల్లో ఆర్కటిక్, కరేబియన్ సముద్రాలు ఉంటాయని పరిశోధకులు అంటున్నారు.
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా భూమిపై ఒక్కో ఖండం ఒక్కో రకంగా కదలుతూ ఉండడమే దీనికి కారణమని వారంటున్నారు. అమెరికా భూభౌతిక సర్వే ప్రకారం ఆర్కటిక్ ప్రాంతం మిగతా అన్ని ప్రాంతాలకన్నా చాలా నిదానంగా ఏడాదికి 2.5 సెంటీమీటర్ల చొప్పున కదులుతుండగా తూర్పు పసిఫిక్ ప్రాంతం అత్యంత వేగంగా ఏడాదికి 15 సెంటీమీటర్లకు పైగా కదులుతూ ఉంది.
ప్రపంచమంతా ఒకే మహా ఖండంగా ఆవిర్భావం అమెరికా భూభౌతిక శాస్తవ్రేత్తల అంచనా
english title:
m
Date:
Saturday, February 11, 2012