న్యూఢిల్లీ, మార్చి 16: భారత్‌లో జరగనున్న జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి వైదొలగుతామని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) హెచ్చరించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక హాకీ సిరీస్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. భారత్ నిర్ణయం పట్ల పిహెచ్‌ఎఫ్ తీవ్రంగా స్పందించింది. రాజకీయాలతో క్రీడలను ముడిపెట్టడం సమంజసం కాదని పిహెచ్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ బజ్వా ఫోన్‌లో పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో డిసెంబర్ 6 నుంచి 15వ తేదీ వరకూ జరిగే జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో తమ దేశం పాల్గొనబోదని స్పష్టం చేశాడు. ద్వైపాక్షిక హాకీ సిరీస్‌కు భారత్ అనుమతించాలని కోరాడు.
పాకిస్తాన్ హాకీ సమాఖ్య హెచ్చరిక
english title:
junior hockey world cup
Date:
Sunday, March 17, 2013