Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గాడి తప్పిన గురువు!

$
0
0

చీపురుపల్లి, మార్చి 16 : విద్యాబుద్దులు చెప్పలవసిన ఉపాధ్యాయుడే విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. విషయం వెలుగుచూడటంతో పెదనడిపల్లి ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎస్.లక్ష్మణరావుకు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసారు. సదరు ఉపాధ్యాయుడు ఆపాఠశాలలో 7,8,9వ తరగతులు చదువుతున్న విద్యార్ధినులపై గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్ధులు తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఆ పాఠశాలలో గొల్లలపాలెం,ములగాం, ఇటకలాపల్లి, చిననడిపల్లి, పికె పాలవలస, పేరిడి, దేవరాపల్లి, గబ్బిలవలస, గ్రామాలకు చెందిన వారు చదువుతున్నారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు సరిగా సమాధానం చెప్పడంతో దేహశుద్ధ్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అబ్దుల్ మారూఫ్ పాఠశాలకు చేరుకుని విద్యార్ధులను, తల్లిదండ్రులను విచారించారు. ఆ ఉపాధ్యాయుడు తమను నిత్యం వేధిస్తున్నాడని ఎస్సై మారూఫ్‌కు వివరించారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ పాఠశాల ఆవరణలో తల్లితండ్రులు ధర్నా చేశారు. ఈ సంఘటనలపై ఎస్సై మారూఫ్ విలేఖర్లతో మాట్లాడుతూ గత ఏడాది నుంచి విద్యార్ధులపై ఆ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్ధునులు తెలిపారన్నారు. విద్యార్ధినులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 16: కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తాను అందరికీ మేలు చేసే విధంగా నడుచుకుంటానన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు శాసనమండలి సభ్యుని పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా ఉన్న కార్యకర్తలకు మేలు చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యడ్ల రమణమూర్తి, పులిరాజు తదితరులు పాల్గొన్నారు.
నేతల సందడి..
నిలిచిపోయిన వాహనాలు
ఎమ్మెల్సీగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి తొలిసారిగా పట్టణానికి విచ్ఛేసిన సందర్భంగా పట్టణంలో ఎటు చూసినా కాంగ్రెస్ కార్యకర్తల సందడి కన్పించింది. ఫ్లెక్సి బోర్డులతో ఆయనకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం 10.45 గంటలకు విటి అగ్రహారం వై.జంక్షన్ వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు యడ్ల రమణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొంగలి పోతన్న, బొద్దు నరసింగరావు, యడ్ల ఆదిరాజు, త్రినాద్, గోగుల రమేష్, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని గ్రామ మాజీ సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అభిమానులు, నేతలు గజమాలతో కోలగట్లకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ జెండాలతో అభిమానులు ద్విచక్రవాహనాలపై వచ్చి రోడ్లపై సందడి చేశారు. పులివేషాలు ప్రదర్శించారు. అక్కడ నుంచి ఓపెన్ టాప్ జీపుపై కోలగట్ల వీరభద్రస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లా విజయ్‌కుమార్, డిసిఎంఎస్ చైర్మన్ పులిరాజు, అధికార ప్రతినిధి యడ్ల ఆదిరాజులు బయలుదేరగా కార్యకర్తలు, నేతలు ద్విచక్ర వాహనాలు, జీపులపై ర్యాలీగా బయలుదేరారు. ఐనాడ జంక్షన్ నుంచి బయలుదేరిన ర్యాలీ వి.టి. అగ్రహారం నుంచి ఎత్తు బ్రిడ్జి, వెంకటలక్ష్మి, కన్యకాపరమేశ్వరీ, గంట స్తంభం, పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అక్కడ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మూడులాంతర్ల మీదుగా లయన్స్ కమ్యూనిటీహాలు, బాలాజీ జంక్షన్ మీదుగా కోలగట్ల స్వగృహం వరకు సాగింది.
ఎన్‌హెచ్‌పై నిలిచిపోయిన వాహనాలు
43వ జాతీయ రహదారిపై దాదాపు అర్థగంటకు పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంగ్రెస్ కార్యకర్తల వాహనాలతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. కాంగ్రెస్ అభిమానులు ద్విచక్రవాహనాలపై పెద్ద సంఖ్యలో స్వాగతం పలికేందుకు తరలిరావడంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఉదయం 10 గంటల నుంచి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌లో కోరుకొండ నుంచి విజయనగరానికి గర్భిణిని తీసుకువస్తున్న వాహనం కూడా చిక్కుకొంది. ఆ వాహనానికి దారి కల్పించాలని వేడుకున్న కార్యకర్తలు పట్టించుకోలేదు. చివరకు కోలగట్ల వాహనం అక్కడకు చేరుకున్న తరువాత ఆ వాహనాన్ని విడిచిపెట్టారు.

‘స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 16: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా తయారు చేసిన ఫొటో ఎలక్టోరల్ జాబితాను సంబంధిత కార్యదర్శులకు అందజేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితాలో వాటిని చేర్చాలన్నారు. ఎన్నికలు, ఓటర్ల జాబితాలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యేక నోటీసు జారీ చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండేసి ఓట్లు ఓటర్లు వేయాల్సి ఉంటుందన్నారు. వార్డు మెంబరుకి ఒక ఓటు, సర్పంచ్‌కు ఒక ఓటు వేయాల్సి ఉంటుందని వివరించారు. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికకు ఒక ఓటు, ఎంపీటీసీ ఎన్నికకు ఒక ఓటు వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ గెజిట్ పబ్లికేషన్ జరిగేలోగా రిజర్వేషన్లను స్థిరీకరించాలని కలెక్టర్లను ఆదేశింటచారు. ఈ సమావేశంలో పంచాయతిరాజ్ కమిషనర్ రామ్‌గోపాల్, ప్రిన్సిపల్ కార్యదర్శి నాగిరెడ్డిలు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి.ఎ.శోభ మాట్లాడుతూ తోటపల్లి నిర్వాసితులను రీలొకేట్ చేశామని వాటి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆమె తెలిపారు. అంతేగాకుండా జిల్లాలో జిల్లా పంచాయతి అధికారి, జెడ్పీ డిప్యూటీ సిఇఒ, ఎఒ, ఇఒపిఆర్‌డి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు. వీటిని వెంటనే భర్తీ చేయాలని ఆమె కోరారు.

‘చింతపండు సేకరణ లక్ష్యం 12000 క్వింటాళ్లు’
మక్కువ, మార్చి 16: జి.సి.సి. డివిజన్ పరిధిలో 12,000 క్వింటాళ్లు చింతపండు కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించినట్లు మేనేజర్ యోగేశ్వరరావు తెలిపారు. మక్కువ మండలం నంద జి.సి.సి. డిపోను శనివారం పరిశీలించారు. అనంతరం సంతలో గిరిజనుల నుంచి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్న చింతపండును ఆయన 5క్వింటాళ్ల స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది చింతపండు దిగుబడి తక్కువ ఉందన్నారు. గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంతవరకు 600 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశామన్నారు. సీజన్ ముగిసేలోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కిలో 9 రూపాయలకు తిప్పతీగ కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. గిరిజనుడు చింతపండుతో సహా అటవీ ఉత్పత్తులను జి.సి.సి. విక్రయిస్తున్నారని ప్రైవేటు వ్యక్తుల మోసాలకు గురికావద్దన్నారు.
సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ విజేత జెఎన్‌టియు
విజయనగరం (్ఫర్టు), మార్చి 16: జెఎన్‌టియు(కె) అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జెఎన్‌టియుకె విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల విజయనగరం జట్టు విజేతగా నిలిచింది. జెఎన్‌టియు మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజాం జి.ఎం.ఆర్.ఐటి జట్టు జెఎన్‌టియు జట్టు బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన జెఎన్‌టియు విజయనగరం జట్టు నిర్ణీత 30 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. జెఎన్‌టియు బ్యాట్స్‌మెన్‌లు థాటిగా ఆడుతూ జిఎంఆర్ ఐటి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. జెఎన్‌టియు జట్టులో ఆర్. అనిల్‌కుమార్ 74 పరుగులు, ఎస్‌కె రూహి 31, టి.రాజసింహ 27, ఆర్.శ్రీనివాస్ 24 పరుగులు చేశారు. బౌలింగ్ చేసిన జిఎంఆర్ ఐటి జట్టులో ప్రభాత్ 31 పరుగులు చేసి రెండు వికెట్లు, అవినాష్ 39 పరుగులు చేసి రెండు వికెట్లు తీశారు. ఈ పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా జెఎన్‌టియు విజయనగరం క్రీడాకారుడు ఆర్. అనిల్‌కుమర్ ఎంపికయ్యాడు. మ్యాచ్‌కు అంపైర్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్యానల్ అంపైర్లు రామకృష్ణ, చంద్రశేఖర్ వ్యవహరించారు. సెంట్రల్ జోన్ క్రికెట్ విజేత జెఎన్‌టియు జట్టును జెఎన్‌టియుకె, విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. ఉదయభాస్కర్ అభినందించి ట్రోఫీని అందించారు. అదేవిధంగా రన్నర్‌గా నిలిచిన రాజాం జిఎంఆర్ ఐటి జట్టుకు ట్రోఫీని ఇసిఇ విభాగం అధిపతి డాక్టర్ శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.పి.రాజు తదితరులు పాల్గొన్నారు.
తండ్రిని కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని..
ధైర్యం చెప్పిన అధ్యాపకులు
పార్వతీపురం, మార్చి 16: పట్టణంలో చదువుకుంటున్న తన పిల్లలకు పరీక్షల సందర్భంగా థైర్యం చెప్పడానికి వస్తూ రైలు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇక్కడివారిని కలిచివేసింది. పట్టణంలో నాయుడువీధికి చెందిన పి.ప్రసాద్ బతుకు తెరవుకోసం జనవరిలో హైదరాబాదు వెళ్లాడు. పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో పట్టణానికి తిరిగి వస్తున్నారు. రైలులో హైదరాబాదు నుండి విజయనగరం

విద్యాబుద్దులు చెప్పలవసిన ఉపాధ్యాయుడే విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>