దాతియా, మార్చి 16: భర్తతో కలిసి సైకిల్‌పై భారతదేశ యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళా టూరిస్టుపై ఏడెనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు రాష్ట్ర పోలీసులు శనివారం వెల్లడించారు. సంఘటనకు సంబంధించి 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు చంబల్ రేంజ్ డిఐజి డికె ఆర్య చెప్పారు. ఝారియా గ్రామం వద్ద శుక్రవారం రాత్రి సంఘటన జరిగింది. శ్రీరాముడి ఆలయాల నిలయమైన పర్యాటక కేంద్రం ఆర్చా సందర్శించిన అనంతరం ఆగ్రాకు వెళ్లడం కోసం తిరిగి వస్తూ రాత్రి అటవీ ప్రాంతంలో దంపతులు ఆగినప్పుడు గుర్తు తెలియని కొంతమంది వారిపై దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలిని గ్వాలియర్ ఆస్పత్రికి తరలించారు. నేరానికి పాల్పడిన వారికోసం అడవంతా గాలిస్తున్నట్టు దాతియా ఎస్పీ సిఎస్ సోలంకి చెప్పారు.
‘బాధితురాలికి న్యాయం చేయాలి’
స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తును వేగంగా పూర్తి చేసి బాధితురాలికి న్యాయం చేయాలని భారత్‌లోని ఆ దేశ ఎంబసీ కోరింది. బాధితురాలు కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందించడానికి తాము ప్రస్తుతం ప్రాధాన్యమిస్తున్నామని తెలిపింది. స్విట్జర్లాండ్ ఎంబసీ ఎప్పటికప్పుడు మధ్యప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. భారత్‌లోని స్విట్జర్లాండ్ రాయబారి లైనస్ వోన్ కాస్టెల్‌ముర్ ఇదివరకే బాధితురాలితో మాట్లాడి, ఆమెకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
భర్తతో కలిసి సైకిల్‌పై భారతదేశ యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్‌కు
english title:
gang rape
Date:
Sunday, March 17, 2013