న్యూఢిల్లీ, మార్చి 16: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలికి చికిత్స అందించిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోని వైద్యుడి వాంగ్మూలాన్ని శనివారం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో రికార్డు చేశారు. ప్రాసిక్యూషన్ సాక్షిగా డాక్టర్ రాజ్‌కుమార్ చిజారా వాంగ్మూలాన్ని ఇక్కడి అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జ్ యోగేష్ ఖన్నా సమక్షంలో రికార్డు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి గాయాల గురించి డాక్టర్ రాజ్‌కుమార్‌ను ప్రశ్నించారు. కాగా, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి చెందిన మరో ముగ్గురు వైద్యుల వాంగ్మూలాన్ని సేకరించేందుకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో బాధితురాలికి చికిత్స అందించిన వైద్య బృందానికి నాయకత్వం వహించిన వైద్యుడూ ఉన్నారు. ఇదిలావుంటే ఈ కేసులో నలుగురు నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది వచ్చేవారం రాజ్‌కుమార్‌ను ప్రశ్నించనున్నారు. డిసెంబర్ 16న సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్సను అందించగా, తీవ్ర గాయాల పాలైన ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సింగపూర్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరి వరకు మృత్యువుతో కొట్టుమిట్టాడిన బాధితురాలు డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఆస్పత్రిలోనే తుదిశ్వాసను విడిచింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో
english title:
delhi gang rape
Date:
Sunday, March 17, 2013