మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్), మార్చి 16: ముగ్గురు ఆకతాయిలు తనను లైంగికంగా వేధించిన ఘటన వార్తా పత్రికలో రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన 17 ఏళ్ల అమ్మాయి శనివారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గత సోమవారం ముగ్గురు యువకులు లైంగికంగా వేధించారని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్‌కుమార్ తెలిపారు. ఈ విషయం బుధవారం మృతురాలి ఫోటోతో సహా ఓ హిందీ దినపత్రికలో వార్తగా రావడంతో దాన్ని చూసి మనస్థాపానికి గురై ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను తొలుత ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. కాగా, ఈ కేసుకు సంబంధించిన మృతురాలిని వేధించిన ఆ ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు ఆకతాయిలు తనను లైంగికంగా వేధించిన ఘటన
english title:
news
Date:
Sunday, March 17, 2013