లండన్, మార్చి 16: మీడియా దిగ్గజం రాబర్ట్ ముర్ధోక్‌కు చెందిన బ్రిటన్‌కు చెందిన ప్రస్తుతం మూతపడిన టాబ్లాయిడ్ ‘న్యూస్ ఆఫ్ ది వరల్డ్’పై తాజాగా వచ్చిన 600కు పైగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్కాట్లాండ్ యార్డ్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా ఆరోపణలు గతంలో అనుమానితుడిగా ఉండి ఇప్పుడు అప్రూవర్‌గా మారిన ఓ వ్యక్తి నుంచి నగర పోలీసులు సేకరించిన సమాచారంతో ముడిపడినవని ‘గార్డియన్’ పత్రిక శనివారం ప్రచురించిన వార్తలో తెలియజేసింది. ప్రస్తుతం ప్రాసిక్యూషన్ సాక్షిగా మారిన ఓ వ్యక్తికి సంబంధించిన టెలిఫోన్ రికార్డులనుంచి ఈ తాజా సమాచారాన్ని సేకరించినట్లు పేరు వెల్లడించని వర్గాలు చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ ముర్ధోక్‌కు చెందిన పత్రికనుంచి ఫోన్ హ్యాకింగ్‌ను ఎదుర్కొన్న బాధితులకు సంబంధించిన కేసులో భాగంగా సోమవారం ఒక ఉన్నత న్యాయస్థానంలో జరిగే విచారణ సందర్భంగా మరిన్ని నిజాలు వెలుగులోకి రావచ్చని కూడా ఆ పత్రిక తెలిపింది. 2011లో వెలుగులోకి వచ్చిన ఈ ఫోన్ హ్యాంకింగ్ కుంభకోణంపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే.
మీడియా దిగ్గజం రాబర్ట్ ముర్ధోక్‌కు చెందిన బ్రిటన్‌కు
english title:
hacking
Date:
Sunday, March 17, 2013