కటక్, మార్చి 16: జర్మనీ మహిళపై అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న బిట్టిహోత్రా మహంతి (బిట్టీ) తండ్రి, ఒరిస్సా మాజీ డిజిపి బి.బి.మహంతిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం ప్రశ్నించింది. అంతకుముందు సిట్ బృందం ప్రస్తుత డిజిపి ప్రకాష్ మిశ్రాను కలుసుకుని చర్చలు జరిపింది. కేరళలోని కన్నూర్‌లో అరెస్టయిన రాఘవ్ రాజనే బిట్టీగా ఒడిస్సా పోలీసులు భావిస్తున్న విషయం తెలిసిందే. బి.బి.మహంతిని డిసిపి కార్యాలయానికి పిలిపించుకుని సిట్ బృందం పలు అంశాలపై సమాచారాన్ని రాబట్టింది. ఇలావుండగా, శుక్రవారం భువనేశ్వర్, కటక్‌లలో బిట్టీ చదివిన పలు విద్యాసంస్థల్లో సైతం సిట్ విచారణ చేపట్టింది. వీటన్నింటినీ పరిశీలించిన మీదట రాఘవ రాజన్ పేరు మీద ఉన్న సర్టిఫికెట్లన్నీ ఫోర్జరీవే అనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. బిట్టిహోత్రా మహంతి పేరుమీదున్న సర్ట్ఫికెట్లను రాఘవ రాజన్‌గా మార్చినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ ఫోర్జరీ సర్ట్ఫికెట్లతో కేరళలోని కన్నూర్‌లో ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బిట్టీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2006లో పెరోల్‌పై బయటకు వచ్చిన బిట్టీయే ఈ రాఘవ రాజన్ అనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. కాని తాను బిట్టీని కాదని రాఘవ రాజన్ అని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజీవ్ రాజన్ కుమారుడినని సదరు వ్యక్తి వాదిస్తుండటం గమనార్హం.
జర్మనీ మహిళపై అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తూ
english title:
bitty
Date:
Sunday, March 17, 2013