వంగూరు, మార్చి 17: సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపాలని, ఇందుకు అందరూ కృషి చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపి మంద జగ న్నాథం పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని డిండి చింతలపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బిఆర్ అంబే ద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు, ఎస్సీ ఉద్యోగ సంఘం రాష్టన్రాయకులు జెబి రాజు, టిఆర్‌ఎస్ అచ్చంపేట నియోజకవర్గం ఇంచార్జీ గువ్వల బాలరాజు తదిత రులు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎంపి జగన్నాథ్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ ఎప్పుడు కూడా చదవాలని, ఐక్యంగా ఉండి పోరాటాలు చేసి హక్కులను సాధించాలని చెప్పేవారని అన్నారు. దళితులకు కావలసిన విద్య, ఉద్యోగాలు, భూ పంపిణీ విషయం లో అనేకమార్లు పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7శాతం రిజర్వేషన్లు ఉన్నత స్థాయి ఉద్యోగాలలో కల్పించా లని కోరుతూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధ నకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిపాలన సౌలభ్యంకోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయాలని అంబే ద్కర్ ఆనాడే సూచించారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై అధిషా టనంపై ఒత్తిడి తెస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే పి.రాములు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు రాజకీ యంగా కాకుండా సామాజికంగా చైతన్యం కావాలన్నారు. ఈ ప్రాంతం లోని సమస్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్య క్షులు బాలాజీ, తహశీల్దార్ జయ ప్రకాశ్‌రావు, నాయకులు నారాయణ రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్, రాజేందర్‌రెడ్డి, గణేష్, మురళి, శ్యాం తదితరులు పాల్గొన్నారు.
ఎంపి మంద జగ న్నాథం
english title:
caste system
Date:
Monday, March 18, 2013