మోమిన్‌పేట, మార్చి 18: ముక్కుపచ్చలారని మైనరైన మేనకోడలుపై అత్యాచారం చేసి, తర్వాత హత్య చేసిన సంఘటన మోమిన్‌పేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండల కేంద్రంలోలక్ష్మణ్, సావిత్రమ్మ దంపతులు పదేళ్ల క్రితం కర్ణాటక నుంచి ఉపాధి కోసం వలసవచ్చారు. సునీత, మీన అనే ఇద్దరు కుమార్తలున్నారు. సునీతను సావిత్రమ్మ తమ్ముడు మెదక్ జిల్లా మారేపల్లి గ్రామానికి చెందిన రాజుకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. నాలుగు నెలల క్రితం భార్యభర్తలు మధ్య గొడవలు రావడంతో వేరుగా ఉంటున్నారు. సునీత తన చిన్నమ్మ వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి రాజు తప్పతాగి సావిత్రమ్మ ఇంటికి వచ్చాడు. మెల్లగా మాటల్లో దింపి అక్కకు మద్యం తాగించాడు. దీంతో ఆమె నిద్రలోకి జారుకుంది. వెంటనే మీనపై అత్యాచారం చేసి, తర్వాత గొంతు నులుపి హత్య చేసి రాత్రి రెండు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం సావిత్రమ్మ నిద్రలేచి చూసేసరికే రక్తస్రావం జరగడంతోపాటు మృతి చెంది ఉన్నట్లు కనిపించింది. దీంతో రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వికారాబాద్ డిఎస్పీ పరమల నర్సింహులు యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ముక్కుపచ్చలారని మైనరైన మేనకోడలుపై అత్యాచారం చేసి,
english title:
rape aand murder
Date:
Tuesday, March 19, 2013