పొన్నూరు, మార్చి 18: ‘మా గ్రామంలో సైడు కాల్వలు లేవు.. రోడ్లు వేసే నాథుడే లేడు.. పొలం పనులకు వెళ్లాలంటే కష్టంగా ఉంది.. కరెంట్ కోత వల్ల ఉక్కపోతకు ఇళ్లలో ఉండలేకపోతున్నాం.. పైగా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోంది.. కష్టపడ్డ సొమ్ము కరెంట్ బిల్లులకే సరిపోతోంది... మేమెట్టా బతకా’లంటూ వైకాపా నాయకురాలు షర్మిల ఎదుట ఓ మహిళ ఆవేదన వెలిబుచ్చింది. గుంటూరు జిల్లా మామిళ్లపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం షర్మిల రచ్చబండ కార్యక్రమంలో మహిళలతో మాట్లాడారు. అనేక మంది సమస్యలను ఏకరువు పెట్టారు. ‘పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు.. రెండు రూపాయల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.. రైతులకు రుణాలిచ్చే వారేలేరు.. మరుగుదొడ్లు నిర్మించమన్నా పట్టించుకోరు.. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు, ఎగుమతి చేసుకునేందుకు వసతులే లేవు..’ అంటూ రైతన్న వాపోయాడు. ‘మేమంతా అండగా నిలుస్తాం, జగనన్నను గెలిపిస్తాం, మా వెతలు తీర్చండంటూ’ వేడుకున్నారు. షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి విధానాలను దుయ్యబట్టారు. బాబు హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నేడు కాంగ్రెస్ పాలనలో కూడా రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ ప్రభుత్వానికి ప్రజలపై జాలి లేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ చార్జీలు, వంటగ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయని, కూలీకెళ్లినా ఇల్లు గడవని పరిస్థితి నెలకొందన్నారు. (చిత్రం) మామిళ్లపల్లిలో షర్మిల రచ్చబండ
‘మా గ్రామంలో సైడు కాల్వలు లేవు.. రోడ్లు వేసే నాథుడే లేడు.. పొలం
english title:
sharmila
Date:
Tuesday, March 19, 2013