Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పార్టీలకు ప్రజల డెడ్‌లైన్

$
0
0

చేర్యాల, ఫిబ్రవరి 11: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టిడిపిలు అవలంభిస్తున్న వైఖరిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలే ఆ పార్టీలకు డెడ్‌లైన్లు విధిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరుయాత్రలో భాగంగా చివరి రోజున కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరుయాత్రకు రాజకీయ విశే్లషకులు, మేధావులు, విద్యావంతుల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. రాజకీయాలకతీతంగా ఆశీర్వాదాలు తెలిపినట్లు వివరించారు. తెలంగాణవాదం ప్రజల్లో బలంగా ఉందని, యువత తెలంగాణ కొరకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని ప్రచారాలు చేసినా ఫలితం లేదని, తెలంగాణ రాకపోవడానికి వారే కారణమని ప్రజలు గుర్తించారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక రాష్ట్రం కొరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం, ప్రధాని మన్మోమన్ సింగ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ విషయంలో బిజెపి క్రీయాశీల పాత్ర పోషిస్తుందని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బిజెపి తప్పక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని, 166 మంది ఎంపీల మద్దతు ఉందని అన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపి పూర్తి మెజార్టీ సాధిస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తమ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ టి. రాజేశ్వర్ రావు, జిల్లా అధ్యక్షుడు దొంతి దేవేందర్ రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంకుగారి శశిధర్ రెడ్డి, కెవి ఎల్ ఎన్ రెడ్డి, పోతుగంటి రాందాస్, కోనేటి స్వామి పాల్గొన్నారు.

కొనసాగుతున్న జూడాల ‘సమ్మె’ట!
వైద్యం అందక ఇద్దరి మృతి * ఇబ్బందుల్లో రోగులు * ప్రైవేటు ఆసుపత్రులకు తరలింపు
వరంగల్ బల్దియా, ఫిబ్రవరి 11: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు, హౌస్‌సర్జన్లు ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర సేవలు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూనియర్ డాక్టర్ల, హౌస్‌సర్జన్ల ఉపకార వేతనాలు ప్రతినెల చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేపట్టిన సమ్మె శనివారం కొనసాగింది. వరంగల్ నగరంలోని ఎంజిఎం, ప్రాంతీయ కంటి, హన్మకొండ ప్రసూతి, వరంగల్ ప్రసూతి, చాతి ఆసుపత్రులలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు శుక్రవారం సాయంత్రం ఐదుగంటల నుంచి ఆయా ఆసుపత్రులలో అత్యవసర సేవలు నిలిపివేయడంతో రోగులు అనేక అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఎంజిఎం ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, ఎఎంసి, ఐసియు, ఆర్‌ఐసియులలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయా వార్డులలో తగినంత సిబ్బంది, డాక్టర్లు లేకపోవడంతో రోగులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాజువాలిటీకి వచ్చిన రోగులను నర్సులు, వార్డుబాయ్‌లు హెల్పర్లుగా విధులు నిర్వహించారు. క్యాజువాలిటీలో మొత్తం ఐదుగురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తుడడంతో రోగులకు సరైన వైద్యం అందడంలేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు.
జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఎంజిఎం ఆసుపత్రిలోని రోగులకు సరైన వైద్యం అందకపోవడంతో ఇద్దరు మృతిచెందారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం నర్సంపేట కుమ్మరికుంట్లకు చెందిన తండ పుల్లయ్య గుండెనొప్పి రావడంతో రోగి బంధువులు ఎంజిఎం ఆసుపత్రి క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో క్యాజువాలిటీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు పుల్లయ్యను పరిక్షించే సమయంలోనే మృతిచెందాడు. ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందిస్తే బతికేవాడని, జూడాల సమ్మె ప్రభావం రోగులపై పడుతోందని రోగి బంధువులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా దేవునూరుకు చెందిన సదానందం క్రిమిసంహారక మందుతాగడంతో శుక్రవారం ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు. చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు.
పేదల పెద్దాసుపత్రి ఎంజిఎం ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలు అందకపోవడంతో రోగి బంధువులు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. బుదరావుపేటకు చెందిన నర్సమ్మకు గుండెనొప్పి రావడంతో ఎంజిఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో నర్సమ్మకు తగిన విధంగా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్లు లేకపోవడంతో నర్సమ్మను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో తగినంత డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో రోగుల బంధువులు చేసేదిలేక ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లారు.
రెండు సహజ మరణాలు
ఆసుపత్రిలో వైద్యసేవలు అందక ఇద్దరు మృతిచెందడం పట్ల ఎంజిఎం ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ స్పందిస్తూ అవి రెండు సహజ మరణాలని అన్నారు. ఆసుపత్రిలో వైద్యసేవలు అందక మృతిచెందారని మీడియాలో ప్రచారాలు రావడం శోచనీయమని చెప్పారు. ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలు అందించేందుకు అసోసియేట్ ప్రొఫెసర్లు, సర్వీసు పిజి డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్, టిడిపి మనుగడ అసాధ్యం * బిజెపితోనే తెలంగాణ సాధ్యం * కిషన్‌రెడ్డి
english title: 
P

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>