గోపాలపురం, ఫిబ్రవరి 11: గోపాలపురానికి చెందిన మద్యం వ్యాపారి బి వీరరాఘవ (నెహ్రూ)ను ఎసిబి అధికారులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మద్యం వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న నెహ్రూ గత కొనే్నళ్ళ నుండి ఈప్రాంతంలోనే ఉంటూ మద్యం వ్యాపారం చేస్తున్నారు. అయితే తాళ్ళపూడి మండలం గజ్జరం గ్రామంలోగల పొలాల్లో ఉన్న నెహ్రూను ఎసిబి అధికారులు ఎందుకు తీసుకువెళ్ళారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది. అయితే మద్యం అమ్మకాల జోరు మాత్రం తగ్గలేదు. గత ఏడాది మండలంలో మూడు షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపును 78-85లక్షల వరకు కైవసం చేసుకున్న మద్యం వ్యాపారులు ఈయేడాది ఒక్కొక్క షాపును కోటి 77లక్షలకు వేలంలో కైవసం చేసుకుని తమ సత్తా చాటుకున్నారు. అయితే గతంలో ఉన్న వ్యాపారులే ప్రస్తుతమూ వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయనేది అర్ధమవుతోందని మందుబాబులు చెప్పకనే చెబుతున్నారు. గత కొన్నిరోజుల నుండి ఎంఆర్‌పి ధరలకే మద్యాన్ని విక్రయిస్తుండటంతో మద్యం షాపుల వద్ద ప్రజలు బారులుతీరి ఉంటున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం మద్యం బాక్సులను వివిధ వాహనాలలో యజమానులు గోదాములకు తరలిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున హడావిడిగా మద్యాన్ని ఎందుకు తరలిస్తున్నారనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం మద్యం అమ్మకాలలో టార్గెట్‌లు నిర్ణయించలేదని ఖరాఖండీగా చెబుతున్నారు. గోపాలపురంలో మాత్రం ట్రాక్టర్లు, ఆటోలలో మద్యం బాక్సులు తరలిపోతున్నాయి.
హైకోర్టు
ఆదేశాలతో
చర్చి తొలగింపు
*ఉండి ఎమ్మెల్యే శివ, మాజీ జడ్పీటిసి సభ్యుడు గేదెల జాన్ అరెస్టు*ఏలూరుపాడులో ఉద్రిక్తత
కాళ్ళ, ఫిబ్రవరి 11: మండలంలోని ఏలూరుపాడు గ్రామంలో ఇరిగేషన్ పోరంబోకు స్థలంలో నిర్మించిన చర్చి కట్టడాలను అధికారులు శనివారం తెల్లవారుఝామున తొలగింపుతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెరుకుమిల్లి శివారు ఏలూరుపాడు వంతెన వద్ద ఎండి ఇస్మాయిల్ అనే వ్యక్తి చర్చి నిర్మాణాన్ని చేపట్టాడు. గతంలో ఈ భూమిలీజుకు తీసుకున్న వ్యక్తి నుంచి చర్చి నిర్మాణం సాగించిన ఇస్మాయిల్ భూమి కొనుగోలు చేశాడు. ఇరిగేషన్ పోరంబోకు స్థలంలో చర్చి నిర్మాణం చేపట్టారంటూ ఐ.్భమవరం, కాళ్ళకూరు నీటి సంఘాల వారు హైకోర్టుకు వెళ్ళారు. ఈ విషయమై హైకోర్టు స్పందించి ప్రభుత్వ భూమిని వెంటనే ఖాళీ చేయించాలంటూ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అయితే పలుమార్లు అధికారులు చర్చి నిర్మాణాన్ని తొలగించడానికి ప్రయత్నించారు. నాలుగు నెలల క్రితం ఇదే విషయమై అధికారులు ఆ ప్రాంతానికి రాగా చర్చి నిర్వాహకుడు ఇస్మాయిల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పలువురు మహిళలు అధికారులను అడ్డుకోవడంతో వారంతా వెనుదిరిగారు. తాజాగా అధికారులు అంతా హైకోర్టు ఆదేశాలు అమలుపరిచేందుకు పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. నరసాపురం డివిజన్‌లోని పోలీసు, రెవిన్యూ యంత్రాంగాన్ని భారీగా భీమవరానికి రప్పించి అక్కడి నుండి వ్యూహాన్ని రచించారు. శనివారం తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో చర్చి తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కాళ్ళ జడ్పీటిసి సభ్యుడు గేదెల జాన్ అక్కడకు చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలు చూపించమని అధికారులను కోరారు. అయితే అధికారులు ఎమ్మెల్యే శివ, గేదెల జాన్‌లను అరెస్టు చేసి భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రభుత్వ స్థలంలోని చర్చి కట్టడాలను, ఇతర సామాగ్రిని తొలగించి ఆకివీడులోని ఇరిగేషన్ సబ్‌డివిజన్ కార్యాలయానికి తరలించారు. చర్చి కట్టడాలను తొలగించేందుకు బుల్‌డోజర్లు, ట్రాక్టర్లు భారీగా ఇక్కడకు తీసుకువచ్చారు. చర్చి తొలగించే విషయంలో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటాయని భావించిన అధికార యంత్రాంగం నిర్వాహకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంది. నరసాపురం ఆర్డీఒ వెంకటసుబ్బయ్య, డిఎస్పీ రఘువీరారెడ్డి, రూరల్ సిఐ మధుసూధనరావు, వీరవాసరం ఎస్‌ఐ ప్రకాశరావురెడ్డి, ఉండి ఎస్సై జోసెఫ్‌రాజులతోపాటు తహసీల్దార్లు వసంతరావు (పాలకోడేరు), చవాకుల ప్రసాద్ (్భమవరం), డి రాజు (నరసాపురం), వెంకటరావు (పాలకొల్లు), జాన్‌రాజు (ఉండి), విఆర్వోలు, పోలీసు సిబ్బంది చర్చి తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరిగేషన్ డిఇ సిహెచ్ రామారావు, ఎఇ శివన్నారాయణ తొలగించిన సామాగ్రిని సబ్‌డివిజన్ కార్యాలయానికి తరలించారు. చర్చి తొలగింపు విషయమై ఆర్డీఒ వెంకట సుబ్బయ్య, డిఎస్పీ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాళ్ళ తహసీల్దార్ జాన్‌రాజు మాట్లాడుతూ 433వ నెంబరులో ఇరిగేషన్ స్థలంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
గోపాలపురానికి చెందిన మద్యం వ్యాపారి
english title:
A
Date:
Sunday, February 12, 2012