Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పోలీస్‌స్టేషన్‌కు చేరిన చెరుకు రైతుల బకాయిల సమస్య

$
0
0

నాయుడుపేట, మార్చి 23: నాయుడుపేట అయ్యప్పరెడ్డిపాలెం వద్దగల ఎంపి చక్కెర కర్మాగారంలో గత కొంతకాలంగా చెరుకు రైతులకు, చక్కెర కర్మాగార యాజమాన్యానికి మధ్య నడుస్తున్న వివాదం శనివారం నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఈనెల 20న చెరుకు రైతులు బకాయల విషయమై కంపెనీ యజమాన్యంతో చర్చలు జరిపారు. ఫిబ్రవరి నెలాఖరుకు 20 కోట్లు, మార్చి నెల బకాయిలతో కలిసి సుమారు 30 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటంతో గోదాములో కేవలం 14 కోట్ల విలువగల చక్కెర మాత్రమే ఉండటంతో, ఈచక్కెర బయటకు తరలివెళితే తమ బకాయిలు రావని గ్రహించిన రైతులు ఈనెల 20 చక్కెర గోదాముకు తాళాలు వేశారు. ఈనేపధ్యంలో శనివారం చక్కెర కర్మాగార యాజమాన్యం రైతులతో మాట్లాడి గోదాము తాళాలు ఇప్పించాలని కోరుతూ నాయుడుపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సమాచారం తెలుసుకున్న చెరుకు రైతులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తమ కష్టాలను ఎస్‌ఐకు వివరించారు. ఐదుగురు రైతులు చెన్నైకి వచ్చి ఎంపి కర్మాగార చైర్మన్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పటం పద్దతి కాదని, వందల మంది చెరుకు రైతుల సమస్యను అందరి రైతుల సమక్షంలో చర్చించటమే సమంజసని తాము యాజమాన్యంకు తెలిపినట్టు ఎస్‌ఐకి వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్‌ఐకు చెరుకు రైతులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సాయంత్రం కర్మాగార యాజమాన్యం తరుపున ప్రతినిధులు వచ్చి ఎస్‌ఐతో చర్చలు జరిపారు. దీనికి స్పందించిన వేణుగోపాల్‌రెడ్డి ఈ విషయం రైతుల సమస్యలతో ముడిపడివున్నందున రైతులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కర్మాగార యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. ఈకార్యక్రమంలో రైతు సంఘ నాయకులు డి చంద్రశేఖరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకట్రావు, శశికుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సిబిఐ వేధింపులు జగన్ జనారదరణ ఆపలేవు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 23: సిబిఐ వేధింపులు జగన్ పట్ల జనంలో ఉన్న ఆదరణను నిలువరించలేవంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ నాయకులు కోటంరెడ్డి శ్రీ్ధరరెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బుజబుజనెల్లూరులో కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిబిఐ దురుద్దేశపూర్వకంగా జగన్‌ను వేధిస్తోందంటూ కోటంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ సిబిఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. గతంలో మాయావతి, ఆ తరువాత కరుణానిధి, ఇప్పుడు జగన్ వ్యవహారాల్లో ఇలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే ఎలాంటి కేసులు ఉండకుండా చూస్తున్నారన్నారు. అలా లేకుంటే అవాస్తవాల్ని చిత్రీకరిస్తూ వేధించేందుకు సిబిఐ పావుగా వాడుకుంటున్నారన్నారు. ఏదేమైనా జగన్‌ను మరెంతోకాలం జైలులో బంధించలేరన్నారు. జనాగ్రహంతో జైలుగోడలు బద్దలుకావడం తధ్యమంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పిగిలాం నరేష్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వర్లు, వసంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గోపాలకృష్ణుడి బొమ్మ అవిష్కరణ
బిట్రగుంట, మార్చి 23: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో శనివారం శాస్త్రోక్తంగా యాజ్ఞీకులు వంశీకృష్ణమాచార్యులు,ప్రధానార్చకులు వేదగిరి సత్యనారాయణచార్యులు అధ్వర్యంలోప్రత్యేక పూజలు చేయగా రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షుడు దేవరాల సుబ్రహ్మణ్యం గోపాలకృష్ణుడి బొమ్మను అవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఆలయం ఆవరణలో మంచి వాతావరణం ఏర్పాటు చేసేందుకు నారద మహర్షి మండపం వద్ద పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగం కావలి శాసన సభ్యులు బీద మస్తానరావు 48వేల రూపాయాలతో పాలరాతి బొమ్మను ఇచ్చినట్లు తెలిపారు. ఆయన తోపాటు స్థానిక నాయకులు టిడిపి పార్టీ జిల్లాప్రధాన కార్యదర్శి పాశం రవీంద్రబాబు పాల్గొన్నారు.
శేష వాహనంపై భక్తులకు
రంగనాథుని దర్శనం
నెల్లూరు కల్చరల్, మార్చి 23:కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిచెందిన రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రంగనాథస్వామి శేషవాహనంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వేద పండితులు మంత్రోచ్ఛాటనలు, మంగళవాద్యాల మధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ ప్రధాన అర్చకులు జగ్గయ్యస్వామి పర్యవేక్షణలో అర్చకస్వాములు ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో వేద, దివ్య ప్రబంధ గోష్టి, ప్రత్యేక అలంకారాలు, అర్చనలు,తిరుమంజనం జరిగాయి. సాయంత్రం ఏకాంతసేవ, వయ్యారినడ, ఊంజల్‌సేవలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురుకృప కళాక్షేత్రం విద్యార్థినులు ప్రదర్శించిన శాస్ర్తియ, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పాయసం నాగేశ్వరరావు, ఉభయకర్తలు, తదితరులుపాల్గొన్నారు. ఆదివారం ఉదయం 8గంటలకు సూర్యప్రభ, రాత్రి హంసవాహనోత్సవం జరుగుతాయి.
నెల్లూరు ఏజెసిగా పెంచలరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 23: నెల్లూరుజిల్లా అదనపుజాయింట్ కలెక్టర్‌గా చల్లా పెంచలరెడ్డి నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉప చైర్మన్‌గా పనిచేస్తున్నారు. చిత్తూరుజిల్లా పీలేరుకు ప్రత్యేక అధికారిగా అదనపుబాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. మరో రెండురోజుల్లో నెల్లూరు ఏజెసీగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం. 2006 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈయన జడ్పీ సిఇఓగా పనిచేస్తున్నారు. మళ్లీ స్థానిక సంస్థలకల్లా ఏజెసీగా రానున్నారు. ఈయన నెల్లూరుజిల్లా అనంతసాగరం వాసి కావడం మరో విశేషం.
విద్యార్థులకు దృక్పథమే లక్ష్యంగా ఉండాలి
వింజమూరు, మార్చి 23: విద్యార్థులకు దృక్పథమే లక్ష్యంగా ఉండాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం స్థానిక ఎంఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాల వ్యవస్థాపకులు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సంకల్పమే లక్ష్యంగా ఉండాలన్నారు. మనో విలాసాలకు అధిక సమయాన్ని కేటాయించక ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఒక అంశాన్ని లక్ష్యంగా తీసుకోవాలన్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆత్మకూరు, వింజమూరు పరిధిలో ఒక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి సుబ్బారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బూసిరెడ్డి, తహశీల్దార్ కె సాంబశివరావు, స్థానిక నేతలు పి కొండారెడ్డి, మాజీ జడ్పిటిసి జి మాలకొండయాదవ్ పాల్గొన్నారు.

ఆదాయాన్ని బట్టి వసతులు
బిట్రగుంట, మార్చి 23:రైల్లో ప్రయాణించే ప్రయాణికుల రద్దీని, ఆదాయన్ని బట్టి స్టేషన్‌లో వసతులు కల్పిస్తామని విజయవాడ డివిజనల్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ మూర్తి అన్నారు. శనివారం కొండ బిట్రగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకొన్నారు. ఈసందర్భంగా విలేఖర్ల తో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర పాలెం స్టేషన్లు ఫుట్ ఓవర్ బిడ్జ్రి ఏర్పాటు చేయాలని కోరగా ఇ క్లాస్ స్టేషన్ వల్ల బ్రిడ్జి నిర్మాణం కుదరదన్నారు. అయితే ప్రయాణికుల వెళ్లేందుకు పాత్ వే ఏర్పాటు చేస్తామన్నారు. బుకింగ్ కార్యాలయం పడమర వైపు మార్చిందుకు దాతల స్థలం ఇచ్చేందుకు వచ్చారని కాని మార్పు చేయాలంటే ప్యానల్ మార్చాలని వాటికి రెండు కొట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గూడురు-టంగుటూరు వరకు రోడ్డు ఓవర్ బిడ్జ్రిలు ఐదు మంజురైనట్లు గూడురు, మనుబోలు, బిట్రగుంట, టంగుటూరులో రెండు 2 మంజురైయ్యయినట్లు వివరించారు. స్టేషన్ల ఆదాయం బట్టి వసతులు ఉంటాయన్నారు. నెల్లూరు ఫ్లాట్ ఫారం ఎక్స్‌లేటరు సౌకర్యం ఏర్పాటకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు దక్షణం ఫుట్ ఓవర్ బిడ్రి ప్రతిపాదనలో ఉందన్నారు. ఆయన తోపాటు ఐఓ డబ్ల్యు సత్యనారాయణ ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు
26న ఓటర్ల జాబితా సిద్ధం
ఇందుకూరు పేట, మార్చి 23: పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఫోటో ఓటర్ల జాబితా తయారు చేసి 26న ప్రచురిస్తామని జిల్లాకలెక్టర్ శ్రీధర్ చెప్పారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై సంబంధిత అధికారులతోజరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1తేదీ అర్హత తేదీగా నిర్ణయించి తయారు చేసిన అసెంబ్లీ ఫోటో ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఫోటో ఓటర్ల జాబితా తయారు చేస్తామన్నారు. 26న పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ భవానాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో బిసిల ఓటర్ల నమోదుకు ఫారం నెంబర్ 2, ఎవరైనా తన ఓటును బిసిగా గుర్తించుటపై అభ్యంతరం తెలిపేందుకు ఫారం 4 సంబంధిత పంచాయతీకార్యదర్శికి ఈనెల 28లోగా దాఖలు చేయాల్సిఉంటుందన్నారు. అభ్యంతరాలపై 30న విచారణ చేపడతామన్నారు. సవరించిన బిసి ఓటర్ల జాబితాను గ్రామసభ ఏర్పాటుచేసి మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వరకు అభ్యంతరాలు పరిష్కరిస్తామన్నారు. బిసి ఓటర్ల తుదిజాబితా ఏప్రిల్ 4న ప్రకటిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా ఏప్రిల్ 2న ప్రకటించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏప్రిల్ 2,3 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి విచారణ చేపట్టి 8న తుదిజాబితా జిల్లా ఎన్నికల అధికారి ఆమోదంతో ప్రకటిస్తామని కలెక్టర్ చెప్పారు. ఓటర్ల జాబితాలో ఎస్సీ,ఎస్టీ, బిసిలుగా నమోదై ఉండి ఎన్నికల్లో పోటీచేయాలనుకునేవారు తప్పనిసరిగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సంబంధిత రెవెన్యూ అధికారి నుంచి దాఖలు చేయాల్సిఉంటుందన్నారు.
జిల్లాలో 957 పంచాయతీలకు 8,968 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అందుకు అవసరమైన పనులు సిద్ధం చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమో దు చేసుకునేందుకు ఫారం -6 ద్వారా వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని సంబంధిత బిఎల్‌ఓకు కాని, తహశీల్దార్‌కు గాని ఆర్డీఓకు కాని అందజేయాలన్నారు. జడ్పీటిసి ఎంపిటిసి ఎన్నికలకు కూడా అదే పంచాయతీ ఫోటో ఓటర్ల జాబితాననుసరించి పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని అందుకు నిబంధనల మేరకు అవసరమైన చర్యలు చేపడతున్నామన్నారు. జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్ల జాబితా, ఏప్రిల్ 6లోగా తయారు చేస్తామన్నారు. పోలింగ్‌కేంద్రాల ప్రచురణ 8న జరుగుతుందన్నారు. కేంద్రాలపై అభ్యంతరాలను 9,10 తేదీల్లో స్వీకరిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో 12న సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. తుది జాబితా ఏప్రిల్ 17న వెలువరిస్తామన్నారు. ఈ ప్రక్రియ అంతా ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించేలోగా సిద్ధం చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రామిరెడ్డి, జడ్పీ సిఇఓ వీరభద్రయ్య, నెల్లూరు ఆర్డీఓ మాధవీలత, గూడూరు సబ్‌కలెక్టర్ జె నివాస్, బిజెపి పార్టీ ప్రతినిధులు సురేంద్రరెడ్డి, కాళేశ్వరరావు, సిపిఐ పార్టీ ప్రతినిధులు పమజుల దశరథరామయ్య, కె ఆంజనేయులు, టిడిపి కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి బర్నాబాస్ తదితరులు పాల్గొన్నారు.

విఎస్‌యూ పిజిసెట్‌కు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 23: విక్రమ సింహపురి పిజి కోర్సులకు అర్హతా ప్రవేశ పరీక్షకు విశ్వవిద్యాలయ ఉప కులపతి రాజా రామిరెడ్డి నోటిఫికేషన్ శనివారం విడుదల చేశారు. శనివారం సాయంత్రం ఈ అంశంపై విలేఖర్ల సమావేశంలో విసి రామిరెడ్డి పలు వివరాలను వెల్లడించారు. విక్రమవర్శిటీలో తొలి పర్యాయం పిజి సెట్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు శ్రీ కృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల తరఫునే పిజి అర్హతా ప్రవేశ పరీక్షలకు తమ విద్యార్థులు హాజరవుతూ వచ్చారన్నారు. ఇకపై ఆ అవకాశం తామే కల్పిస్తున్నట్లు వివరించారు. కాగా, మిగతా యూనివర్శిటీల్లో వలే కాకుండా ప్రవేశపరీక్ష రుసుము ఒక్కో అభ్యర్థి నుంచి 275 రూపాయలు మాత్రమే వసూలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇతర యూనివర్శిటీల విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నామన్నారు. విక్రమవర్శిటీ పిజి సెట్ నిర్వహణకు సంబంధించి ప్రొఫెసర్ జనార్దన్‌ను కన్వీనర్‌గా నియమించినట్లు వివరించారు. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులు విక్రయించనున్నట్లు వివరించారు. నెల్లూరు నగరంలోని ప్రధాన పోస్టాపీస్‌తోపాటు ఆంధ్రాబ్యాంక్ నెల్లూరు, కావలి, గూడూరు, తిరుపతి, ఒంగోలు, అనంతపురం, కర్నూలు బ్రాంచిల పరిధిలో దరఖాస్తులు లభించేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు అందేలా చూస్తామన్నారు. ప్రవేశ పరీక్ష ఐదు కేంద్రాల్లో ఉంటుందన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురంల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఏ కోర్సులోనైనా పాతిక మందికంటే తక్కువగా అభ్యర్థులుంటే అక్కడ ప్రవేశ పరీక్ష నిర్వహించబోమన్నారు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారు నెల్లూరులోనే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అలాగే పిజి కోర్సుల్లో చేరాక కూడా తమ వర్శిటీ ఫీజులు తక్కువగానే ఉండేలా చూస్తామన్నారు. పిజి కోర్సులకు సంబంధించి ఇరవై వేల రూపాయల వరకు గరిష్టంగా ఫీజు రియింబర్స్‌మెంట్ అవకాశం ఉంటుందన్నారు. ఎలాంటి (బయో కెమిస్ట్రీవంటి) కోర్సులో చేరినా అంతకు మించి ఐదారువేలు కూడా విద్యార్థులకు ఖర్చు కాకుండా చూస్తామని అభిప్రాయపడ్డారు. ఎంకామ్, ఎంఏ వంటి సాధారణ కోర్సులకు ఏడువేల రూపాయల లోగానే ఫీజు ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను వచ్చే నెల 27వ తేదీలోగా అందజేయాలన్నారు. ఐదువందల రూపాయల అదనపుఫీజుతో మే 3వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. మే నెల 20నుంచి 30వ తేదీలోగా ఈ పరీక్ష చేపట్టే అవకాశాలున్నాయన్నారు. పిజి సెట్ కోసం నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ప్రత్యేకంగా భవనం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇదిలాఉంటే తమ విశ్వవిద్యాలయంలో వివిధ పోస్టులకు సంబంధించి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించినట్లు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా పిజి సెట్ కన్వీనర్ కె జనార్ధనరాజుతో సహా నెల్లూరు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

వేసవిలో తాగు, సాగునీటి సంక్షోభంపై

ముందస్తు చర్యలు చేపట్టాలి
నెల్లూరు కల్చరల్, మార్చి 23: రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నెల్లూరు జిల్లాలో కురియడంతో వర్షాభావానికి తోడు వేసవి తీవ్రత పెరిగినందున జిల్లాలో ఇప్పటికే తాగునీటి సమస్య ప్రారంభమైనందున తాగు, సాగునీటి సంక్షోభంపై ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ బిజెపి తీర్మానం చేసింది. ఆదివారం స్థానిక బిజెపి కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు, పదాధికారులు సమావేశమై అత్యవసర తీర్మానం చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నీటిపారుదల, విద్యుత్ పరిస్థితులపై పార్టీ సీనియర్ నాయకుడు మిడతల రమేష్ తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సోమశిల, కండలేరు, జలాశయాల్లో నీరు అడుగంటినందున నెల్లూరు జిల్లాలో రెండోపంట వేయలేని పరిస్థితులున్నాయన్నారు. జిల్లాలో రైతులు పంటల విరామం చేయకతప్పని పరిస్థితులున్నాయని పంటల సాగుపట్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదని ఉదయగిరి, సీతారామపురం, కొండాపురం, మర్రిపాడు, వరికుంటపాడు, వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో తాగునీటి సమస్యలున్నాయన్నారు. జిల్లాలో 16858 తాగునీటి బోర్లు, 2901 పిడబ్ల్యుడి పథకాలు, 30 సమగ్ర మంచినీటి పథకాలుండగా వాటి మరమ్మతులు, నిర్వహణకు 5కోట్ల రూపాయల నిధులు అవసరమన్నారు. అయితే మండలానికి లక్ష రూపాయలు కేటాయించడం దారుణమన్నారు. జిల్లాలోని 120వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కనీసం 2,3 గంటల విద్యుత్ కూడా ఇవ్వకపోవడంతో మొదటి పంటలు నీరందక ఎండిపోతున్నాయన్నారు. విద్యుత్ కోతల మూలంగా వ్యవసాయ, ఆక్వా, చేనత, పారిశ్రామిక రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, ఇంధన సర్దుబాటు చార్జీలు విధించి ప్రజలపై భారం మోపడం తగదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ముఖ్యమంత్రి ఖరీఫ్‌లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా విద్యుత్ కొనుగోలుచేసి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించడం ద్వారా రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు. సోమశిల, కండలేరు, జలాశయాల్లో నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో ఎస్ సురేష్‌రెడ్డి, కాకు విజయలక్ష్మి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2

బ్రహోత్సవాల పనులను పరిశీలించిన ఆర్డీఓ
బిట్రగుంట, మార్చి 23: బోగోలు మండల కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కాగా శనివారం కావలి ఆర్డీవో సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి పరీశీలించారు. అలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ముఖ్యంగా స్వామి వారి ప్రసాదాలను నాణ్యత విషయలపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి అసౌకరాలు కలగకుండా ఏర్పాట్లు అధికారుల కృషి చేస్తున్నారని విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లు, స్వచ్ఛంద సంస్ధలు తాగునీరు సరాఫరా చేస్తున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, భద్రత అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఎవరైనా మాంసం, మద్యం అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీసుకొంటామని తెలిపారు.

ప్రజల సమస్యలపై పరిష్కరం కోసం కృషి చేయాలి
బిట్రగుంట, మార్చి 23: మండలంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ చార్జీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. కడనూతల గ్రామంలో గ్రీన్ పార్కులో శనివారం మండల నేతలతో సమావేశమైయ్యరు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కారానికి ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. పార్టీ గురించి వివరించాలని పార్టీ బలోపేతం చేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తూపిరి పెంచలయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చిలకపాటి వెంకటేశ్వర్లు, మద్దిబోయిన వీర రఘు, తుమ్మల రమణయ్య, సుంకే మాల్యాద్రి, పర్రి అంకులయ్య, తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరుపాళెంలో రెవెన్యూ సదస్సు
ఆత్మకూరు, మార్చి 23: ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా రెవెన్యూ అధికారులు స్థానికుల నుంచి వచ్చిన వివిధ వినతిపత్రాలను స్వీకరించారు. వీలైన సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఈ సదస్సులో భాగంగా మొబైల్ సేవ కేంద్రం నిర్వహించారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా సదస్సులో పాల్గొని గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలపై కూలంకుశంగా చర్చించారు.
ఘనంగా వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ వేడుక
ఆత్మకూరు, మార్చి 23: ఆత్మకూరు పట్టణంలోని కొలగాని సత్రంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. శనివారం వేకువజామునుంచే ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని ప్రారంభించారు. తొలుత సుప్రభాతం, అనంతరం అష్టోత్తర శత కలశస్థాపన, విష్వక్సేన ఆరాధన, అగ్నిప్రతిష్ఠ, విశేష హోమాలు, శ్రీ వారి కల్యాణం పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్ధప్రసాదాల అందించారు. సాయంత్రం ఆత్మకూరు పట్టణంలో గ్రామోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులు వైభవోపేతంగా ఊరేగారు. వివిధ కూడళ్లలో ముందుగానే ఏర్పాటు చేసిన పందిళ్లలో భక్తులు శ్రీవారికి పూజలర్పించుకున్నారు. మాజీ ఎంఎల్‌సి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఈ ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహరిస్తుండటం విదితమే.

ఘనంగా అమరవీరుల దినోత్సవం
అనుమసముద్రంపేట, మార్చి 23: ఏఎస్‌పేటలోని హిందు ప్రాధమిక పాఠశాలలో శనివారం అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం మహమ్మద్ సాదిక్ హుస్సేన్ ఆధ్వర్యంలో విప్లవజ్యోతి భగత్‌సింగ్, ఆయన సహచరులు సుఖదేవ్, రాజగురుల 82వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భూమి పట్టాలు పంపిణీ
వింజమూరు, మార్చి 23: మండలంలోని బుక్కాపురం, చంద్రపడియ, నల్లగొండ్ల, గుండెమడకల గ్రామాలకు చెందిన ఆరవ విడత భూపంపిణీ లబ్ధిదారులకు పట్టాలు అందచేస్తామని తహశీల్దార్ కె సాంబశివరావు తెలిపారు. ఆదివారం కావలి ఎబిఎం కళాశాల ఆవరణలో మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన 164మంది లబ్ధిదారులకు 243 ఎకరాల భూమిని పంపిణీ చేస్తారన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా ఈ పట్టాలు పంపిణీచేస్తామన్నారు. కావున మండలంలోని ఎంపికైన లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరై పట్టాలు పొందవల్సిందిగా ఆయన కోరారు.

సిజెఎస్‌ఎఫ్ భూములకు హద్దులు చూపండి
వింజమూరు, మార్చి 23: మండలంలోని నందిగుంట పంచాయతీ పరిధిలోని ఎస్సీలకు కేటాయించిన సిజెఎస్‌ఎఫ్ భూములకు హద్దులు చూపాలని పలువురు తహశీల్దార్‌ను కోరారు. శనివారం స్థానికంగా జరిగిన రెవెన్యూ సదస్సుకు గ్రామస్థులు పలు సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు. ఇందిరా జలప్రభకు ఎంపికైన భూములకు హద్దులు చూపాలని కోరారు. భూమిలేని నిరుపేదలకు కంచి పోరంబోకును అందచేయాలన్నారు. అందుకు తహశీల్దార్ ఆభూమిని ఇచ్చే అవకాశం లేదన్నారు. గ్రామంలోని పొలాల రహదారులకు సర్వే చేయించి బాటలను ఏర్పరచాలన్నారు. ఈ సదస్సులో వచ్చిన 60 అర్జీలను ఆయన పరిశీలించి కొన్ని భూసమస్యలను అక్కడికక్కడే మోబైల్ మీసేవ ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాసరావు, విఆర్‌వో శేషయ్య, సర్వేయర్ వెంకటేశ్వరరావు, సిబ్బంది హాజరయ్యారు.
డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌కు నివాళులు
ఆత్మకూరు, మార్చి 23: ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి మాజీ వార్డుమెంబర్ ఎండి సాలారుద్దీన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షులు ఎం నాగేంద్ర మాట్లాడుతూ భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం భగత్‌సింగ్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ డివిజన్ ఉపాధ్యక్షులు ఆర్ వెంకట రమణయ్య, కార్యదర్శి పి జిలానీ, ఆవాజ్ నాయకులు యస్‌దాని, సిహెచ్ శ్రీనాధ్, పి గణేష్, టి చిన్న, బ్రహ్మయ్య, పెంచలయ్య, వెంకి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

భూముల కోసం అర్జీల వెల్లువ
అనుమసముద్రంపేట, మార్చి 23: ఏఎస్‌పేట మండలం గుడిపాడు గ్రామంలో శనివారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో భూముల కోసం అత్యధికంగా అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సులో మొత్తం 113 అర్జీలు వచ్చినట్లు తహశీల్దార్ కె నాసరయ్య తెలిపారు. అందులో 4 పాస్‌పుస్తకాలకు, మిగిలినవి భూముల కోసం వచ్చినట్లు తెలిపారు. ఈసందర్భంగా గతంలో పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తహశీల్దార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ మేరకు గ్రామంలో ఎస్సీలకు చెందిన శ్మశానానికి దారి కల్పించాలని కోరడంతో వెంటనే స్పందించిన తహశీల్దార్ సర్వే నెంబర్ 34లో ఒక ఎకరా భూమికి దారిని చూపించారు. కౌలు రైతుల ఎంపికను సక్రమంగా అర్హులైన వారికి ఇవ్వాలని గ్రామ నాయకుడు పి హజరత్తయ్య కోరారు. గతంలో ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చారని నేటికి ఆ భూములకు హద్దులు చూపలేదని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌కుమార్, సర్వేయర్ షేక్ రసూల్, విఆర్‌వో వసంతరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

భూములను ఆక్రమించారని ఫిర్యాదు
అనుమసముద్రంపేట, మార్చి 23: తమకు ప్రభుత్వం అందచేసిన భూముల్లో అక్రమంగా గ్రామానికి చెందిన మాజీ విఆర్‌వో కె అయ్యల్‌రెడ్డి ఆక్రమించి తన పొలాలకు రోడ్డు వేసుకున్నారని అదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు తహశీల్దార్ కె నాసరయ్యకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 595లో ప్రభుత్వం తమకు భూములు అందచేశారని అయితే అక్రమంగా రోడ్డు వేయడం దారుణమన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఎన్‌ఎఫ్‌బిఎస్ చెక్కులు పంపిణీ
అనుమసముద్రంపేట, మార్చి 23: ఏఎస్‌పేట మండలం గుడిపాడు గ్రామంలో శనివారం ఎన్‌ఎఫ్‌బిఎస్ చెక్కులను తహశీల్దార్ కె నాసరయ్య పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన పి లక్ష్మమ్మ, షేక్ జయనాబిలకు ఒక్కొక్కరికి 5వేల రూపాయలు చొప్పున చెక్కులు అందచేశారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌కుమార్, విఆర్‌వో వసంతరావు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నేతృత్వంలో చేపట్టిన ఈ శిబిరంలో భాగంగా మొత్తం 153 మంది రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ సిబ్బంది గోపాలరెడ్డి, బొట్టా భాస్కరరావుఅనిల్ అభిమానుల నుంచి రక్తం సేకరించే కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు సతీష్, సుధీర్ నేతృత్వం వహించారు. రక్తదాన శిబిరంలో ఇంకా నాగార్జునరెడ్డి, దిలీప్‌కుమార్‌రెడ్డి, అబ్ధుల్, గంగాధర్, రుషి, చంటి, కార్తీక్, శ్రీహరి, చరణ్, రామప్రసాద్, హరిప్రసాద్, అద్దంకి జగన్, శ్రావణ్‌కుమార్, పవన్, ప్రసన్నకుమార్, వినోద్, విష్ణు, అఖిల్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

====
ఆరులైన్ల రోడ్డు పనులు తనిఖీ
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, మార్చి 23: అయ్యప్పగుడి నుంచి కొండాయపాలెం గేటు వరకు నిర్మించ తలపెట్టిన ఆరులైన్ల రోడ్డు నిర్మాణం నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ గుత్తేదారును హెచ్చరించారు. రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ శనివారం తనిఖీ చేసి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రోడ్డు అభివృద్ధి చేసేందుకు నిర్దేశించిన పనులు సక్రమంగా నాణ్యతతో సకాలంలో పూర్తిచేయాలన్నారు., ఆక్రమణల తొలగింపులో ఆర్‌అండ్ బి అధికారులు, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్డు నిర్మాణ దశలో కాలులువలు పూడికతో నిండిపోకుండా మురుగునీటి ప్రవాహానికి అడ్డులేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యాపార ప్రకటనల బోర్డులను రోడ్డుపరిధిలో లేకుండా చూడాలన్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అవాంతరం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ఆర్ అండ్ బి ఎఇ నాగమల్లు, డిఇ దామోదర్‌రెడ్డి, కార్పొరేషన్ డిఇ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్వీఎం పనులు వేగవంతం చేయాలి
-కలెక్టర్

ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, మార్చి 23: రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) కార్యక్రమం కింద నిర్దేశించిన పనులు వేగవంతం చేసి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ బి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో రాజీవ్ విద్యామిషన్ కింద చేపడుతున్న అదనపు గదుల నిర్మాణాలు ,పాఠశాలలు, మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, కరెంటు మోటార్లు తదితర పనులకు సంబంధించి ప్రగతిపై అధికారులతో సమీక్షించి పలు ఆదేశాలిచ్చారు. ప్రధానంగా జిల్లాలో కొండాపురం, దుత్తలూరు, కలిగిరి, సీతారాంపురం, మర్రిపాడు, ఎఎస్‌పేట తడగ తదితర ప్రాంతాల్లో మంజూరైన 6,7,8 తరగతులకు సంబంధించిన పాఠశాల నిర్మాణ పనులు మేలోగా పూర్తిచేయాలన్నారు. అవసరమైన ప్రహారీగోడ నిర్మాణాలు ఎఏంపి లాండ్స్ కింద నిధులు వెచ్చించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అదనపు గదులు నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రక్రియలో పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పనుల ప్రగతి, పురోగతిలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మండల ఇంజనీరింగ్ అధికారులపై తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. అదనపు గదుల నిర్మాణానికి స్థలం సమకూర్చడానికి సంబంధిత తహశీల్దార్లు ప్రత్యేక చర్య తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ బి రామిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎం రామలింగం, సిపిఓ కెబికె మూర్తి, రాజీవ్ విద్యామిషన్ పిఓ కోదండరామిరెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ ఇ హుస్సేన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రకృతి చికిత్సపై ఉచిత వైద్య శిబిరం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 23: శృతీస్ ప్రకృతి చికిత్సా కేంద్రం ఆధ్వర్యంలో 24వ న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ నేచురోపతి, ఆకుపంక్చర్, ఫిజియో థెరపీ వంటివి ఈ శిబిరంలో భాగంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. ప్రకృతి చికిత్సవల్ల దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, తలనొప్పి, మైగ్రైన్, సెనుసైటీస్, థైరాయిడ్, ఎసిడిటి, ఉబ్బసం, వెన్నుపూస సమస్యలు నివారించుకోవచ్చన్నారు. విలేఖర్ల సమావేశంలో ఈ సంస్థ సంచాలకులు ఇ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ కెబిఎన్‌రెడ్డి, హరిణి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి
కోవూరు, మార్చి 23: మండలంలోని పాటూరు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తహశీల్దార్ సాయిబాబా తెలిపారు. శనివారం రెవెన్యూ సదస్సు పాటూరు గ్రామంలో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు అందజేసిన భూములను తిరిగి అమ్మటం కాని, కొనటం కాని చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పాటూరు గ్రామంలో కొందరు స్మశాన స్థలాన్ని ఆక్రమించుకొని, ఆస్థలంలో సాగు చేసుకుంటుండంతో ఆ స్థలాన్ని తహశీల్దార్ పరిశీలించారు. పంట పూర్తికాగానే సర్వే చేయించి హద్దురాళ్లు నాటాలని మండల సర్వేయర్‌ను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో 202 అర్జీలు వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో డిటి రామ్మోహన్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హనూక్‌బాబు, మండల సర్వేయర్, ఐకెపి

నాయుడుపేట అయ్యప్పరెడ్డిపాలెం వద్దగల ఎంపి చక్కెర కర్మాగారంలో గత కొంతకాలంగా చెరుకు రైతులకు,
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles