మన భారతదేశం కళలకు కాణాచి. ఎంతోమంది కవులు గాయకులు, నటులు, యుగపురుషులు ఎంతోమందికి జన్మనిచ్చిన పుణ్య భారతదేశం మనది. అటువంటి మన దేశంలో ప్రాచీన కళలైన జానపద కళారూపాలు గ్రామీణ ప్రాంతాల్లోని చెక్క భజన, కోలాటం, డప్పుల విన్యాసం. కర్ర సాము; కోయ నృత్యం; అటవీ కొలుపు; జాలరి నృత్యం; పురాణ వేషాలు; పులివేషం; పగటి వేషాలు; పిట్టలదొర; సోమిదేవమ్మ; శ్రోత్రియ బ్రాహ్మణుడు; భేతాళ మాంత్రికుడు; హరికథ; బుఱ్ఱకథ; గొల్లసుద్దులు; యక్షగానం; భరతనాట్యం; వీధి బాగవతాలు; పద్యనాటకాలు; గద్య నాటకాలు; సాంఘీక నాటిక; నాటకములు; ఏకపాత్రలు; లలిత సంగీతం; గాత్ర/ వాయిద్య కచేరీలు; సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కళారూపాలున్నాయి. వీటిల్లో ఆరితేరిన కళాకారులున్నారు.
1860 ప్రాంతంలో తెలుగు నాటక రచన కోరాడ రామచంద్రశాస్ర్తీ రచించిన ‘‘మంజరీ మధురీయకం’’ అనే నాటకంతో ఆరంభమయింది. అంటే తెలుగు నాటక రచన ప్రారంభమై 153 సంవత్సరాలు అయినది. క్రీస్తుశకం 1880 ప్రాంతంలో తెలుగు నాటక ప్రదర్శన మొదలైంది. ఆ రకంగా తెలుగు నాటక ప్రదర్శనలకు కూడ 133 సంవత్సరాలు నిండినవి. 1930వ సంవత్సరం నుండి సాంఘీక నాటకోద్యమం విజృంభించింది. 1950-60 సంవత్సరాల మధ్యకాలంలో తెలుగునాటక రంగ స్థలం దేదీప్యమానంగా వెలిగింది. ముఖ్యంగా మనకు దగ్గర్లోవున్న కూచిపూడి భరతనాట్యం, యక్షగానం దేశవిదేశాలలో కూడ పేరుప్రఖ్యాతులు గడించినది. ముఖ్యంగా వెంపటి చినసత్యం; నటరాజ రామకృష్ణ; వేదాంతం సత్యన్నారాయణశర్మ మరియు ఎంతోమంది నిష్ణాతులైన కళాకారులు ఈ కళల్లో పేరుపొంది కూచిపూడి కళకే వనె్నతెచ్చారు. అలాగే పౌరాణిక నాటకాలలో కె.రఘురామయ్య (ఈల పాట) అబ్బూరి వరప్రసాద్, బండారు రామారావు, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, శివశ్రీ, ఎ.వి.సుబ్బారావు, షణ్ముఖి ఆంజనేయరాజు, డి.వి.సుబ్బారావు, చీమకుర్తి, దైతా గోపాలం, సురవరపు వెంకటేశ్వర్లు, జైరాజ్, గుమ్మడి గోపాలకృష్ణ, అద్దంకి శ్రీరామమూర్తి, కుప్పా సూరి మొదలైనవారు ఎంతోమంది తన గానమాధుర్యంతో నటనా భంగిమలతో పేరుప్రఖ్యాతులు గడించారు. అలాగే బుర్రా సుబ్రహ్మణ్యశాస్ర్తీ, రేబాల రమణ, విజయరామరాజు మొదలైనవారు. ఇక నటీమణులలో టి.కనకం, గూడూరు సావిత్రి, కోడూరు కమలాదేవి, నాగలక్ష్మి, అమ్ములపద్మ, కోటేశ్వరి ఇంకా ఎంతోమంది పేరు గడించారు. సాంఘీక నాటిక నాటక విభాగాలలో డా.గరికపాటి రాజారావు, సూరపనేని లక్ష్మీపేరుమాళ్లు, రాఘవాపురపు అప్పారావు, శిల్పిశెట్టి సుబ్బారావు, వల్లం నరసింహారావు, వల్లం ఇందిర, జమున, కోడూరి అచ్చయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య మొదలైనవారు ఇంకా ఎంతోమంది పేరు గడించారు. సినీ రంగంలో నందమూరి తారకరామారావు గొప్ప నటుడిగా, రాజకీయవేత్తగా పేరుగడించారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, గుమ్మడి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి, మిక్కిలినేని, శరత్‌బాబు, మహేష్‌బాబు, చిత్తూరు వి.నాగయ్య, రాజనాల, ఆర్.నాగేశ్వరరావు నటీమణులలో సావిత్రి, జమున, కన్నాంబ, సూర్యకాంతం, చంద్రకళ, కృష్ణకుమారి, గిరిజ, రమాప్రభ, జయసుధ, శారద, హాస్య నటులలో రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, రాజబాబు, సుత్తివేలు, పద్మనాభం, చలం, బ్రహ్మానందం, మాడా, వేణుమాధవ్, ఏ.వి.యస్, యమ్మెస్ మొదలైనవారు. ఇలా వ్రాసుకుంటూ పోతే ప్రతి రంగంలో అనేకమంది కళాకారులున్నారు. సినీ, టీ.వీ ప్రభావంవల్ల నాటక కళ అంతరించిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాటక కళ అంతరించిపోతోంది. ఈ కళ అభివృద్ధికి యువకులు, కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు ముందుకు రావాలి. ప్రభుత్వం ప్రతి మండలంలోను ఆడిటోరియంలను నిర్మించి నాటక రంగాన్ని అభివృద్ధిచేస్తారని ఆశిద్దాం.
నేడు ప్రపంచ కళాకారుల దినోత్సవం
english title:
n
Date:
Thursday, March 28, 2013