Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాశిఫలం 29-03-2013

$
0
0
Date: 
Friday, March 29, 2013 (All day)
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
మేషం: 
ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూ రంగా వుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
వృషభం: 
ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగానుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మిథునం: 
పిల్లల వల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగాచేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
కర్కాటకం: 
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగానుండుట మంచిది. అనారోగ్య బాధలు అధిగమించుటకు ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
సింహం: 
కుటుంబమంతా సంతోషంగా వుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మవిషయాలను గ్రహిస్తారు.
కన్య: 
మానసికాందోళనతో ఉంటారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేకశ్రద్ధ అవసరం. విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది.
తుల: 
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం.
ధనుస్సు: 
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
కుంభం: 
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగానుండుటకు ప్రయత్నించాలి.
మీనం: 
మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్తవహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
దుర్ముహూర్తం: 
ఉ.08.42 నుండి 09.30 వరకు, తిరిగి మ.12.45 వరకు 01.33 వరకు
రాహు కాలం: 
..
వర్జ్యం: 
మ.02.34 నుండి 04.06 వరకు
నక్షత్రం: 
చిత్త ఉ.09.13
తిథి: 
బహుళ విదియ మ.12.39
మకరం: 
కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదావేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>