హైదరాబాద్/ కాకినాడ, మార్చి 30:
రాష్ట్రంలో భూముల విలువకు
రెక్కలొచ్చాయి. ఒకవైపు భూముల
రిజిస్ట్రేషన్లపై సేల్‌డీడ్ రుసుం తగ్గిస్తూ
ఊరట కలిగించిన సర్కారు, మరోవైపు
మార్కెట్ ధరలను గణనీయంగా
పెంచడం గమనార్హం. కీలకమైన రెండు
నిర్ణయాలను ఒకేరోజు తీసుకుంటూ
శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు నిర్ణయాలు రాష్టవ్య్రాప్తంగా ఏప్రిల్
ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. రెండు
రోజులు ముందుగానే దీనిపై ప్రచారం
జరగడంతో శనివారం అనేక ప్రాంతాల్లో
రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు క్రయ
విక్రయదారులతో నిండిపోయాయి.
భూముల మార్కెట్ ధరలను భారీగా
పెంపుతూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ
రూపొందించిన ప్రతిపాదనలను
ఆమోదిస్తూ ప్రభుత్వం శనివారం
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో
రాష్టవ్య్రాప్తంగా దాదాపు 20 నుంచి 30
శాతం వరకూ భూముల మార్కెట్
విలువ పెరగనుంది. అయితే కొన్నిచోట్ల
గరిష్టంగా 140 శాతం వరకు పెరగగా,
చిత్తూరు జిల్లాలో ఒకటి రెండుచోట్ల
250 శాతానికిపైగా మార్కెట్ విలువ
పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో
విడివిడిగా అధ్యయనం చేసిన
అధికారులు స్థానిక పరిస్థితులను బట్టి
మార్కెట్ విలువలు నిర్ణయించారు. ఇదే
సమయంలో హైదరాబాద్ కంటోనె
్మంట్ ఏరియాలోనూ ప్రత్యేకంగా
ధరలను నిర్ణయించింది. 1998లో
మార్కెట్ విలువ సవరణ నిబంధనల
మేరకు పట్టణ, కంటోనె్మంట్
ఏరియాల్లో ప్రతి ఏటా ఆగస్టు 1న,
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకోసారి
ఆగస్టు 1న మార్కెట్ విలువ సవరణ
చేయాల్సి ఉంటుంది. అయితే 2011,
2012లో పట్టణ ప్రాంతాల్లో,
2012లో గ్రామీణ ప్రాంతాల్లో సవరణ
చేపట్టలేదు. దీంతో ఇప్పుడు తాజాగా
విలువ సవరణ నిర్వహించాలని
నిర్ణయించిన అధికారులు అవసరమైన
ప్రతిపాదనలను తయారు చేశారు.
దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
గత జనవరి 5న విస్తృత సమావేశాన్ని
నిర్వహించి మార్కెట్ విలువ పెంపుపై
అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
రిజిస్ట్రేషన్ల సమయంలో సేల్‌డీడ్‌పై కొంత
తగ్గిస్తూ మరో నిర్ణయం కూడా
శనివారమే తీసుకున్నారు. మొత్తం
రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఐదు శాతానికి
తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
నేపథ్యంలో 2010లో కొంత తగ్గించిన
ప్రభుత్వం, తాజాగా మరొక శాతాన్ని
తగ్గించింది. ఇప్పటివరకు స్టాంప్ డ్యూటీ
ఆరు శాతం, బదిలీ రుసుము పట్టణ
ప్రాంతాల్లో రెండు శాతం, గ్రామీణ
ప్రాంతాల్లో మూడు శాతం ఉండగా,
రిజిస్ట్రేషన్ రుసుము రెండు ప్రాంతాల్లో
0.5 శాతంగా ఉంది. దీంతో మొత్తం
రుసుము పట్టణ ప్రాంతాల్లో 7.5
శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.5
శాతంగా ఉండగా, ఇప్పుడు రెండు
ప్రాంతాల్లో స్టాంప్ డ్యూటీని ఆరు శాతం
నుంచి ఐదు శాతానికి తగ్గించింది. దీంతో
తాజాగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం
రుసుము 6.5 శాతానికి, గ్రామీణ
ప్రాంతాల్లో 7.5 శాతానికి తగ్గాయి.
కాగా, స్టాంప్ డ్యూటీని తగ్గించినప్పటికీ
భూముల విలువ భారీగా పెంచడం
ద్వారా ఖజానాకు కాసుల గలగల
పెరుగుతుందని అధికారులు
చెబుతున్నారు. ప్రస్తుతం స్టాంపులు,
రిజిస్ట్రేషన్ల ద్వారా 6800 కోట్లు
ఆదాయం ఉండగా, తాజా పరిస్థితి
నేపథ్యంలో మరో మూడు వేల కోట్లు
అదనపు ఆదాయం ఉంటుందని
భావిస్తున్నారు. స్టాంప్ డ్యూటీ
తగ్గింపువల్ల కొంత ఆదాయం తగ్గినా,
మొత్తం మీద కనీసంగా 2500
కోట్లయినా అదనపు ఆదాయం
లభిస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 1నుంచి కొత్తగా పెంచిన
భూమి, భవనాల మార్కెట్ విలువ
ధరలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట
నరసింహం వెల్లడించారు. దీని ద్వారా
రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 1100
కోట్ల నుంచి 1200 కోట్ల వరకు
ఆదాయం సమకూరనున్నట్టు చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా
తొలిసారిగా ప్రాంతాల వారీ అక్కడ ఉన్న
పరిస్థితుల ఆధారంగా భూములు,
భవనాల మార్కెట్ విలువ
నిర్ణయించినట్టు శనివారం మీడియాతో
మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో 432
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
ఉన్నాయన్నారు. వీటిలో 48 సబ్
రిజిస్ట్రర్ ఆఫీసుల పరిధిలో 20 శాతం
కన్నా తక్కువ చార్జీలు పెంచామన్నారు.
54 కార్యాలయాల పరిధిలో 20 శాతం
నుండి 30 శాతం వరకు రిజిస్ట్రేషన్
ఫీజులు పెంచామని, 130
కార్యాలయాల పరిధిలో 30-50 శాతం
ఛార్జీలు పెరిగాయన్నారు. 148
కార్యాలయాల పరిధిలో 50-100
శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు
పెరిగాయన్నారు. 51 సబ్ రిజిస్ట్రర్
కార్యాలయాల పరిధిలో 100 నుండి
150 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు
పెరిగాయని ఆయన తెలియజేశారు.
ధరలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే
తెలియజేయాల్సిందిగా ప్రజల నుండి
విజ్ఞప్తులు కోరగా రాష్ట్రంలో 301
అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిలో
150 అభ్యంతరాలపై చర్చించి చర్యలు
తీసుకున్నామని మిగిలిన 100
దరఖాస్తులను సక్రమంగా లేకపోవడంతో
తిరస్కరించినట్లు మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో హైదరాబాద్, సిక్రిందాబాద్,
మెదక్ జిల్లాలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్
సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.
పైలెట్ ప్రాజెక్ట్‌గా ఇక్కడ ఎనీవేర్
రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టగా
త్వరలో రాష్టమ్రంతాట ఈ సౌకర్యాన్ని
వర్తింపజేసేందుకు చర్యలు
తీసుకుంటామన్నారు. ఈలోగా
సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని
అధిగమించేందుకు చర్యలు
తీసుకుంటున్నట్టు మంత్రి తోట
వెల్లడించారు.